సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్... ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టీకరణ. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్... ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టీకరణ. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.
- కరీంనగర్ లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. సిపిఐ జిల్లా సహకారంతో ఇందిరా గార్డెన్ లో మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర గర్ల్స్ వింగ్ కో కన్వీనర్ కండె విజేత, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతమ్ స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ల సమక్షంలో దండలు మార్చుకుని ఆలుమగలు గా ప్రమాణం చేశారు. అమ్మాయి విజేత చే వివాహ ప్రమాణ పత్రం శ్రీనివాస్ రెడ్డి చదివించగా, అబ్బాయి ప్రీతమ్ చే చాడ వెంకటరెడ్డి చదివించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి వివాహ పత్రాలపై సంతకాలు చేసి దండలు మార్చుకొని ఆలుమగలుగా ఒక్కటయ్యారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న నూతన దంపతులు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు. నూతన దంపతులను విద్యార్థి సంఘం నాయకులతోపాటు రాజకీయ పార్టీల నేతలు అభినందించి ఆశీర్వదించారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు1
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- Post by Tagore1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేశానని కేరళలో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. కేరళ మీడియా ప్రతినిధులతో తెలంగాణలో పర్యటిద్దామని, 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. హుజురాబాదులో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం పచ్చి అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు.మహిళలకు 2500లు, తులం బంగారం, స్కూటీ, 4 వేల ఆసరా పెన్షన్లు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4 వేల భృతి, కౌలు రైతులు, రైతు కూలీలకు రైతు భరోసా అమలు చేయలేదని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మోదీ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు విసిగిపోయి కాంగ్రెస్ ను ఓడించారని చెప్పారు. కేరళకు రేవంత్ రెడ్డి వెళ్లింది కాంగ్రెస్ పెద్దలకు మూటలు అప్పగించడానికే తప్ప మరొకటికాదన్నారు.రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్దాలే కేరళలో కాంగ్రెస్ ను ఓడించబోతోందని తెలిపారు. కేరళ ప్రజలతోపాటు మీడియాకు అప్పీల్ చేస్తున్నా... ఒక్కసారి తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీల అమలుపై క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని బండి సంజయ్ కోరారు.1