Shuru
Apke Nagar Ki App…
యువతకు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఏసీపీ అంబటి నర్సయ్య పిలుపు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం మరియు పిల్లల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య పాల్గొని యువతకు డ్రగ్స్ కు , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ తహసిల్దార్ విజయసాగర్ ఎస్సైలు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
M D Azizuddin
యువతకు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని ఏసీపీ అంబటి నర్సయ్య పిలుపు వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం మరియు పిల్లల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య పాల్గొని యువతకు డ్రగ్స్ కు , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ తహసిల్దార్ విజయసాగర్ ఎస్సైలు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ:కాజీపేట పట్టణంలోని మడికొండ చౌరస్తాలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో టెన్షన్ నెలకొంది. మంగళవారం చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని పండుగ రాజ్ కుమార్ ఒంటిపై డీజిల్ పోసి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకున్నారు.ఆయనను శిబిరం నుంచి తీసుకువెళ్ళారు.గత 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వలన పడుతున్న బాధను ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది1
- కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.4
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం3
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.1