logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వినాయక నిమజ్జనంలో 'డీజే' మోగిస్తే.. బండి సీజ్! నిర్వాహకులపై కేసు రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్.. పీలేరు, పండుగ వాతావరణంలో శబ్ద కాలుష్యానికి తావులేకుండా, అత్యంత ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు జరగాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. రేపు (16.09.2026, బుధవారం) పీలేరు పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో జరగనున్న గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు రాయచోటి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్ ఒక పత్రికా ప్రకటనలో కరాఖండిగా తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు గత రెండు రోజులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో వినాయక ఉత్సవ కమిటీలు, డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించామని డీఎస్పీ తెలిపారు. డీజేలకు అనుమతి లేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరికీ ముందుగానే స్పష్టం చేశామని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన గుర్తుచేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎవరైనా ఊరేగింపులో డీజేలను వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనాన్ని (ట్రాక్టర్, లారీ తదితర) విడిచిపెట్టే ప్రసక్తే లేదు, దాన్ని అక్కడికక్కడే సీజ్ చేస్తాం. నిషేధం ఉన్నప్పటికీ డబ్బు ఆశతో అద్దెకు ఇచ్చిన డీజే యజమానులపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ప్రజా శ్రేయస్సు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీఎస్పీ కోరారు. పండుగను ఆడంబరాలకు పోకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

13 hrs ago
user_SK masthan saheb
SK masthan saheb
పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago
27fa6752-6631-4571-9889-6b33deab0a68

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?
    1
    పండగ రోజు  పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం 

నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ  పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు 

వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన 

వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ 

ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.
    1
    అక్షర మానసిక వికలాంగుల కేంద్రము నకు తినుబండారాలు వితరణ
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నల్లగాంపల్లెకు చెందిన నీలవేణి ఆశ వర్కర్ తన కుమార్తె కీ.శే. భార్గవి స్మారకార్థం గంగవరం మండలం లో గల "అక్షర" మానసిక వికలాంగులు 50 మంది విద్యార్థులకు తినుబండారాలు బిస్కెట్లు, స్వీట్లు, సేవరీసు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర మానసిక వికలాంగులు విద్యార్థులు భార్గవి ఆత్మ శాంతి స్వర్గలోక ప్రాప్తి కొరకు భగవంతుని ప్రార్థించారు.
    user_Gangamma
    Gangamma
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది. *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం* తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
    4
    *ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం*

తిరుమల, 2026 సెప్టెంబర్ 15:: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్దజీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, కంకణ బట్టర్ శ్రీ వెంకట రాఘవ దీక్షితులు, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, తదితర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం... ​పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. ​ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
    1
    పుంగనూరును పలకరించిన వర్షం: చల్లబడిన వాతావరణం, ప్రజలకు ఉపశమనం...
​పుంగనూరు పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతగానో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో వాతావరణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది.
​ఈ వర్షం రాకతో స్థానిక రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు వర్షాన్ని ఆహ్వానిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
    user_JP Media
    JP Media
    Social worker పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వినాయక చవితి సందర్భంగా కురిసిన వానతో ఆనందంలో రైతులు - ఆహ్లాదంలో పుంగనూరు ప్రజలు. పుంగనూరు, అన్నమయ్య జిల్లా వినాయక చవితి పండగ వేళ పుంగనూరులో కురిసిన చల్లని వర్షంతో పట్టణ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. భక్తితో పాటు ప్రకృతి ఆహ్లాదం తోడవడంతో పండగ వాతావరణం రెట్టింపు అయింది. ఉదయం నుండి వినాయకుడి పూజల్లో నిమగ్నమైన భక్తులకు, సాయంత్రం వేళ కురిసిన చిరుజల్లులు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. చల్లని వాతావరణంలో పిల్లలు, పెద్దలు వీధుల్లో వినాయక మండపాల వద్ద సంబరాలు జరుపుకున్నారు. "వినాయకుడు వచ్చే వేళ వాన రావడం శుభసూచకం" అంటూ వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తంగా వినాయక చవితి పండగ, వాన జల్లు కలిసి పుంగనూరును ఆహ్లాదకరంగా మార్చాయి.
    1
    వినాయక చవితి సందర్భంగా కురిసిన వానతో ఆనందంలో రైతులు - ఆహ్లాదంలో పుంగనూరు ప్రజలు.
పుంగనూరు, అన్నమయ్య జిల్లా
వినాయక చవితి పండగ వేళ పుంగనూరులో కురిసిన చల్లని వర్షంతో పట్టణ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. భక్తితో పాటు ప్రకృతి ఆహ్లాదం తోడవడంతో పండగ వాతావరణం రెట్టింపు అయింది.
ఉదయం నుండి వినాయకుడి పూజల్లో నిమగ్నమైన భక్తులకు, సాయంత్రం వేళ కురిసిన చిరుజల్లులు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. చల్లని వాతావరణంలో పిల్లలు, పెద్దలు వీధుల్లో వినాయక మండపాల వద్ద సంబరాలు జరుపుకున్నారు.
"వినాయకుడు వచ్చే వేళ వాన రావడం శుభసూచకం" అంటూ వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు ఎంతో మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
మొత్తంగా వినాయక చవితి పండగ, వాన జల్లు కలిసి పుంగనూరును ఆహ్లాదకరంగా మార్చాయి.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    1
    రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి
మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    user_SR
    SR
    రామసముద్రం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్ 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    1
    2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్
2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.