Shuru
Apke Nagar Ki App…
మొత్తం 8 ఎకరాలు 5:20 కుంటలు 2:20 లేత తోట 2 1/2 అంగుళలు బోర్, 2 అంగుళాలు బోర్ మొత్తం 2 ఎకరాలు అమ్మకానికి కలదు, ఎకరాం 26 లక్షలు చెబుతున్నారు, నచ్చి కూర్చుంటే మాట్లాడావచ్చు, పక్క రిజిస్ట్రేషన్ రాంప్రసాద్ రియల్ ఎస్టేట్ 8008165564
Ramprasad islavath
మొత్తం 8 ఎకరాలు 5:20 కుంటలు 2:20 లేత తోట 2 1/2 అంగుళలు బోర్, 2 అంగుళాలు బోర్ మొత్తం 2 ఎకరాలు అమ్మకానికి కలదు, ఎకరాం 26 లక్షలు చెబుతున్నారు, నచ్చి కూర్చుంటే మాట్లాడావచ్చు, పక్క రిజిస్ట్రేషన్ రాంప్రసాద్ రియల్ ఎస్టేట్ 8008165564
More news from తెలంగాణ and nearby areas
- కొత్తగూడెం నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ గ్రీవెన్స్ డే ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు.ఈ సంధర్భంగా కామేష్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు జాతీయ ప్రధాన రహదారుల సెంటర్ పోల్స్ కు అడ్డగోలుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్లెక్సీ షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని,విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మూలంగా పర్యావరణానికి హాని కలిగించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు.కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో ఏ విధమైన అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేసినా సంబంధిత మున్సిపల్ మరియు పంచాయితీ సిబ్బంది చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఏ విధమైన అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సదరు ప్లెక్సీ ప్రింటింగ్ యజమానులపై చర్యలు తీసుకుని ప్రకృతిని కాపాడాలని కోరారు.గతంలో ఇక్కడ కలెక్టర్ గా విధులు నిర్వహించిన అనుదీప్ జిల్లా అంతటా ఫ్లెక్సీ హోర్డింగ్ లను తొలగించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు.తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్ మరియు జిల్లాలోని వివిధ మండలాలలో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్లాస్టిక్ తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకొని అనుమతులకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.1
- హైదరాబాదులో శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రనాయక్ పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాటకు సీనియర్ ఎన్టీఆర్ వేషధారణలతో అతరగొట్టారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది1
- నల్లబెల్లి, మార్చి 30: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రామప్ప–రంగయ్య చెరువు–పాకాల ప్రాజెక్ట్‌లో భాగమైన కాలువల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ హయాంలో గోదావరి జలాలను రంగయ్య చెరువుకు తరలించే పనులు పూర్తి చేసి, 32,500 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించామని తెలిపారు. ప్రస్తుతం సుమారు 87 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను రెండు సంవత్సరాలుగా పూర్తి చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. కాలువల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.40 కోట్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, మిగిలిన పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నెలరోజుల గడువు విధిస్తున్నామని, ఆలోపు పనులు పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే నర్సంపేట కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈ నిరసనలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు.3
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- Post by Ramprasad islavath1
- 29-3-2025 ఆదివారం రోజున ములుగు జిల్లా మల్లంపల్లి మండలం లో NS నాయక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు అందులో 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో 57 మందికి ఆపరేషన్ అవసరం అని నిర్ధారించి వారిని సమస్త వారు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బస్సులో హైదరాబాదు శంకర ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి మరియు అద్దాలు సమకూర్చి మరియు ఉండడానికి భోజనం అన్నియు సమస్త వారు సమకూర్చుతారు మరియు ఆపరేషన్ అయిపోయిన తరువాత ప్రత్యేకమైన బస్సులో తిరుగు ప్రయాణం కూడా కల్పిస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ మరియు ఇంత మంచి సిబిరాన్ని అందించిన శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్ యాజమాన్యానికి ట్రస్ట్ చైర్మన్ మహేష్ నాయక్ పత్తిపల్లి గారు ధన్యవాదాలు తెలిపారు2
- హన్మకొండ జిల్లా కేంద్రంలో నక్కలగుట్ట విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో టీజీ ఆర్టిజన్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆర్టిజన్లపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ఎన్పీడీసీఎల్ ముందు మహాధర్నా నిర్వహిస్తామని, ఏప్రిల్ 8 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.1