logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాచారం ట్రస్ట్ కార్ ఆదివారం మెగా మేళ(మేడ్చల్ జిల్లా, నాచారం) ప్రతీ పేద వారి ఇంటికి కార్ ఉండాలి ప్రతీ పేదవారు కార్ లో తిరగలానే ద్యేయంతో గత ఐదేళ్లుగా ట్రస్ట్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీతో బయటకి వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని సూచించారు. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టూ కస్టమర్ డీల్ కుదుర్చుతున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో కార్ ఉండాలి,ఇంటింటికి ట్రస్ట్ కార్ ఉండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు చలికాలంలో బైక్ ల మీద చిన్న పిల్లలను తీసుకెళ్లకుండా ట్రస్ట్ కార్స్ లో కార్ ని కొనుక్కొని సంతోషంగా వెళ్లాలని సూచించారు. దాదాపు 150 నుంచి 200 కార్ల వరకు కార్ మేళాలో పెట్టడం జరిగిందన్నారు.

1 day ago
user_Nitturi Ravi
Nitturi Ravi
అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
1 day ago
a7904a33-580d-4ab4-a0ec-5a309e904c1a

నాచారం ట్రస్ట్ కార్ ఆదివారం మెగా మేళ(మేడ్చల్ జిల్లా, నాచారం) ప్రతీ పేద వారి ఇంటికి కార్ ఉండాలి ప్రతీ పేదవారు కార్ లో తిరగలానే ద్యేయంతో గత ఐదేళ్లుగా ట్రస్ట్ కార్స్ ను నిర్వహిస్తున్నామని నాచారంలోని ట్రస్ట్ కార్స్ యజమాని రోషన్ తెలిపారు. నాచారంలోని ట్రస్ట్ కార్స్ లో సెకండ్ హ్యాండ్ కార్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మీ ఫ్యామిలీతో బయటకి వెళ్లేందుకు తక్కువ ధరలో సౌకర్యవంతమైన కార్ కావాలంటే వెంటనే నాచారంలోని ట్రస్ట్ కార్స్ ను సంప్రదించాలని సూచించారు. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్లను డైరెక్ట్ కస్టమర్ టూ కస్టమర్ డీల్ కుదుర్చుతున్నామని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది కస్టమర్లు నేడు కార్ మేళాలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లో కార్ ఉండాలి,ఇంటింటికి ట్రస్ట్ కార్ ఉండాలనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు చలికాలంలో బైక్ ల మీద చిన్న పిల్లలను తీసుకెళ్లకుండా ట్రస్ట్ కార్స్ లో కార్ ని కొనుక్కొని సంతోషంగా వెళ్లాలని సూచించారు. దాదాపు 150 నుంచి 200 కార్ల వరకు కార్ మేళాలో పెట్టడం జరిగిందన్నారు.

