Shuru
Apke Nagar Ki App…
తక్కువ వర్షపాతంతో పండే పంటలైన పెసర, మినిమ, ఉలవ, రాగి, మొక్కజొన్న, కంది పంటలను రైతులు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అమరశివ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలినినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవడంతో చెరువులోనీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయపంటలపై రైతులు దృష్టి పెట్టాలని తెలియజేశారు. 300 హెక్టార్లుకు మినుములు, 150 హెక్టర్లుకు పె సర, 180 హెక్టార్లకు రాగి, 105 హెక్టార్లకు మొక్కజొన్న, 70 హెక్టార్లుకు వేరుశనగ విత్తనాలు పంపిణీకి సిద్ధం చేయుటకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే వరి పంట వేసుకొని రైతులు ఈ నెల ఆఖరిలోగా పంటల భీమా చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఎరువులు కూడా అనుకున్నంత స్థాయిలో రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, వ్యవసాయ శాఖ పరంగా సిబ్బంది రైతులకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
పెద్దింటి రామకృష్ణ
తక్కువ వర్షపాతంతో పండే పంటలైన పెసర, మినిమ, ఉలవ, రాగి, మొక్కజొన్న, కంది పంటలను రైతులు వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అమరశివ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలినినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవడంతో చెరువులోనీరు లేకపోవడంతో ప్రత్యామ్నాయపంటలపై రైతులు దృష్టి పెట్టాలని తెలియజేశారు. 300 హెక్టార్లుకు మినుములు, 150 హెక్టర్లుకు పె సర, 180 హెక్టార్లకు రాగి, 105 హెక్టార్లకు మొక్కజొన్న, 70 హెక్టార్లుకు వేరుశనగ విత్తనాలు పంపిణీకి సిద్ధం చేయుటకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే వరి పంట వేసుకొని రైతులు ఈ నెల ఆఖరిలోగా పంటల భీమా చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఎరువులు కూడా అనుకున్నంత స్థాయిలో రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, వ్యవసాయ శాఖ పరంగా సిబ్బంది రైతులకు ఏ విధమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ₹4.43 కోట్ల నిధులతో 8 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు NH-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు ఈ రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కల నేడు సాకారం కానుంది. రహదారి నిర్మాణం పూర్తయితే విశ్వనాథపురం, కొత్తవలసతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రధాన రహదారులతో గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రహదారి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, మెరుగైన రవాణా సౌకర్యాలతో ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజల ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. “అభివృద్ధికి రహదారులే కీలకం.. ప్రతి ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే మా లక్ష్యం” అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ1
- విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.1
- రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన1
- A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals1
- నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు1
- అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. “యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.1
- విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.1