తీగుల్‌లో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర ప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తీగుల్ గ్రామంలో రాధా కృష్ణా స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రథమ పూజలు అందుకునే గణనాథుడిని బాజా భజంత్రీల నడుమ గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. రాధా కృష్ణా స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో యూత్ నిర్వాహకులు కార్తీక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్ష్మోజి, రాజు గుప్తా, వెంకట్ రామారావు, దీపక్ శంకర్, విశ్వతేజ రెడ్డి, శివ, రంజిత్, లక్ష్మణ్, రియాజ్, నగేష్, సాయి, కార్తీక్‌తో పాటు యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తీగుల్‌లో అంగరంగ వైభవంగా విఘ్నేశ్వర ప్రతిష్ఠ భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తీగుల్ గ్రామంలో రాధా కృష్ణా స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠాపన కార్యక్రమం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రథమ పూజలు అందుకునే గణనాథుడిని బాజా భజంత్రీల నడుమ
గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. అనంతరం గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. రాధా కృష్ణా స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని
నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో యూత్ నిర్వాహకులు కార్తీక్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, లక్ష్మోజి, రాజు గుప్తా, వెంకట్ రామారావు, దీపక్ శంకర్, విశ్వతేజ రెడ్డి, శివ, రంజిత్, లక్ష్మణ్, రియాజ్, నగేష్, సాయి, కార్తీక్‌తో పాటు యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- తెలంగాణలో MEOల కొరతపై కవిత ఆందోళన ప్రతి మండలానికి ఎంఈఓ ఉండాలి తెలంగాణలో సుమారు 620 మండలాలు ఉండగా, ప్రతి మండలానికి ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (MEO) ఉండాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కవిత అన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 8 మండలాల్లో మాత్రమే పర్మనెంట్ MEOలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. విద్యాశాఖలో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన MEO పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యా పరిపాలనపై ప్రభావం పడుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి శాశ్వత MEOను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- మతోన్మాదవాదులు సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీకి, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మతాలకు అతీతంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందని కానీ కొంత మంది మతోన్మాదులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళ వారం నాడు సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా గుండ్ల గూడెం, పటేల్ గూడెం, శ్రీనివాస పురం గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో పాల్గొన్న ఎసి రెడ్డి నరసింహ రెడ్డి, బొమ్మ కంటి లక్ష్మి నర్సయ్య, గ్యార బాలయ్య, ఏంటిక రాములు , గ్యార సిద్దయ్య తదితరుల స్థూ పాలకు. పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడమైనది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గానీ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో గానీ పాల్గొనని వారు నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బ్రిటిష్ పాలకులకు లొంగిపోయి వారి అనుకూలంగా వ్యవహరించిన శక్తులు నేడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ–ముస్లిం పోరాటంగా వక్రీకరించడం ద్వారా ప్రజల మధ్య మత విభజనలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. నిజాం ముస్లిం పాలకుడైనప్పటికీ తెలంగాణలోని అనేక మంది భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు హిందువులే ఉన్నారని, దోపిడీకి మతం లేదని అన్నారు. పేద రైతులు, కూలీలు, మహిళలు, అణగారిన వర్గాలు కుల, మత భేదాలను అధిగమించి సాగించిన ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాలను ఓట్ల కోసం వక్రీకరించడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాస్తవ చరిత్రను ప్రజలకు తెలియజేస్తూ వారి ఆశయాల సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని మల్లేశం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.M.A ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్య రాజయ్య, జూకంటి పౌల్, మిట్ట శంకరయ్య, నల్ల మాస తుల శయ్య, పిక్క గణేష్ మోరీ గాడి రమేశ్, సంగీ రాజు, బొమ్మకంటి లక్ష్మి నారాయణ,గణ గాని మల్లేష్, చౌడ బోయిన యాదగిరి, వడ్డే మాను బాలరాజు, పారుపల్లి సత్తయ్య, గ్యార భాస్కర్ మడిపల్లి ఆంజనేయులు, చెక్కిళ్ళ ఉపేంద్ర, మిట్ట పార్వతమ్మ, దూసరి మల్లమ్మ, ఈదు నూరి కిష్టయ్య, సోమక్క, గ్యార అండాలు ,మిట్ట బిక్షపతి, చెక్కిళ్ళ గౌరమ్మ, ఎల్లమ్మ, అంజమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు1
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణకు భారీగా తరలివచ్చిన భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామి వారిని దర్శించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1
- సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ఘనంగా ప్రత్యేక పూజలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ హాజరు గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం అందుకున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్, దీపక్ జాన్ ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.4
- రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం శివంపేట మండలం గూడూరు గ్రామంలోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత మేరకు వచ్చింది.. అందులో ఎంత ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించారు.. ప్రస్తుతం మిల్లులో ఎంత ధాన్యం నిల్వ ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయి నిల్వలను లెక్కించారు. ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరా, ప్రస్తుత నిల్వలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.1
- కవులు కళాకారుల ఐక్యవేదిక, జనగామ ఆధ్యర్యంలో అభినందన సభ శ్రీ బేతి వీరారెడ్డి గారికి తెలంగాణ శాసనసభ సహాయ కార్యదర్శిగా విధి నిర్వహణలో ఉంటూ, తమ ఉన్నతమైన నైపుణ్యాల అధ్యయనంలో భాగంగా విదేశాల్లో పర్యలోంచి విజయవంతంగా స్వదేశానికి విచ్చేసిన వేదిక: పెంబత్తి గ్రామం గ్రామ పంచాయతి దగ్గర శ్రీ. నెల్లుట్ల రవీందర్ రావు గారికి నిరంతర సామాజిక సేవా వికాసమే ధ్యేయం నెల్లుట్ల ఫౌండేషన్ ద్వారా కళా, సాహిత్య, సామాజక సేవారంగాల్లో తమ నిరప,మాన సేవ గానూ ఇదేవల జాతీయ స్థాయిలో ప్రతిష్టాత పురస్కారాలు అందుకున్న 3໖: 20-09-2026 ఆదివారం సమయం: ৯ :6:00 e గ్రామ సర్పంచ్ శ్రీమతి చిన్నబోయిన రేఖరాజు గారి సహకారంతో అందరు ఆహ్వానితులే... ACCవర్కింగ్ కమిటీ జి. కృష్ట (జ.వై.గిరి ఫౌండేషన్) పెట్లోజు సోమేశ్వరాచారి (కవి హ్యధయం సాహిత్య వేదిక) అయిలా సోమనర్సింహాచా (అభినందన కల్వరల్ సొసైటీ- పెఁ లగిశెట్టి సభాకర్ చిలుమోజు సాయికిరణ్ గడం మనోజ్ కుమార్ గౌ3
- కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1