logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.... పిడుగుపాటుకు అయ్యోరుపల్లిలో రెండు పాడి గేదెలు మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలో గాలివానతో పాటు పిడుగులు పడ్డాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. పాడి గేదెల మృతితో రైతు ఉల్లెందుల రఘుపతికి లక్ష 50 వేల రూపాయల నష్టం వాటిల్లింది. అదేవిధంగా పలు చోట్ల చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. అకాలవర్షంతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

7 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
7 hrs ago

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.... పిడుగుపాటుకు అయ్యోరుపల్లిలో రెండు పాడి గేదెలు మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో అకాల వర్షం కురిసింది. వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలో గాలివానతో పాటు పిడుగులు పడ్డాయి. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. పాడి గేదెల మృతితో రైతు ఉల్లెందుల రఘుపతికి లక్ష 50 వేల రూపాయల నష్టం వాటిల్లింది. అదేవిధంగా పలు చోట్ల చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. అకాలవర్షంతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.
    2
    బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి  ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం  ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • హైదరాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం సమీపంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని, ఆయన ఆశయాలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    హైదరాబాద్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం సమీపంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని, ఆయన ఆశయాలు సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.
    3
    సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామం ఏప్రిల్ 4 
రామ్ సాగర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి మూడవ వార్షిక మహోత్సవం సందర్భంగా కిందివాడకట్టు ముదిరాజు సభ్యులంతా కలిసి శ్రీ పెద్దమ్మ పెద్దిరాజు ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం ఉదయం గణపతి పూజ పూర్ణా వచనం రక్షబంధనం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం అనంతరం అమ్మవారికి విశేష మూలమంత్ర పతనం అదే క్రమంలో స్వాతి నక్షత్రం గుప్త శుభలగ్నం నందు అంగరంగ వైభవంగా శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజు కుల  బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. అదే క్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ గౌడ్, కొండారి నాగరాజు ముదిరాజ్, కారింగుల దుర్గయ్య ముదిరాజ్ లు అన్న ప్రసాద ములు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాగన్న గారి నరేష్ గౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండారి రమేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొండారు గణేష్ ముదిరాజ్,ఉపాధ్యక్షులు కోశాధికారి కొండారి మైపాల్, ప్రధాన కార్యదర్శి ముదిరాజ్. పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణం లో   కిచ్చు గారి శ్యామల నాగులు దంపతులు పాల్గొన్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు. అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ శ్రేణులు కెసిఆర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ బీఆర్ఎస్, కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించారు.
అంక్షారెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. భారీ వేతనాలు, అలవెన్సులు తీసుకుంటూనే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ తక్షణమే స్పందించి గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిర్వాసిత గ్రామాల్లో పర్యటించాలని సవాలు విసిరారు.
కాంగ్రెస్ నేతలు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపిస్తూ, ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలని ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, వెంకటేష్, జిల్లా మైనార్టీ సెల్ నేత సమీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, నేతలు సత్యలక్ష్మి యాదగిరి, సంతోష రాములు గౌడ్, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, సారిక శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ఆస్గర్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
    4
    వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు.
అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.‌ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.‌ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది.  వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం  ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.