Shuru
Apke Nagar Ki App…
అరకు: తల్లిపాల తోనే నవజాత శిశువులో వ్యాధినిరోధక శక్తి వృద్ధి తల్లిపాలు ద్వారా నవజాత శిశువుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, ఇతర ప్రయోజనాలను గర్బిణీలకు, తల్లులకు అరకులోయ సీడీపీఓ లక్ష్మీ లావణ్య వివరించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురష్కరించుకొని అరకులోయ లోని సి కాలని అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లులతో సమావేశమై ఆమె మాట్లాడారు. ఆగష్టు మొదటి వారంలో మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Venkatapplanaidu B
అరకు: తల్లిపాల తోనే నవజాత శిశువులో వ్యాధినిరోధక శక్తి వృద్ధి తల్లిపాలు ద్వారా నవజాత శిశువుకు వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని, ఇతర ప్రయోజనాలను గర్బిణీలకు, తల్లులకు అరకులోయ సీడీపీఓ లక్ష్మీ లావణ్య వివరించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు పురష్కరించుకొని అరకులోయ లోని సి కాలని అంగన్వాడీ కేంద్రంలో శనివారం తల్లులతో సమావేశమై ఆమె మాట్లాడారు. ఆగష్టు మొదటి వారంలో మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.1
- సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.1
- ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... ఈరోజు పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన క్రీడాభిమానులు, యువత మరియు పల్లిసారధి స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు తో దువ్వాడ శ్రీధర్ బాబా.... 1
- 🙏🙏1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.1