Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈటల రాజేందర్ HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈటల కోరారు.
Ram Thotapally
తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈటల రాజేందర్ HYD: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈటల కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.1
- జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*1
- పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.4
- మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు.................... నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.1
- న్యూ ప్రిన్స్ బేకరీపై ఎస్‌ఓటీ పోలీసుల దాడి గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ స్వాధీనం ఘట్‌కేసర్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పట్టణంలోని న్యూ ప్రిన్స్ బేకరీపై ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బేకరీలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించడంతో పాటు, గడువు తీరిన ఆహార పదార్థాలు, సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా గడువు తీరిన ఫుడ్ కలర్, హాట్ చిల్లీ ప్యాకెట్లు, మఫిన్ మిక్స్ పౌడర్, కొబ్బరి తురుము, 10 ట్రేల గుడ్లు, బ్రెడ్, వనస్పతి తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో బేకరీ యజమాని షేక్ అక్బర్ (35), సూపర్‌వైజర్ **షేక్ నజీర్ బాషా (22)**ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు ఇద్దరినీ ఘట్‌కేసర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే ఆహార వ్యాపార సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.3
- గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1