logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2026_ఆదిలాబాదు: *పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: జిల్లా కలెక్టర్ రాజర్షిషా పత్రికా ప్రకటన జూలై 30, * ప్రభుత్వ సంక్షేమ, పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యంత పారదర్శకంగా, లాటరీ పద్ధతి ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన గిరిజన మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించస్తామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మంజూరైన లబ్ధిదారులు వారి వినియోగంతో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు, ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రతను గమనిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. రీల్స్, చేపల వేట కోసమని సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపారమైన నీటి ప్రవాహాలు ఉన్న చోట అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముందని గుర్తుచేశారు. ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా రీల్స్, ఫొటోలు, సరదాల కోసం ప్రమాదకర స్థాయిలో నిండిన చెరువులు, పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ లక్కీ డ్రా లో జిల్లా మత్స్య శాఖ అధికారి సాంబశివ రావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎల్డియం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

9 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Urban, Telangana•
9 hrs ago

2026_ఆదిలాబాదు: *పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: జిల్లా కలెక్టర్ రాజర్షిషా పత్రికా ప్రకటన జూలై 30, * ప్రభుత్వ సంక్షేమ, పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల కింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అత్యంత పారదర్శకంగా, లాటరీ పద్ధతి ద్వారా చేపట్టడం జరిగిందన్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన గిరిజన మత్స్యకారులకు పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాకు మరిన్ని యూనిట్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించస్తామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు మంజూరైన లబ్ధిదారులు వారి వినియోగంతో ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా మత్స్యకారులు, ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల తీవ్రతను గమనిస్తూ తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. రీల్స్, చేపల వేట కోసమని సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అపారమైన నీటి ప్రవాహాలు ఉన్న చోట అజాగ్రత్తగా ఉంటే తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశముందని గుర్తుచేశారు. ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా రీల్స్, ఫొటోలు, సరదాల కోసం ప్రమాదకర స్థాయిలో నిండిన చెరువులు, పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్‌ల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ లక్కీ డ్రా లో జిల్లా మత్స్య శాఖ అధికారి సాంబశివ రావు, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్, ఎల్డియం ఉత్పల్ కుమార్, మత్స్య సంఘాల నాయకులు, మత్స్యకారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • దాబా (B) బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలి: గిరిజన సంఘం.. గాదిగూడ మండలం దాబా (B) పంచాయతీ పరిధిలోని పౌనూర్, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాలకు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు, రోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు పెంధోర్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
    1
    దాబా (B) బ్రిడ్జి సమస్యను పరిష్కరించాలి: గిరిజన సంఘం..
గాదిగూడ మండలం దాబా (B) పంచాయతీ పరిధిలోని పౌనూర్, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన వంతెన శిథిలావస్థకు చేరింది. వర్షాలకు వాగు పొంగి రాకపోకలు నిలిచిపోవడంతో విద్యార్థులు, రోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొత్త వంతెన నిర్మించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకుడు పెంధోర్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
    1
    నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్
నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. 
ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 
ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
    user_G.S.Kumar
    G.S.Kumar
    Nirmal U, Telangana•
    9 hrs ago
  • పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు(9, 10) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పశువు కాపరులు, చేపల వేటకు వెళ్లే జార్లర్లు సైతం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
    1
    పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు..
రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు(9, 10) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పశువు కాపరులు, చేపల వేటకు వెళ్లే జార్లర్లు సైతం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
    user_SIDDU.ASR
    SIDDU.ASR
    నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఖానాపూర్ తర్లపాడు వెళ్లే వాహనదారులు చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని స్థానికులు పేర్కొన్నారు
    1
    ఖానాపూర్  తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు 
ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో  ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో  
వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఖానాపూర్ తర్లపాడు  వెళ్లే వాహనదారులు  చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని స్థానికులు పేర్కొన్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    1
    రాత్రి 7.30 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్ల ఎత్తివేత.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదలతో పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి సుమారు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ విభాగం తెలిపింది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చేపల వేట, పశువుల మేపు, వ్యవసాయ పనుల కోసం ఎవరూ నది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలని కోరారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • అదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను నీరు నిలువున్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ గారు , సానిటరీ ఇన్స్పెక్టర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించి జెసిబి ల సహాయంతో నీటిని తొలగించి ప్రత్యేక టోల్ ఫ్రీ 9000018842 నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటారని మూడు షిఫ్టులతో కూడిన టీం లు ఏర్పాటు చేయబడి ఉన్నాయని తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.
    2
    అదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను నీరు నిలువున్న ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ గారు , సానిటరీ ఇన్స్పెక్టర్
గారు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించి జెసిబి ల సహాయంతో నీటిని తొలగించి ప్రత్యేక టోల్ ఫ్రీ 9000018842 నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటారని మూడు షిఫ్టులతో కూడిన టీం లు ఏర్పాటు చేయబడి ఉన్నాయని తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Urban, Telangana•
    9 hrs ago
  • కడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలిన అధికారులు నిర్మల్ జిల్లా లో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటివరకు 94137 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు మొదలుతున్నారు. ఇంట్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
    1
    కడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలిన అధికారులు
నిర్మల్ జిల్లా లో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది.  ఇప్పటివరకు 94137 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు మొదలుతున్నారు. ఇంట్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
    user_G.S.Kumar
    G.S.Kumar
    Nirmal U, Telangana•
    11 hrs ago
  • వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    1
    వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, తరలి వచ్చిన ప్రజలు
ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టుతో పాటు వాగులు, వంకల నుండి భారీగా వరదనీరు గోదావరి నదిలో చేరుతుంది. దీంతో గురువారం సాయంత్రం జన్నారం మండలంలోని కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్, దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారక, గూడెం ప్రాంతాలలో గోదావరి నది రెండు ఒడ్డులను తాకుతూ వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నది వైపు ప్రజలు, పశుకాపరులు వెళ్ళవద్దని జన్నారం దండేపల్లి మండలాల అధికారులు సూచించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.