  • user_జీడీశెట్టి జీజ గజిగ్
    జీడీశెట్టి జీజ గజిగ్
    Tirumalgiri, Hyderabad
    🥳
    16 hrs ago
  • user_జీడీశెట్టి జీజ గజిగ్
    జీడీశెట్టి జీజ గజిగ్
    Tirumalgiri, Hyderabad
    🤝
    16 hrs ago
  • user_జీడీశెట్టి జీజ గజిగ్
    జీడీశెట్టి జీజ గజిగ్
    Tirumalgiri, Hyderabad
    😤
    16 hrs ago
  • user_జీడీశెట్టి జీజ గజిగ్
    జీడీశెట్టి జీజ గజిగ్
    Tirumalgiri, Hyderabad
    👏
    16 hrs ago
More news from Telangana and nearby areas
  • మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
    1
    మండలంలో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోడేరు వైద్యాధికారి రాఘవేంద్ర తెలిపారు. 16 గ్రామ పంచాయతీల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టునే ఉండాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ మంచినీరు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడాలని, lఅనారోగ్యంగా అనిపిస్తే కాలయాపన చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    11 hrs ago
  • ​​నార్కట్పల్లి, ఏప్రిల్ 20: నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. ​అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.
    1
    ​​నార్కట్పల్లి, ఏప్రిల్ 20:
నార్కట్పల్లిలో నిన్న రాత్రి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరై లింగయ్య గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలివచ్చారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చెరుకు సుధాకర్, నోముల భగత్, నకిరేకల్ మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు.
​అంతేకాకుండా, ఈ జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రస్తుత సర్పంచులు పాల్గొని చిరుమర్తి లింగయ్య గారికి పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల కోలాహలం, పటాకుల మోతతో నార్కట్పల్లి ప్రాంతం అంతా సందడిగా మారింది.
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 15 నుండి 15 రోజులపాటు హిందూ సమ్మేళనం కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.  వేములవాడ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందూ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి, తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా రెండువేలపైగా, భారత దేశవ్యాప్తంగా 25వేల హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి హిందువు తమ విద్యుక్త ధర్మం కోసం పాటుపడాలని, గడప లోపల కులమని, గడప దాటితే హిందువులమన్న భావన ప్రతి ఒక్క హిందువులో కలిగి ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూధర్మం లో ఉన్న విలువలు మరే దేశానికి లేవని, విదేశీయులు సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. కొత్తకోట పీఠాధిపతి శివానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో హిందువును  దేశ భద్రతకు, సమాజ శ్రేయస్సుకు  తయారు చేసే శక్తి కేవలం మాతృమూర్తికే ఉందని, యువకులను దేశ సమగ్రత కాపాడడానికి ప్రతీకలుగా తయారు చేయాలన్నారు. హిందూ సమ్మేళనంలో దాదాపు 5వేలకు మందిపైగా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్, Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గౌరవ చైర్మన్,   Shri Vivek Laxmikant Bhimanwar స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, స్వామివారి శేష వస్త్రం, లడ్డూ మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో నిండిపోయింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • యాంకర్ వాయిస్: వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    1
    యాంకర్ వాయిస్:
వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి.
కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి.
భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి.
రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు
    1
    ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు 
వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన
బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి 
కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు  మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి
అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో  వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు  పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    10 hrs ago
  • జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
    4
    జగిత్యాల వేదికగా జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ పై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ జైత్రయాత్ర సభ కాదు, జీవన్ రెడ్డి చేరిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన బిఆర్ఎస్ లో చేరినంత మాత్రాన కాంగ్రెస్ కు నష్టం ఉండదు.. బిఆర్ఎస్ కు లాభం జరగదన్నారు. జగిత్యాల లో మీడియాతో మాట్లాడిన ఆయన, జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుందన్నారు.అందుకే హరీష్ రావు జగిత్యాల సభకు హాజరుకాలేదని ప్రచారం జరుగుతుందన్నారు. హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి బిజేపి టచ్ లోకి వెళ్ళినట్లు తెలుస్తుందని, ఇప్పటికే కవిత వెళ్ళిపోయారని...మీరు వెళ్ళొద్దని హరీష్ రావు ను కోరుతున్నట్లు తెలుస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసిఆర్ హరీష్ రావును ఉరితీయాలని జీవన్ రెడ్డి కోరారని అలాంటి వ్యక్తిని బిఆర్ఎస్ లో చేర్చుకోవడం హాస్యాస్పదమన్నారు. జీవన్ రెడ్డి చేరికతో బిఆర్ఎస్ చీలిక పుడుతుందని చెప్పారు. హరీష్ రావు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి చేరికను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తనను ఏ బ్రీడ్ ఎమ్మెల్యే అంటున్న కేటీఆర్, గతంలో కాంగ్రెస్ తో పెట్టుకున్న మీరు రాజకీయంగా ఏ బ్రీడ్ అని ప్రశ్నించారు. అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాని మా తాతలు నుంచే మా కుటుంబ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు.
మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.