మహోన్నత మూర్తికి సమున్నత నివాళి పుర చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగము ప్రపంచ దేశాలలో చిరస్థాయిగా నిలిచిందని కల్లూరు మున్సిపాలిటీ సంఘం చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అన్నారు. మంగళవారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కిష్టయ్య బంజర గ్రామంలో జంగం నరసింహారావు ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో నూతనంగా అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్న గ్రామమైన అంబేద్కర్ పై ఉన్న అభిమానంతో ఆయన వ్రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలు స్వీకరించి అన్ని దేశాలలో ప్రజలకు సమానత్వపు హక్కులను అందించి పుట్టిన బిడ్డ నుండి మరణించే వ్యక్తి వరకు అనేక విధాలుగా అన్ని కులాలకు సమాంతరంగా హక్కులను కల్పించి ప్రతి భారతీయ పౌరుడు తమ ఓటు హక్కును ఉపయోగించుకునేలా స్వేచ్ఛ జీవిగా తమ కులాన్ని మతాన్ని సగర్వంగా చెప్పుకునేలా రాజ్యాంగంలో హక్కులను కల్పించి ప్రభుత్వ ఉద్యోగాలలో గొప్ప స్థానాన్ని కల్పించిన ఏకైక మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు, భూపాలపల్లి జిల్లా ఉద్యమ శాఖ అధికారి జినుగు మరియన్న, కల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉబ్బన రాంబాబు,గుండ్ల పుల్లారావు,యాస నాగమణి శ్రీకాంత్, ఉపాధ్యాయులు దామాల ప్రసాద్, శ్రీనివాసరావు బీరవల్లి, సురేష్ ముత్తమాల, బైర్ల కాంతారావు, పెరుమాళ్ళ ముత్తయ్య, కట్టా అర్లప్ప వేము సాగర్, వాడపల్లి శ్రీనివాసరావు, వేము రాజు, పెరుమాళ్ళపల్లి రాంబాబు, అమర్లపూడి సతీష్, శరత్, సురేష్, జంగం యాకోబు, బాలరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- వరంగల్ జిల్లా, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పలువురు ప్రసంగించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, స్థానిక ప్రజల భాగస్వామ్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.3
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- ఈ సందర్భంగా సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కూసంపూడి మహేష్ అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయానికి విచ్చేసిన నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందిన నాయకులు ప్రజల సుఖశాంతి, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం ఘనంగా కొనసాగింది.1