logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు దైద రవీందర్ గారు నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణ గార్డెన్‌లో ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి వనం శ్రీనివాస్ గారి కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దైద రవీందర్ గారు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.

18 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
18 hrs ago
4542afc4-3d6b-4619-aae4-1f0b86cf877f
fdae5665-dcbc-4678-8552-7e860a65a282

ఘనంగా ఎంగేజ్మెంట్ వేడుక వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకుడు దైద రవీందర్ గారు నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని సువర్ణ గార్డెన్‌లో ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి వనం శ్రీనివాస్ గారి కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దైద రవీందర్ గారు కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    13 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి వద్ద ముత్యాలమ్మ చెరువు కట్ట ఇరువైపుల చెట్లతో మూసుకుపోయి రక్షణ గోడలు లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి కొత్తపల్లి మీదుగా అనంతారం, ఏమిరెడ్డి గూడెం తదితర ప్రాంతాలకు విద్యార్థులు, రైతులు, ప్రజలు నిత్యం దీనిపై ప్రయాణిస్తూ ఉంటారు. వాహనాలు అదుపు తప్పితే పంట పొలాలు, చెరువులోకి దూసుకెళ్లే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. కట్ట వెడల్పు పెంచడంతోపాటు రక్షణ గోడలు నిర్మించి, చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    48 min ago
  • జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    1
    జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులోని సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడిన వ్యక్తి ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన ఐలయ్యగా గుర్తించారు. అతడిని ముందుగా జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 min ago
  • హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
    1
    హైదరాబాద్..శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి
ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం,  నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు
మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు
జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు
ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో
    3
    30/03/2026
కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్..
రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు..
బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు..
నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు..
రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు..
రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా  నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు..
గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది..
సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది..
నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది.
తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది..
బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది..
నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే  రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి  రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు
32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే  ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది
రీ డిజైన్ చేసి  ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము
87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన  ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు...
ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు  నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ...
దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో  ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ
కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు
నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు  ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి
40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి,
నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది...
దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు ,
ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే  పరిస్థితి లేదు,
రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ  రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు
రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది..
కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు..
నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది.
నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది..
మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం..
లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది..
తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి..
ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం..
నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది..
నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి..
నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..
లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం..
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్ర గూడెం గ్రామంలో NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగాయ చెరువు ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎండాకాలం సీజన్ లు అయిపోయాయని ఫీల్డ్ వర్క్ లు 365 రోజులు చేయారని డిసెంబర్ నుంచి జూన్ వరకు చేస్తారని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ ఒక్క రోజు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఈ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ కు ఎంత శిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చి వెళ్తాడని ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడారని వెంటనే రంగాయ చెరువు ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
    1
    వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్ర గూడెం  గ్రామంలో NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.  ధర్నా చేస్తున్న క్రమంలో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగాయ చెరువు ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎండాకాలం సీజన్ లు అయిపోయాయని ఫీల్డ్ వర్క్ లు 365 రోజులు చేయారని డిసెంబర్ నుంచి జూన్ వరకు చేస్తారని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ ఒక్క రోజు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఈ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ కు ఎంత శిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చి వెళ్తాడని ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడారని వెంటనే రంగాయ చెరువు ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువ  పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.