Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మాల ఎర్రిస్వామి (92) ఉదయం మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చేతిలో గొడుగు, తలపై గాంధీ టోపీ, పంచెతో పట్టణ ప్రజలకు ఆయన సుపరిచితులు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, కళ్యాణదుర్గం ప్రాంతానికి తీరని లోటని పార్టీ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
Merzaa Tv
కళ్యాణదుర్గం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మాల ఎర్రిస్వామి (92) ఉదయం మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చేతిలో గొడుగు, తలపై గాంధీ టోపీ, పంచెతో పట్టణ ప్రజలకు ఆయన సుపరిచితులు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, కళ్యాణదుర్గం ప్రాంతానికి తీరని లోటని పార్టీ వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.1
- శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱94928871161
- గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.2
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.1
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- డప్పుల మోతలు.. నృత్యాలతో మారుమోగిన దైవందిన్నె.. ఆకట్టుకున్న వినాయక చవితి వేడుకలు దైవందిన్నెలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు1
- గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2