నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
- సదర్మట్ బ్యారేజ్ కి భారీగా వరద నీరు: రెండు గేట్లు తెరిచిన అధికారులు. నిర్మల్ జిల్లా లో గత రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మామడ మండలం సదర్మట్ బ్యారేజ్ కి ఎగువ నుండి 8500 క్యూసెక్కుల నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రాజెక్టుకు ఉన్న 55 గేట్ల నుండి 9వ, 10వ గేట్లను తెరిచి 9330 క్యూసెక్కులన్నిటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు దిగువనున్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.2
- *శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా కొట్టె శేఖర్ ప్రమాణ స్వీకారం* నిర్మల్ పట్టణంలోని శ్రీ గండీరామన్న దత్తసాయి ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన కొట్టె శేఖర్ గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు నూతన చైర్మన్ కొట్టె శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఆలయ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతూ, ప్రతి భక్తునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవాభావంతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ భక్తుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక్కడి ఆలయ అభివృద్ధికి సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి విశేషంగా కృషి చేశారని, ఆయన సహకారాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్లాలని నూతనంగా నియమితులైన శేఖర్ కు శ్రీహరి రావు ