Shuru
Apke Nagar Ki App…
గంగవరం మండలంలో భారీగా గంజాయి స్వాధీనం: ఐదుగురు అరెస్ట్ గంగవరం మండలం నెమల్లి చెట్టు సెంటర్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు జరిపిన తనిఖీల్లో 120 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ₹60 లక్షలు. ఎర్టిగా, ఐ-20 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన నలుగురితో పాటు జగ్గంపేటకు చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కార్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Vidya Sagar Tumu
గంగవరం మండలంలో భారీగా గంజాయి స్వాధీనం: ఐదుగురు అరెస్ట్ గంగవరం మండలం నెమల్లి చెట్టు సెంటర్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు జరిపిన తనిఖీల్లో 120 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ₹60 లక్షలు. ఎర్టిగా, ఐ-20 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన నలుగురితో పాటు జగ్గంపేటకు చెందిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 2 కార్లు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- పిఠాపురం: స్థానిక పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఎన్యుమరేటర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తలెత్తిన ప్రోటోకాల్ వివాదం కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం మరియు జనసేన నేతల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఫోటో ఎక్కడ? అని అధికారులను బహిరంగంగా నిలదీశారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న జనసేన నేత పెండెం దొరబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులను నిలదీసే క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు నేతల అనుచరులు, టీడీపీ - జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ మీదకు దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. కార్యాలయం లోపల, బయట కార్యకర్తల మోహరింపుతో పాడా ఆఫీసు రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ నిబంధనలు మీకు వర్తించవా? అంటూ అధికారులను నిలదీస్తూనే, ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో పోలీసులు భారీ సంఖ్యలో రంగంలోకి దిగారు. ఘర్షణ పడుతున్న ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. నాయకులను సర్దిచెప్పి అక్కడి నుండి పంపించివేయడంతో ఉద్రిక్తత కాస్త సద్దుమణిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరు పార్టీల మధ్య గొడవ జరిగిందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. తరచూ పాడా కార్యాలయంలో ఇటువంటి ప్రోటోకాల్ వివాదాలు తలెత్తడంపై స్థానికంగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీల మధ్యే ఇలా బహిరంగంగా తోపులాట జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మరియు పార్టీ అధిష్టానాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.1
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- Post by Sageni gangadhar1
- 🙏😭1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా పిడుగు శబ్దాలతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మేఘాలు కమ్ముకుని వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో గ్రామంలోని వీధులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడడంతో స్థానికులకు ఉపశమనం కలిగింది.1
- రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.1