ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో 2026- 27 సంవత్సరం పత్తి మద్దతు ధర, సేకరణ పై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పత్తి మద్దతు ధరను క్వింటాలుకు 8100/- నుండి 8867/- రూపాయలకు పెంచిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 557/- రూపాయలు అధికమని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 6% పెరిగిందని, రెండు లక్షల 40 వేల హెక్టార్లలో రైతులు పత్తి పండిస్తున్నారని, సుమారు 14 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పత్తి కొనుగోలుకు గాను జిల్లాలో 31 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, అక్టోబర్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు. పత్తి సేకరణలో గత సంవత్సరం ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పత్తికి మద్దతు ధర పొందేందుకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని, ముందుగా క్రాప్ బుకింగ్ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, పత్తి పంట క్రాప్ బుకింగ్ ముందుగా పూర్తి చేయాలని, పత్తిని పండించిన రైతు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ముందు నుండే అవగాహన కల్పించాలని, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను ఆదేశించారు. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర 8867/-రూపాయలు పొందేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఇతర అధికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉండాలని, అలాగే ఎలాంటి దుమ్ము లేకుండా కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని, కపస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే పత్తి కొనుగోలుకు అవకాశం ఉందని, 8 రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, అయితే ప్రైవేటు జిన్నింగ్ మిల్లులు ద్వారా పత్తి కొనుగోలు చేస్తే మద్దతు ధరను మించి కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. పత్తి కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితులలో వ్యాపారులు మోసం చేయకూడదని, నాణ్యత ప్రమాణాలు ఉన్నప్పటికీ లేనట్లుగా చూపించి ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పత్తి కొనుగోళ్ల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని కూడా నియమిస్తామని, సిసిఐ తో పాటు, మార్కెటింగ్ ఇతర అధికారులు పత్తి రైతుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. గత సంవత్సరం జిల్లాలోని జిన్నింగ్ మిల్లులకు కాకుండా వరంగల్, జనగాం జిన్నింగ్ మిల్లులకు ఎక్కువగా పత్తిని కేటాయించడం వల్ల జిల్లా రైతులు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువగా భరించాల్సి వచ్చిందని, జినింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ సంవత్సరం ముందుగా జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు పత్తిని కేటాయించిన తర్వాతే ఇతర జిల్లాల కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశం తీర్మానించింది. దేవరకొండ, నకిరేకల్, మునుగోడు తదితర ప్రాంతాల నుండి పత్తి ఎక్కువగా వస్తున్నందున ప్రత్తి కొనుగోళ్ల సమయంలో ఏలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ,త్వరగా ప్రత్తిని కొనుగోలు చేసే విధంగా అవసరమైన సహకారం అందించాలని అడిషనల్ ఎస్పీ రమేష్ తో కలెక్టర్ కోరారు. మిల్లుల వద్ద ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరగా కొనుగోలు చేసే విధంగా పత్తి నాణ్యత ప్రమాణాలపై పతి రైతులకు అవగాహన కల్పించాలని, అలాగే పత్తి అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా ఎఫ్ సి ఐ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి బేళ్ళ తేమశాతం ఎలా తెలుసుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని, ప్రతి జిన్నింగ్ మిల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పత్తి నాణ్యత ప్రమాణాలు, స్లాట్ బుకింగ్ ,తదితర అంశాలపై స్థానిక మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,సి సి ఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ అగర్వాల్, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, పత్తి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, పత్తి మార్కెట్ సెక్రటరీలు, సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, పత్తి మిల్లుల ఓనర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ సంవత్సరం పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో 2026- 27 సంవత్సరం పత్తి మద్దతు ధర, సేకరణ పై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రభుత్వం పత్తి మద్దతు ధరను క్వింటాలుకు 8100/- నుండి 8867/- రూపాయలకు పెంచిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 557/- రూపాయలు అధికమని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 6% పెరిగిందని, రెండు లక్షల 40 వేల హెక్టార్లలో రైతులు పత్తి పండిస్తున్నారని, సుమారు 14 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పత్తి కొనుగోలుకు గాను జిల్లాలో 31 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, అక్టోబర్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ వెల్లడించారు. పత్తి సేకరణలో గత సంవత్సరం ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, పత్తికి మద్దతు ధర పొందేందుకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని, ముందుగా క్రాప్ బుకింగ్ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, పత్తి పంట క్రాప్ బుకింగ్ ముందుగా పూర్తి చేయాలని, పత్తిని పండించిన రైతు పత్తిని అమ్ముకునేందుకు స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ముందు నుండే అవగాహన కల్పించాలని, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను ఆదేశించారు. ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర 8867/-రూపాయలు పొందేందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, ఇతర అధికారులు పెద్ద ఎత్తున రైతులకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉండాలని, అలాగే ఎలాంటి దుమ్ము లేకుండా కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని, కపస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే పత్తి కొనుగోలుకు అవకాశం ఉందని, 8 రోజుల ముందు స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా
పత్తి కొనుగోలు చేయడం జరుగుతుందని, అయితే ప్రైవేటు జిన్నింగ్ మిల్లులు ద్వారా పత్తి కొనుగోలు చేస్తే మద్దతు ధరను మించి కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ కోరారు. పత్తి కొనుగోలులో రైతులను ఎట్టి పరిస్థితులలో వ్యాపారులు మోసం చేయకూడదని, నాణ్యత ప్రమాణాలు ఉన్నప్పటికీ లేనట్లుగా చూపించి ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, పత్తి కొనుగోళ్ల సమయంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని కూడా నియమిస్తామని, సిసిఐ తో పాటు, మార్కెటింగ్ ఇతర అధికారులు పత్తి రైతుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. గత సంవత్సరం జిల్లాలోని జిన్నింగ్ మిల్లులకు కాకుండా వరంగల్, జనగాం జిన్నింగ్ మిల్లులకు ఎక్కువగా పత్తిని కేటాయించడం వల్ల జిల్లా రైతులు ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువగా భరించాల్సి వచ్చిందని, జినింగ్ మిల్లుల అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ సంవత్సరం ముందుగా జిల్లాలో ఉన్న జిన్నింగ్ మిల్లులకు పత్తిని కేటాయించిన తర్వాతే ఇతర జిల్లాల కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని సమావేశం తీర్మానించింది. దేవరకొండ, నకిరేకల్, మునుగోడు తదితర ప్రాంతాల నుండి పత్తి ఎక్కువగా వస్తున్నందున ప్రత్తి కొనుగోళ్ల సమయంలో ఏలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ,త్వరగా ప్రత్తిని కొనుగోలు చేసే విధంగా అవసరమైన సహకారం అందించాలని అడిషనల్ ఎస్పీ రమేష్ తో కలెక్టర్ కోరారు. మిల్లుల వద్ద ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా త్వరగా కొనుగోలు చేసే విధంగా పత్తి నాణ్యత ప్రమాణాలపై పతి రైతులకు అవగాహన కల్పించాలని, అలాగే పత్తి అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేలా ఎఫ్ సి ఐ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి బేళ్ళ తేమశాతం ఎలా తెలుసుకోవాలో రైతులకు అవగాహన కల్పించాలని, ప్రతి జిన్నింగ్ మిల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పత్తి నాణ్యత ప్రమాణాలు, స్లాట్ బుకింగ్ ,తదితర అంశాలపై స్థానిక మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,సి సి ఐ అసిస్టెంట్ మేనేజర్ దిలీప్ అగర్వాల్, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, పత్తి కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, పత్తి మార్కెట్ సెక్రటరీలు, సంబంధిత శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, పత్తి మిల్లుల ఓనర్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
- భువనగిరి: ఫీజు బకాయిలపై బీజేపీ పార్టీ నాయకుల నిరసన.... విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపుతో భువనగిరిలో నాయకులు నిరసన చేపట్టారు. 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్తోపాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.1
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్న హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు. ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలనీ ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా. అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి విజయవాడ భారతి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి సాయని మంగళవారం బోయినపల్లిలోని ప్రభుత్వ గిరిజన వాటర్ స్పోర్ట్స్ అకాడమీని సందర్శించి, అక్కడి విద్యార్థుల జీవన పరిస్థితులు, వసతి సదుపాయాలు, ఆహారం, విద్య, పారిశుధ్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయభారతి సాయని విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అవసరాలు, అందుతున్న సదుపాయాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కూర్చొని వారి ఆహారం, చదువు, వసతి మరియు రోజువారీ జీవన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. NHRC బృందం పరిశీలన సందర్భంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, హాస్టల్ వెల్ఫేర్ అధికారి తదితర సంబంధిత ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- భువనగిరి మండల కేంద్రములో యూత్ కాంగ్రెస్ నాయకుల ధర్నా.. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కాంగ్రెస్ అధినేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్రె జహంగీర్, ఆవేస్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి కారణం...👆🏻 #genz #genzaddawithteenmarmallanna #trp #bccm1
- హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.1