Shuru
Apke Nagar Ki App…
తలమడుగు మండలం ఝరి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ప్రధాన్ సంఘం అధ్యక్షులు దుర్వ నగేష్ అల్లుడి వివాహానికి వచ్చిన వీరు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
AlluriMahesh
తలమడుగు మండలం ఝరి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ప్రధాన్ సంఘం అధ్యక్షులు దుర్వ నగేష్ అల్లుడి వివాహానికి వచ్చిన వీరు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- స్వయం సేవక్‌గా, ఎబివిపి కార్యకర్తగా నా ప్రస్థానం మొదలైంది. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ పార్టీ జెండాను కింద పడనివ్వను. ఎన్ని కష్టాలొచ్చినా తలెత్తుకునే పని చేస్తాను కానీ, తలవంచే పని చేయను. ఈ ధర్మయుద్ధంలో నా వెంటే ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి.1
- ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.1
- తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. క్వింటాల్‌కు ₹500 నష్టపోవడంతో పాటు, 12.5 కిలోల తరుగు పేరుతో దోపిడీకి గురవుతున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు మోర్తాడ్‌లో భారీ నిరసనకు ఆయన పిలుపునిచ్చారు.1
- నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర గోదావరి తీరంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్తు వృధా అవుతోంది. విద్యుత్తు పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు జరగక, రైతుల పంట కళ్లాల్లోనే నెల రోజులుగా ఉండిపోయింది. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో పశువులు ధాన్యాన్ని మేసేస్తున్నాయి; అకాల వర్షాలు, వడ్డీల భారం రైతులను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.2
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ దీక్ష చేపట్టారు. వారు కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో ఇందూర్ పోచమ్మ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు బోనాలు సమర్పించగా, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు తమ కుటుంబాలు, గ్రామం పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.1