Shuru
Apke Nagar Ki App…
పాడేరు: అంగన్‌వాడీల అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. కార్యకర్తల వేతనానికి రూ.1000 ప్రోత్సాహకం కలిపి రూ.11,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సహాయకుల వేతనాల పెంపు, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
Shyam
పాడేరు: అంగన్‌వాడీల అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. కార్యకర్తల వేతనానికి రూ.1000 ప్రోత్సాహకం కలిపి రూ.11,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సహాయకుల వేతనాల పెంపు, కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- రైతు బజార్ ఎదురుగా కూరగాయల షాపులు తరలింపు1
- జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 8,737 మంది విద్యార్థులకు గాను 8,518 మంది హాజరై పరీక్ష రాశారని, 219 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడినట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు తెలిపారు.1
- Post by Gift maker1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- వరంగల్ జిల్లా కాజీపేట పరిధిలోని మడికొండ చౌరస్తాలో చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనలో పాల్గొన్న పండుగ రాజ్‌కుమార్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, దీక్షలో పాల్గొన్నవారు వెంటనే అప్రమత్తమై ఆయనను అడ్డుకున్నారు. పరిస్థితి విషమించకుండా వెంటనే అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మడికొండ చౌరస్తా సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ కారణంగా గత 15 ఏళ్లుగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త నుండి వచ్చే దుర్వాసన, కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని చాలా కాలంగా ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద ఉన్న ప్రతిమ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న నాళ్ళెం జంపయ్య అనే వ్యక్తి డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో మరణించారు.గత ఎనిమిదేళ్లుగా ఇదే కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న ఆయన, జనవరి 22వ తేదీ రాత్రి విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు.. అక్కడ డ్యూటీలో సెక్యూరిటీ గార్డు విధులు నిర్వహిస్తున్న జంపయ్య గుండె పోటు తో చనిపోయిన తర్వాత కంపెనీ వారు ఎటువంటి న్యాయం చేయలేదని ఆరోపిస్తూ ప్రతిమ కంపెనీ గేటు ఎదుట టెంట్ వేసుకొని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జంపయ్య కోడలు సుమలత తెలిపిన వివరాల ప్రకారం, ఆ రోజు రాత్రి ఆయనకు కాళ్లు, చేతులు లాగుతున్నాయని తోటి ఉద్యోగికి చెప్పారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయన రూమ్‌కు వెళ్తుండగా, తలుపు వద్దే కిందపడిపోయారు. కంపెనీ యాజమాన్యం సరైన సమయంలో స్పందించలేదని, 108 కి ఫోన్ చేయడం లేదా ప్రాథమిక చికిత్స (CPR) వంటివి చేయడంలో విఫలమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జంపయ్య మరణించి నెల రోజులు దాటినా, కంపెనీ యాజమాన్యం నుండి ఎలాంటి సానుకూల స్పందన లేదని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా కంపెనీ చుట్టూ తిరుగుతున్నా, కాంట్రాక్ట్ వారినే కలవమని చెప్తూ ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టేస్తున్నారని వారు మండిపడుతున్నారు. బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం అందించాలి. కుటుంబంలో చదువుకున్న వారు ఉన్నందున, ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.యాజమాన్యం బాధ్యత తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రతిమా కంపెనీ వారు మానవత్వ కోణంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు..అలాగే ఐడీఎస్ సెక్యూరిటీ చెందిన నిర్వాహకులు వాళ్ళ పేరు మీద ఇన్స్యూరెన్స్ కట్టాము.. వాళ్ళకు ఇన్స్యూరెన్స్ ఉందని రెండున్నర లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని వాళ్ళు చెప్పుతున్న పరిస్థితి ఉంది.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.1