Shuru
Apke Nagar Ki App…
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు అన్నెపు వెంకటయ్యను ప్రభుత్వ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేయడంతో అతడి ఆసరా పెన్షన్ గత ఏడు నెలలుగా నిలిచింది. పెన్షన్ గురించి అడిగితే “మీరు చనిపోయారు” అంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో వెంకటయ్య అవాక్కయ్యాడు. సమస్య పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశాడు.
M D Azizuddin
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు అన్నెపు వెంకటయ్యను ప్రభుత్వ రికార్డుల్లో మృతుడిగా నమోదు చేయడంతో అతడి ఆసరా పెన్షన్ గత ఏడు నెలలుగా నిలిచింది. పెన్షన్ గురించి అడిగితే “మీరు చనిపోయారు” అంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో వెంకటయ్య అవాక్కయ్యాడు. సమస్య పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు మీడియా ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశాడు.
More news from తెలంగాణ and nearby areas
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.1
- కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి మోకాలి శాస్త్ర చికిత్స అనంతరం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న ఆయనను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి మర్యాదపూర్వక కలుసుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు1
- భారత్ మాత కి జై 🇮🇳2
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- జనగామ జిల్లాలో భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో ఈ దందా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- మహిళల భద్రత టీ -సేఫ్ అప్ గురించి అవగాహన సదస్సు... నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నేరాల అదుపులో అందరూ భాగస్వామ్యం కావాలని, తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళలపై జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్ AVV జూనియర్ కాలేజీలో 200 మంది విద్యార్థినులతో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే అత్యాచారాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అమ్మాయిలు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు పెట్టవద్దని సూచించారు.1
- నల్లగొండ బ్రేకింగ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం.. రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు... హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత... హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన... హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు... రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...1