NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్ర గూడెం గ్రామంలో NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగాయ చెరువు ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎండాకాలం సీజన్ లు అయిపోయాయని ఫీల్డ్ వర్క్ లు 365 రోజులు చేయారని డిసెంబర్ నుంచి జూన్ వరకు చేస్తారని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ ఒక్క రోజు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఈ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ కు ఎంత శిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చి వెళ్తాడని ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడారని వెంటనే రంగాయ చెరువు ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్ర గూడెం గ్రామంలో NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగాయ చెరువు ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎండాకాలం సీజన్ లు అయిపోయాయని ఫీల్డ్ వర్క్ లు 365 రోజులు చేయారని డిసెంబర్ నుంచి జూన్ వరకు చేస్తారని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ ఒక్క రోజు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఈ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ కు ఎంత శిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చి వెళ్తాడని ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడారని వెంటనే రంగాయ చెరువు ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
- 30/03/2026 కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్.. రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నారు.. బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు.. నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు.. రామప్ప - రంగాయి చెరువు - పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.. రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు.. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 TMC నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తి చేసాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 2ఏండ్లు పూర్తి ఐనా నేటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు.. గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది.. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది.. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము 87శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు... ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి ... దొంతి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది... దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు , ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ, అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువనిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.. కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు.. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది.. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం.. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది.. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి.. ఈ నిరసన ఆరంభం మాత్రమే.. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం.. నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది.. నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి.. నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్త రూపంలో3
- వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్ర గూడెం గ్రామంలో NH365 రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న క్రమంలో రహదారిపై వాహనాలు భారీగా నిలిచి పోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగాయ చెరువు ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ఎండాకాలం సీజన్ లు అయిపోయాయని ఫీల్డ్ వర్క్ లు 365 రోజులు చేయారని డిసెంబర్ నుంచి జూన్ వరకు చేస్తారని, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ ఒక్క రోజు కూడా రంగాయ చెరువు ప్రాజెక్టు గురించి సమీక్ష సమావేశం నిర్వహించలేదని ఈ ప్రాంత ప్రజల మీద కాంగ్రెస్ కు ఎంత శిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వచ్చి వెళ్తాడని ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడారని వెంటనే రంగాయ చెరువు ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.1
- హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది1
- వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు జాతీయ ప్రధాన రహదారుల సెంటర్ పోల్స్ కు అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్లెక్సీ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని,విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మూలంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేసినా సంబంధిత మున్సిపల్ మరియు పంచాయితీ సిబ్బంది చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సదరు ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులపై చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు.గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుదీప్ జిల్లా అంతటా ఫ్లెక్సీ హోర్డింగ్ లను తొలగించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు జిల్లాలోని వివిధ మండలాలలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.1
- ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో ప్రధాన రహదారిపై కోరుకంటి శిరీష శ్రీధర్ రావు దంపతులు వినూత్న ఆలోచనతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను ఇసుకతో అద్భుతమైన శిల్పాల రూపంలో తీర్చిదిద్దుతూ, కేవలం 30 సెకన్లలో చూసే విధంగా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ప్రతి శిల్పం ఒక కథను ప్రతిబింబిస్తూ, భక్తి, సంస్కృతి, కళాత్మకతను కలగలిపి సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈనెల 27 నుండి మే 15 వరకు ఈ ఇసుక విగ్రహాల ప్రదర్శన కొనసాగనుండగా, ఈ అరుదైన కళాఖండాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతున్నారని, సనాతన ధర్మం, రామాయణ ఘట్టాలను తక్కువ సమయంలో అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఇసుక శిల్పాలను రూపొందించినట్లు శిరీష తెలిపారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ తక్కువ సమయంలో రామాయణాన్ని అర్థం చేసుకునేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు.4
- నల్లబెల్లి, మార్చి 30: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప–రంగయ్య చెరువు–పాకాల ప్రాజెక్ట్‌లో భాగమైన కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలో గోదావరి జలాలను రంగయ్య చెరువుకు తరలించే పనులు పూర్తి చేసి, 32,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను రెండు సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాలువల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.40 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధిస్తున్నామని, ఆలోపు పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నర్సంపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ నిరసనలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.3