బోడుప్పల్ లో ఏసీబీ సోదాలు,ములుగు జిల్లాలో ప్రకంపనలు,అక్రమార్కులలో అలజడులు.. ములుగు జిల్లా, ఆగస్టు 27 : ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంటిపై ఏసీబీ గురిపెట్టిందని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయనే వార్త గుప్పుమనడంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిలో గురువారం ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ములుగు జిల్లా మైన్స్ ఏడీఈగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. మైన్స్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజ్ పై ములుగు, భూపాలపల్లిలో ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి . గత కొద్ది సంవత్సరాలుగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాలలో ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) నడుస్తున్నాయి. ఇందులో కొన్ని ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) నిభందనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిభందనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) నిర్వాహకులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ కు ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలపై హైదరాబాద్ బోడుప్పల్‌లోని బొజ్జ జయరాజ్ ఇంటిలో, భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మైనింగ్ ఏడి కార్యాలయంలో, సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోనూ మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలవడంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమార్కులలో అలజడి మొదలయింది. సోదాల్లో బయటపడే నగదు, ఆస్తులు, కీలక పత్రాల ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాలపై, కార్యాలయయంపై , ఇతర ప్రాంతాలలో ఏసీబీ సోదాలు జరగడం ములుగు జిల్లాలో ముఖ్యంగా ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) ఉన్న గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.
బోడుప్పల్ లో ఏసీబీ సోదాలు,ములుగు జిల్లాలో ప్రకంపనలు,అక్రమార్కులలో అలజడులు.. ములుగు జిల్లా, ఆగస్టు 27 : ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ఇంటిపై ఏసీబీ గురిపెట్టిందని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయనే వార్త గుప్పుమనడంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిలో గురువారం ఉదయం ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ ములుగు జిల్లా మైన్స్ ఏడీఈగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. మైన్స్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజ్ పై ములుగు, భూపాలపల్లిలో ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి . గత కొద్ది సంవత్సరాలుగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట మండలాలలో ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) నడుస్తున్నాయి. ఇందులో కొన్ని ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు
) నిభందనలకు విరుద్ధంగా నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నిభందనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) నిర్వాహకులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ కు ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలపై హైదరాబాద్ బోడుప్పల్‌లోని బొజ్జ జయరాజ్ ఇంటిలో, భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మైనింగ్ ఏడి కార్యాలయంలో, సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోనూ మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలవడంతో ములుగు జిల్లాలో ఇసుక అక్రమార్కులలో అలజడి మొదలయింది. సోదాల్లో బయటపడే నగదు, ఆస్తులు, కీలక పత్రాల ఆధారంగా తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసాలపై, కార్యాలయయంపై , ఇతర ప్రాంతాలలో ఏసీబీ సోదాలు జరగడం ములుగు జిల్లాలో ముఖ్యంగా ఇసుక రీచ్ లు (ఇసుక క్వారీలు ) ఉన్న గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.
- ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా : ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా కృష్ణ కాలనీ శ్రీ మంజునాథపురం 15వార్డులో లో వోల్టేజ్ తో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు, లో వోల్టేజ్ కరెంటు రావడంతో ఫ్యాన్లు,ఫ్రిజ్జులు, టీవీలు, షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోతున్నాయి, కాలనీవాసులందరూ కలిసి స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏఈకి కాలనీవాసులందరూ మరియు ఆవార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మాట్ల సంపత్. గండ్రకోట కుమార్. చుంచు రమేష్. నాగేశ్వరరావు. సుధాకర్. శంకర్. కుమార్. సంపత్. ఇక్బాల్. కాలినివాసులు అందరూ పాల్గొన్నారు.2
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఫ్యాన్లు లేవు.. సెలైన్‌కు స్టాండ్ లేదు.. తల్లిపాల గదికి తాళం.. ఎంజీఎంలో రోగుల అవస్థలు! వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మౌలిక వసతుల కొరతపై రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో పలు వార్డుల్లో ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో గాలి సౌకర్యం కోసం కొందరు రోగుల బంధువులు ఇంటి నుంచే ఫ్యాన్లు తీసుకొచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ చిన్నారి ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కనిపించగా, మరోవైపు సెలైన్ బాటిల్‌ను గోడకు వేలాడదీసి చికిత్స అందిస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్య పరికరాలు, ఇతర మౌలిక వసతుల సమస్యలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. తల్లిపాల గది ఉన్నా.. తాళమే మరోవైపు బాలింతల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తల్లిపాల గది అందుబాటులో లేకపోవడంపై కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. గదికి తరచూ తాళం వేసి ఉండటంతో ఓపీకి వచ్చే బాలింతలు శిశువులకు బహిరంగ ప్రదేశాల్లో పాలు పట్టించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్న సమయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది వినియోగానికి అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంజీఎం వంటి ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్ల కొరతను వెంటనే పరిష్కరించాలని, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి తేవాలని, బాలింతల తల్లిపాల గదిని నిరంతరం అందుబాటులో ఉంచాలని రోగులు, వారి బంధువులు అధికారులను కోరుతున్నారు.1
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.1
- పాడెపైనే తమ్ముడికి రాఖీ కట్టిన సోదరి.. కన్నీరు మున్నీరుగా విలాపం మహబూబాబాద్: రాఖీ పండుగకు రెండు రోజుల ముందే మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కురవికి చెందిన మోటపోతుల రమేష్ (36) అనారోగ్యంతో మృతి చెందాడు. అంతిమయాత్రలో దింపుడుకల్లం వద్ద రమేష్ మృతదేహాన్ని చూసిన అతడి సోదరి గుండెలవిసేలా రోదించింది. రెండు రోజుల్లో రాఖీ కడతాననుకున్న తమ్ముడు ఇంతలోనే తమను వదిలి వెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరైంది. అనంతరం పాడెపైనే తమ్ముడి చేతికి రాఖీ కట్టి బోరున విలపించడంతో అక్కడున్న బంధువులు, స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇటీవలే రమేష్ తండ్రి మృతి చెందగా, ఆయన దశదినకర్మ రోజే రమేష్ మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో రమేష్ తమ్ముడు కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో వరుస విషాదాలతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.1
- ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.1
- మున్నేరు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు ను పట్టుకున్న ముదిగొండ ఎస్సై హరిత సిబ్బంది. ఖమ్మం జిల్లా ముదిగొండ ఎస్సై హరిత తన సిబ్బందితో పాటు 5 గంటల సమయంలో మున్నేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న సుమారుగా 12 ట్రాక్టర్లను వివి కృష్ణాపురం సమీపంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఉదయం ఏడు గంటల సమయంలో లక్ష్మీపురం సమీపంలోనే ఐదు ఇసుక ట్రాక్టర్లను మొత్తం 17 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లను ఓనరులను మీద కేసులు నమోదు చేసినట్లు ఇసుక ట్రాక్టర్లు పెద్దమండవ గంధసిరికి చెందినవిగా గుర్తించడం జరిగింది. ఇన్స్పెక్టర్ మురళి ఆదేశాల మేరకు మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు చేసి ఇసుకతో ఉన్న ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై హరిత, పిసిలు లక్ష్మణ్, శ్రీను,వెంకట్, కృష్ణ, రాజులు పాల్గొన్నారు.1
- నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.1