logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు - విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను శనివారం జిల్లాకు విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ , కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మర్యాద పూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసినందుకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,జిల్లా కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి సమన్వయంతో పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురిని ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో కూడా ఇరువురు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు.అదే విధంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసుశాఖ కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ పని తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

1 hr ago
user_Satya Sekhar
Satya Sekhar
విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
33602a24-fef3-4ead-9999-da875d80d8eb

జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను ప్రశంసించిన సీఎం చంద్రబాబు నాయుడు - విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను శనివారం జిల్లాకు విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్

07409496-5413-4e7a-8b26-f5c5f132b018

ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మరియు విద్యాశాఖామాత్యులు నారా లోకేష్ , కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మర్యాద పూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలికారు.అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసినందుకు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్,జిల్లా

462c2cf5-83fa-48ec-bcfb-af0546746262

కలెక్టరు ఎస్.రామసుందర రెడ్డి సమన్వయంతో పని చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరువురిని ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో కూడా ఇరువురు ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు.అదే విధంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీసుశాఖ కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ పని తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నౌపడలో ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో సంతబొమ్మాలి (నౌపడ ) : ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్ నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
    2
    నౌపడలో 
ఛలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ
మండల టిడిపి అధ్యక్షులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో
సంతబొమ్మాలి (నౌపడ ) :  ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజలు విజయవంతం చేయాలని కోరుతూ సంతబొమ్మాళి  మండలం నౌపడలో తెదేపా మండల అధ్యక్షుడు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో చలో భోగాపురం ద్విచక్ర వాహన ర్యాలీ శుక్రవారం రాత్రి నిర్వహించారు. నౌపాడ , సీతానగరం పాలవానిపేట, కూర్మనాథపురం, జగన్నాథపురం, గ్రామాల్లో పలు వీధుల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు,శ్రేణులు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రీ విష్ణుమూర్తి, తెదేపా సీనియర్  నాయకులు వాడరేవు కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం ​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం

​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Press advisory పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    1
    భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం......
భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 min ago
  • వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది. మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి. అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    వరదల వేళ మాల్స్ జాతర... ప్రజల భద్రత గాలికేనా..? జీవి మాల్, కసం సేల్‌కు పోటెత్తిన జనం.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి కొనసాగుతుండగా జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు, లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో పట్టణంలో నిర్వహించిన GV మాల్ ఓపెనింగ్ మరియు కసం ఆషాఢం సేల్ ధమాకా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు వరద పరిస్థితులతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, మరోవైపు వేలాది మంది మహిళలు, చిన్నారులు, యువత షాపింగ్ మాల్స్ వద్దకు చేరుకోవడంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
GV మాల్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్ పరిసర ప్రాంతంలో భారీ జనసందోహం ఏర్పడటంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న సమయంలో ఇలాంటి భారీ కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే ముందు భద్రతా ప్రమాణాలను ఎంత మేర పరిశీలించారనే అంశంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు కసం ఆషాఢం సేల్ ధమాకా నిర్వహించిన ప్రాంగణంలో కూడా మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో తీవ్ర రద్దీ నెలకొంది. జనసమ్మర్థం కారణంగా తోపులాట లేదా తొక్కిసలాట వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర బయటపడే దారులు, అగ్నిమాపక భద్రత, తగిన భద్రతా సిబ్బంది వంటి అంశాలు అత్యంత కీలకమని వారు అభిప్రాయపడుతున్నారు.
స్థానికుల దృష్టిని ఆకర్షించిన మరో అంశం GV మాల్ ముందు ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్. భారీ రద్దీ ఉన్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ భద్రతా ఏర్పాట్లు సరిపోతున్నాయా అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల వద్ద మరింత పటిష్టమైన రక్షణ చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు సంబంధించి గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు ముందస్తుగా సంయుక్తంగా భద్రతా తనిఖీలు నిర్వహించాయా? ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల రాకపోకలు, జనసమ్మర్థ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భద్రాచలంలో వినిపిస్తున్నాయి.
అలాగే గోదావరి వరదలతో అనేక కుటుంబాలు ఆందోళనలో ఉన్న ఈ సమయంలో ప్రజాప్రతినిధులు బాధిత ప్రాంతాలను మరింత విస్తృతంగా సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించడానికీ ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
భారీ ఆఫర్లు, సినీ ప్రముఖుల హాజరు వంటి కారణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు కూడా నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
వ్యాపార కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో ప్రజల ప్రాణ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_Shivaram
    Shivaram
    Local News Reporter భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    52 min ago
  • కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢 కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢
    1
    కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!

రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.

నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.

– అన్నదాత ఆవేదన 😢
కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!
రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.
నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.
– అన్నదాత ఆవేదన 😢
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
  • ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    1
    ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే పాయం
సారపాక: గోదావరి వరదల నేపథ్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం సారపాక ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులో 28, సారపాకలో 55 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సర్పంచ్‌ బాధితులకు అండగా ఉంటున్నారని అన్నారు. గోదావరి 56 అడుగులకు చేరిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
    1
    *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్*
మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు.
ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.