logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు సోకే గాలి కుంటు వ్యాధి నివారణకు టీకా కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి టీకాలు వేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. గాలికుంటు వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా టీకాలు వేయించడం అవసరమని సూచించారు. ప్రభుత్వం రైతుల పశుసంపదను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విడీదినేని శ్రీలత,అశోక్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కుమారస్వామి, తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి,ఎంపీడీవో ఎల్ భాస్కర్, గణపురం పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్,బాలకృష్ణ,,ధర్మరావుపేట సర్పంచి పూజారి రాజేందర్ గౌడ్,ఉప సర్పంచ్ మారబోయిన ఐలయ్య, పశువైద్య సిబ్బంది అనిల్ రైతులు పాల్గొన్నారు.

1 hr ago
user_User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
Farmer Ghanpur (Mulug), Jayashankar Bhupalapally•
1 hr ago
19f15893-c6bd-4d6c-9b88-76769a443dfa

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గణపురం : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు సోకే గాలి కుంటు వ్యాధి నివారణకు టీకా కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి టీకాలు వేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

0e323feb-8209-4f12-b1f3-be06dd88e406

పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. గాలికుంటు వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా టీకాలు వేయించడం అవసరమని సూచించారు. ప్రభుత్వం రైతుల పశుసంపదను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విడీదినేని శ్రీలత,అశోక్, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కుమారస్వామి, తాసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి,ఎంపీడీవో ఎల్ భాస్కర్, గణపురం పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి డాక్టర్,బాలకృష్ణ,,ధర్మరావుపేట సర్పంచి పూజారి రాజేందర్ గౌడ్,ఉప సర్పంచ్ మారబోయిన ఐలయ్య, పశువైద్య సిబ్బంది అనిల్ రైతులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    1
    వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు.
అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు.
డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు.
నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.
ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.
దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_RAJESH KUMAR (GODsSON)
    RAJESH KUMAR (GODsSON)
    Social Media Manager మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    38 min ago
  • రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్‌ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
    1
    రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్‌ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
    user_Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
    Ajay Doddi (ఉమ్మడి కరీంనగర్)
    Journalist కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    1
    యుద్ధ ప్రభావం ఎరువుల ఉత్పత్తి పై చూపుతుంది. గ్యాస్ కొరతతో రామగుండం ఎరువుల కర్మాగారంలో సగానికిపైగా ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇప్పటికే యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యుద్ద ప్రభావంతో గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి తగ్గడంతో రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ ఆధారిత రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3850 టన్నుల ఎరువులు ఉత్పత్తి కావలసి ఉండగా ప్రస్తుతం సగానికి పైగా ఉత్పత్తి తగ్గింది. గ్యాస్ సప్లై లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఎరువుల ఉత్పత్తి మరింత క్షీణించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్నాయంగా అత్యవసరాలకు ఎన్పీడీసీఎల్ విద్యుత్తును వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత ఐదు నెలలుగా ఎలాంటి అంతరాయాలు లేకుండా RFCL లో ఎరువుల ఉత్పత్తి కొనసాగుతుండగా గ్యాస్ కొరతతో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్ఎఫ్సీఎల్ లో రోజుకు 3850 టన్నుల ఎరువుల ఉత్పత్తి కావాల్సి ఉండగా అందులో సగం కూడా ప్రస్తుతం ఉత్పత్తి కావడం లేదు. వార్షిక లక్ష్యం 12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి కాగా, ఫిబ్రవరి మాసాంతానికి 8 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది. ఈనెలలో ఇప్పటి వరకు 1900 టన్నుల ఎరువులు ఉత్పత్తి అయింది.
దేశవ్యాప్తంగా గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    1
    తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...*
*ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...*
*నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...*
సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!*
పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!!  ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని విద్యా నిలయ స్కూల్‌లో మంగళవారం బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. బాలల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓతో పాటు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని విద్యా నిలయ స్కూల్‌లో మంగళవారం బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. బాలల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓతో పాటు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.