Shuru
Apke Nagar Ki App…
కరీంనగర్ నగరంలోని ఓ బేకరీలో పుట్టినరోజు వేడుకల కోసం ఆర్డర్ చేసిన కేకులో ఫంగస్ రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేకును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న బాధితుడు, కేకును కట్ చేయగానే అందులో ఫంగస్ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే కొంతమంది చిన్నారులు ఆ పాడైపోయిన కేకును తిన్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఫంగస్ విషయంపై సదరు బేకరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారు కేవలం “సారీ” చెప్పి, తమ తప్పైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి బేకరీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
OM NAMSHIVAYA
కరీంనగర్ నగరంలోని ఓ బేకరీలో పుట్టినరోజు వేడుకల కోసం ఆర్డర్ చేసిన కేకులో ఫంగస్ రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేకును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న బాధితుడు, కేకును కట్ చేయగానే అందులో ఫంగస్ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే కొంతమంది చిన్నారులు ఆ పాడైపోయిన కేకును తిన్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఫంగస్ విషయంపై సదరు బేకరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారు కేవలం “సారీ” చెప్పి, తమ తప్పైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి బేకరీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
More news from Telangana and nearby areas
- కరీంనగర్ నగరంలోని ఓ బేకరీలో పుట్టినరోజు వేడుకల కోసం ఆర్డర్ చేసిన కేకులో ఫంగస్ రావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కేకును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సంతోషంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న బాధితుడు, కేకును కట్ చేయగానే అందులో ఫంగస్ ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అప్పటికే కొంతమంది చిన్నారులు ఆ పాడైపోయిన కేకును తిన్నారని బాధితుడు వాపోయాడు. ఈ ఫంగస్ విషయంపై సదరు బేకరీ సిబ్బందిని ప్రశ్నించగా, వారు కేవలం “సారీ” చెప్పి, తమ తప్పైందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి బేకరీలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.4
- కామారెడ్డిలో యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా తమ పనులు జరగకపోవడంతో వినియోగదారుల సహనం నశించి, ఈరోజు బ్యాంక్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వేస్తున్న వడ్ల పైసలు (ధాన్యం డబ్బులు) ఖాతాల్లో జమ అయినా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతు రుణాలు, పంట రుణాలు సకాలంలో అందడం లేదు. యూనియన్ బ్యాంక్‌ను నమ్ముకుంటే అడుగడుగునా కష్టాలే మిగులుతున్నాయని, గంటల తరబడి లైన్లలో నిలబడినా 'సర్వర్ లేదు', 'లింక్ లేదు' అంటూ సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. 'మాకు ఈ బ్యాంక్ వద్దు.. మా ఊరికి వెంటనే మరో బ్యాంక్ కావాలి' అంటూ ఆవేదనతో నినదించారు. బ్యాంక్ వద్ద ఉద్రిక్తత నెలకొందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక మాజీ ఎంపీటీసీ నీరజ గారి భర్త సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చెందుతున్న ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన, యూనియన్ బ్యాంక్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గమనించిన ఆయన, వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇక్కడి ప్రజల అవస్థలను, రైతుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కేవలం ఒకే బ్యాంక్ ఉండటం వల్ల పని భారం పెరిగి సేవలు అందడం లేదని వివరించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగిందని, దానికితోడు రైతులకు సంబంధించిన లావాదేవీలు కోట్లలో జరుగుతున్నాయని, వేలాది మంది ఒకే బ్యాంక్‌పై ఆధారపడటం వల్ల ప్రతిరోజూ నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన శాఖను ఏర్పాటు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. బీబీపేట్ మండల కేంద్రంలో ఎస్‌బీఐ (SBI) నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసేందుకు తక్షణమే సర్వే నిర్వహించి, అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించి కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఎస్‌బీఐ బ్యాంక్ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగినా పనులు కాని యూనియన్ బ్యాంక్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.1
- కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా భవన్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యాసంస్థలను రద్దు చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కంకం కుమారస్వామి మాట్లాడుతూ, వచ్చేనెల 10వ తేదీన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నిరసన ప్రదర్శన అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, ప్రైవేటు విద్యా బాధితుల తల్లిదండ్రులు, అనేక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రైవేటు విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రైవేటు విద్యాసంస్థలను ప్రభుత్వం అండర్‌టేకింగ్ చేసుకొని ఆధీనంలో నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న సిబ్బందిని ప్రభుత్వ అండర్‌టేకింగ్ ఉద్యోగులుగా గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే తెలంగాణ ఉద్యమకారుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో తక్షణమే ఉచిత విద్యను అందించాలని లేదా 50% రాయితీతో కూడిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఆంధ్ర ఉపాధ్యాయులు, లెక్చరర్లకు అవకాశాలు కల్పించకూడదని, తెలంగాణ బిడ్డలకు, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ప్రైవేటు వ్యవస్థ రద్దు చేసి, ఉచిత ప్రభుత్వ విద్యను ప్రవేశపెడతామని తమ మేనిఫెస్టోలో మొదటి అంశంగా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు గరిక కోటేశ్వర్, టౌన్ అధ్యక్షులు గాలి రమేష్ యాదవ్, కనకం నరసయ్య, ఉత్తర తెలంగాణ మహిళా అధ్యక్షురాలు కార్పాకల మున్నా, సిరిసెట్టి భాగ్యలక్ష్మి, తునికి వనజ, పెద్దపల్లి భారతక్క, ఆవారు లత, బాలామణి, కోమల, సత్యలక్ష్మి, గౌరీ, విజయ, రాజమ్మ, సుజాత రెడ్డి, సత్యవతి, దేవేంద్ర రెడ్డి, షబ్బీర్, అసీం ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.1
- కరీంనగర్‌లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రత్యేకమైన అద్భుతాన్ని ఆవిష్కరించింది, ఇదంతా 'శ్రీనివాసుల మయం'గా మారడంతో అక్కడి వాతావరణం మరింత విశేషంగా నిలిచింది. ఈ పెళ్లిలో పెళ్లికొడుకు పేరు శ్రీనివాస్ కాగా, ఆయన పిల్లనిచ్చిన మామ పేరు కూడా శ్రీనివాసే. అంతేకాకుండా, మేనమామ పేరు కూడా శ్రీనివాస్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి పందిరిలో శ్రీనివాస్ అని పిలిస్తే ముగ్గురు ఒకేసారి హు అని పలకడం ఈ వేడుకకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ పేరుగల వ్యక్తులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ దృశ్యాన్ని చూసిన బంధుమిత్రులంతా 'అంతా శ్రీనివాసుల మయం' కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ వుట్కూరి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి అరుదైన, అద్భుతమైన దృశ్యానికి వేదికైన కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుందని పేర్కొన్నారు.1
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బాలవికాస్ సంస్థ మరియు సన్‌రైజ్ హాస్పిటల్ సంయుక్తంగా ఒక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరంలో గ్రామస్తులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు జరిపి, రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలను గుర్తించారు. వైద్యులు తగిన సలహాలు, చికిత్స సూచనలు అందించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిగుల్లా మోహన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శేషి వినీత్, డాక్టర్ రమణి, డాక్టర్ వినయ్, వార్డు సభ్యులు మంకాళి మోహన్, ఒగ్గు కానుకయ్య, సన్‌రైజ్ హాస్పిటల్ క్యాంపు మేనేజర్ కొత్తూరి రాజేందర్, బాలవికాస్ ప్రతినిధులు అన్నమేరి, సుజాత, సన్‌రైజ్ బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం, ఐపీఎస్, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ హుజురాబాద్ డివిజన్ పరిధిలో 21 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్, సైబర్ గేమింగ్ అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు, అలాగే రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 'రహవీర్' పథకం ద్వారా రూ.25 వేల బహుమతిని ప్రకటించారు. గురువారం నాడు సైదాబాద్ గ్రామంలో 16 సీసీ కెమెరాలను, కొరపల్లి గ్రామంలో 5 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. అనంతరం జమ్మికుంట పట్టణ మరియు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రజలతో ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి గ్రామం, పట్టణం, మరియు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను సీసీటీవీ నిఘా నీడలోకి తీసుకురావడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమని సీపీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలో మరో 700 కొత్త కెమెరాలను అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సదస్సులో సీపీ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా, చిన్న పిల్లలు మరియు యువత ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాలకు గురై డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కరీంనగర్ జిల్లాలోనూ వెలుగుచూస్తున్నాయని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. అలాగే, యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 'డయల్ 100' కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. యువత మత్తుకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని నొక్కిచెప్పారు. రోడ్డు భద్రత విషయంలో, వాహనదారులు, ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్ సర్పంచ్ రాజారామ్, కొరపల్లి సర్పంచ్ మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు సీపీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ శాంతిభద్రతల పరిరక్షణకు ‘సీసీ కెమెరాల’ నిఘా అత్యంత కీలకమని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం పునరుద్ఘాటించారు.2
- మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ అధినేత ప్రభుత్వం తమ పార్టీ అధినేత మహారాష్ట్ర మహారాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ అధినేత1