శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత హర్షణీయం ఎమ్మెల్యే వంశీకృష్ణ సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏపీ సర్కార్ నిర్ణయం మంత్రులు, అధికారుల చొరవతో విజ్ఞప్తి అచ్చంపేట, మార్చి 31(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, శ్రీశైలం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం శుభపరిణామమని అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి ఎద్దడి కలగకుండా చర్యలు మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీటికి మరియు సాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాము చేసిన విజ్ఞప్తికి ఏపీ జెన్కో అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాయని వంశీకృష్ణ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత హర్షణీయం ఎమ్మెల్యే వంశీకృష్ణ సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏపీ సర్కార్ నిర్ణయం మంత్రులు, అధికారుల చొరవతో విజ్ఞప్తి అచ్చంపేట, మార్చి 31(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని, శ్రీశైలం కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం శుభపరిణామమని అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి ఎద్దడి కలగకుండా చర్యలు మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీటికి మరియు సాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తాము చేసిన విజ్ఞప్తికి ఏపీ జెన్కో అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాయని వంశీకృష్ణ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
- Post by T.Shiva Krishna1
- ఈ సందర్భంగా పట్టణంలో ప్రమాద రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారని సిఐ లక్ష్మయ్య తెలిపారు... తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలకే ముప్పు కాకుండా ఇతరులకు ప్రాణహాని కలిగించే విధంగా చేసుకోకూడదని.... డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలు శిక్ష కాకుండా భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిక! ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి... మైనర్లకు తమ తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి ఉంచి వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలి... మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి భవిష్యత్తే కాకుండా తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ... *నల్గొండ ట్రాఫిక్ సిఐ–మహా లక్ష్మయ్య..* ఈ కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ విజయబాయి మరియు సిబ్బంది పాల్గొన్నారు...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగ భర్తీపై అసెంబ్లీలో నిలదీసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దుర్మార్గమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాలలో జరిగిన 'పోరు దీక్ష'లో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజల బతుకులు మారాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.1
- ప్రజలకు ఉపాధిని దూరం చేసి సామాజిక న్యాయానికి పాత రేయడమే బిజెపి చెబుతున్న దేశ భక్తా అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? . విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించి ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ఉపయోగపడే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం దేశంలో సామాజిక న్యాయానికి పాతరేసిందని విమర్శించారు. ఒక చట్టాన్ని రద్దు చేసేటప్పుడు కనీసం చర్చలు జరపాలన్న ప్రజాస్వామ్య విలువలను బీజేపీ పాటించడం లేదని విమర్శించారు. విబిజి రాంజీల ద్వారా కేంద్రం ఉపాధి కూలీలకు భారీగా కోతలు విధించిందని, రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు పెంచిందని, జాబ్ కార్డులు ఇవ్వకుండా, చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలను గాలికి వదిలేసిందని, సాంకేతిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా కూలీలకు ఉపాధిని దూరం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఖర్చులు 5 లక్షల నుండి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని ప్రజావాణిలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సిపిఎం కార్యకర్తలు ఉపాధి కూలీల దగ్గరికి వెళ్ళిన సందర్భంగా జిల్లాలో గత మూడు నెలలుగా కూలీలకు డబ్బులు రాలేదని, ఫోటో ఫ్యాక్చరింగ్ సరిగా రావడం లేదని, డబ్బులు రాకపోవడంతో కూలీలు పనికి రావడం లేదని పనిచేయడానికి అవసరమైన పని ముట్లు ఇవ్వడం లేదని, గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. తక్షణమే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకటస్వామి సిపిఎం జిల్లా కార్యదర్శి , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జీ. రాజు, ఉప్పేర్ నరసింహ, నాయకులు రవి, సవారన్న, పాంటన్న,తిరుపతన్న, బాలకృష్ణ, రామక్రిష్ణ రంగన్న, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.2
- full night open this hotel purani Haveli request to Hyderabad City Police take action1
- ఈరోజు నకిరేకల్ లో BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ & ఆశా కార్యకర్తల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా BRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వదిలేసి ఆశ వర్కర్లను మోసం చేస్తుంది. అధికారంలోకి రావడానికి ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడం స్పష్టమైన ద్రోహం. హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచ్చి, రాష్ట్ర నాయకులు, ఆశ వర్కర్లను అరెస్టు చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట, ఇది ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా గొంతు నొక్కే చర్య. ఈ విధానం నియంతృత్వ పాలనకు సంకేతం. ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లను అనగదొక్కే ప్రయత్నం చేస్తే అది ప్రజల ఆగ్రహన్నీ రెచ్చగొట్టడమే. ప్రభుత్వం వెంటనే తన నిరంకుశ వైఖరిని విరమిచ్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతుందన్నారు. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో ఈరోజు BRTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలివేరు ప్రభాకర్ గారు & ఆశా ల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షురాలు సింగం రేణుక ఆధ్వర్యంలో BRTU అనుబంధ ఆశ వర్కర్లు నకిరేకల్ PHC వద్ద నల్ల బ్యాడ్జీ లు ధరించి ధర్నా చేసి నకిరేకల్ మెయిన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఆశ వర్కర్ల డిమాండ్లు: 1. ఆశ వర్కర్లకు ఇచ్చిన 18000 ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి. 2. ప్రజాస్వామ్య పోరాటoను అణచివేయడం వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఇది కేవలం ప్రారంభం మాత్రమే పోరాటం మరింత తీవ్రత దాలుస్తుందని అన్నారు .ఆశ వర్కర్లను తక్కువగా అంచనా వేయకండి. ఆశాల న్యాయమైన డిమాండ్ లను వెంటనే నెరవేర్చమని BRTU డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో SK సుల్తానా, కొండ అనసూర్య, A హైమావతి, M నీలావతి, M స్వప్న, V సుజాత, CH ఇందిర, P లలిత, P రేణుక, Y విజయలక్ష్మి, CH నాగమణి, B జ్యోతి తదితరులు పాల్గొన్నారు.4
- Post by Ali ammu1