Shuru
Apke Nagar Ki App…
గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు* గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 14 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు* బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది
Gousuddin Md
గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు* గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 14 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి టివైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు* బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, ముస్లిం సోదరులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది
More news from తెలంగాణ and nearby areas
- శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామం సమీపంలోని చాకరిమెట్లలో ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. నర్సాపూర్–తూప్రాన్ రహదారి మార్గంలో అడవి మధ్యలో కొలువై ఉన్న ఈ ఆలయానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.1
- డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ కు వాడితే కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ హెచ్చరిక నర్సాపూర్లో45 సిలిండర్లు సీజ్ కలెక్టర్ ప్రతిమసింగ్ హెచ్చరిక సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగాఉండాలి కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్ల ఎలాంటి కొరత లేదు జిల్లాలో 3,84373 కనెక్షన్లు కలవు 16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా వంట గ్యాస్ సమస్యలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు నెంబర్.9391942254 హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం. సోషల్ మీడియాలో గ్యాస్ లేదని వదంతులు సుస్థిస్తే కేసులు చేస్తాం *ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దు* మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్ జిల్లాల్లో గృహావసరాలకు ఎల్.పి.జి సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టరేట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీడీవి శ్రీనివాసరావు,జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,84373 కనెక్షన్లు కలవని 16 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు హోటల్స్, రెస్టారెంట్లలో అక్రమ గ్యాస్ నిల్వలపై దాడులు నిర్వహించి 44 సిలిండర్లను సీజ్ చేసాం. అని వెల్లడించారు .ప్రజలు అనవసరంగా ఆందోళన చెంది అవసరానికి మించి అడ్వాన్సు గా బుకింగ్ చేసుకోవద్దనీ జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరా సాధారణంగా మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. . ప్రభుత్వ హాస్పిటల్లో, హాస్టల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్ లో, పాఠశాలల్లో, అత్యవసర సేవలలో గ్యాస్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు.తాజగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం,అక్రమంగా మళ్లించడం ,బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేశామన్నారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని,గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస సరఫరా చేస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సమస్యలు ఉంటే 9391942254 నెంబర్ ను సంప్రదించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి ,గ్రామీణ 45 రోజులకు ఒకమారు ఎల్.పి.జి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితులు లేదా అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పక్షంలో, సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం మరియు పారదర్శకంగా సేవలు అందించడం ప్రతి గ్యాస్ ఏజెన్సీ యొక్క బాధ్యతగా గుర్తు చేశారు ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మకూడదని, జిల్లాలో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు, ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురైన సందర్భంలో సంబంధిత అధికారులకు లేదా గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో గ్యాస్ కొరత ఉందని వదంతులు పుట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్యాస్ బుకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఎలాంటి లింక్ లు వచ్చిన ఓపెన్ చేయకుండా తగు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ క్రైమ్ కు గురి కావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద, డిపిఆర్ఓ రామచంద్ర రాజు, ఏపీఆర్ఓ బాబురావు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. .1
- మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాలన విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలను మధ్యాహ్నం తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఈ సోదాలతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.1
- ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.1
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ గారి అప్పీల్: ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.1
- మెదక్ జిల్లా Shivampet Mandal లోని అల్లీపూర్, లింగోజీగూడ, కొత్తపేట్, పిల్లుట్ల, పాలు గ్రామాల్లో వార్డు సభ్యుల శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణలో వార్డు సభ్యులకు పంచాయతీ విధులు, గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు గురించి అవగాహన కల్పించబడింది. మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పాల్గొని వార్డు సభ్యులతో సమన్వయం కోసం సూచనలు చేశారు.1
- మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన *రామయంపేట మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత గారు* యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వాటి గురించి వివరిస్తూ స్పీచ్ ఇవ్వడం జరిగింది.1
- మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.1