logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఈ జాబ్ మేళ నిర్వహించనున్నారని , ఈ జాబ్ మేళాలో వివిధ ప్రముఖ సంస్థల్లో 250కి పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాన్సెంట్రిక్స్, అరబిందో ఫార్మా (ఆప్టిమాఫార్మా), హోబెల్ బెలోస్ కో., ఫోర్టే మేనేజ్మెంట్, అపోలో టైర్స్, కియా ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్, న్యూల్యాండ్ ల్యాబ్స్, ఏ యు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని ఆయన తెలిపారు.

15 hrs ago
user_Venkata Ramana Murthy K
Venkata Ramana Murthy K
Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago
1bbd2c1b-7965-482d-8b3d-f0707bf4428a

ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు.ఈ నెల 27వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఈ జాబ్ మేళ నిర్వహించనున్నారని , ఈ జాబ్ మేళాలో వివిధ ప్రముఖ సంస్థల్లో 250కి పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాన్సెంట్రిక్స్, అరబిందో ఫార్మా (ఆప్టిమాఫార్మా), హోబెల్ బెలోస్ కో., ఫోర్టే మేనేజ్మెంట్, అపోలో టైర్స్, కియా ఇండియా, రాయల్ ఎన్ఫీల్డ్, న్యూల్యాండ్ ల్యాబ్స్, ఏ యు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయని ఆయన తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి.....
సాలి హుండాం బౌద్ధారామం
గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ  ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    2
    రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి
విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు
రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. 
ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో  ఉన్న జిల్లా పరిషత్  బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • విజయవాడ గురించి వర్ణిస్తున్న అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    1
    విజయవాడ గురించి వర్ణిస్తున్న  అభిప్రాయాలు. పురాతన చరిత్ర, గొప్పతనం
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో  సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    1
    నిత్యవసర సరుకుల ధరలు పెరుగుదల నియంత్రించాలి. సోషలిస్ట్ పార్టీ
నిత్యవసర సరుకులు ధరలు పెరుగుదల నియంత్రించాలని  సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎస్ శ్రీనివాసరావు విజయనగరం పట్టణం పార్టీ ఆఫీసులో మంగళవారం మీడియాకి తెలిపారు. నిత్యవసర సరుకులు బియ్యం, పంచదార తదితర సరుకులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రభుత్వం, అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • విజయనగరం జిల్లా రాజ్యాంలో హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తోంది.. రాజం శారది రోడ్లో ఉన్న జిల్లా పరిషత్తు బాలికలు ఉన్నత పాఠశాల, బాలికలు జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న కడప రమా తమ బంధువులు పెళ్లి వేడుకల్లో కొంతమంది బాలికలను రోడ్డుపై స్టెప్పులు వేయించడం స్థానికంగా విమర్శలు విలువతున్నాయి.. విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించడం స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించును ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    4
    విజయనగరం జిల్లా రాజ్యాంలో హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తోంది.. రాజం శారది రోడ్లో ఉన్న జిల్లా పరిషత్తు బాలికలు ఉన్నత పాఠశాల, బాలికలు జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్న కడప రమా తమ బంధువులు పెళ్లి వేడుకల్లో కొంతమంది బాలికలను రోడ్డుపై స్టెప్పులు వేయించడం స్థానికంగా విమర్శలు విలువతున్నాయి..
విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో  ఉన్న జిల్లా పరిషత్  బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించడం స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించును ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు. ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    1
    బొడ్డేపల్లి రామకృష్ణారావుకు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్’ అవార్డు
విజయనగరం, ఆగస్టు 25: నిరంతర రక్తదాతగా, భారత మాజీ వాయుసేనికుడిగా, విశ్రాంత ఉపాధ్యాయుడిగా, సామాజిక సేవకుడిగా విశిష్ట సేవలందిస్తున్న బొడ్డేపల్లి రామకృష్ణారావును 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ గుడ్ టైమ్స్, రాజస్థాన్‌లోని కోటా సంస్థ ప్రతినిధులు ‘మీట్ ది నేషనల్ ఐకాన్స్ (సక్షియత్)’ అవార్డుతో సత్కరించారు.
ఆన్‌లైన్ ద్వారా అందిన ఈ అవార్డును విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు చేతుల మీదుగా రామకృష్ణారావు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.వి.ఎస్. ప్రసాదరావు మాట్లాడుతూ రామకృష్ణారావు చేస్తున్న సేవలను అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని, త్వరలోనే గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది నారాయణరావు, అనిల్, రమేశ్‌రాజు, శివ తదితరులు పాల్గొని రామకృష్ణారావును అభినందించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్ ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.
    1
    శ్రీకాకుళం జిల్లాలో నీట్ పీజీ పరీక్షకు మూడు కేంద్రాలు : కలెక్టర్
ఈ నెల 30న ఆదివారం జరగనున్న నీట్ పీజీ-2026 పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ వెల్లడించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.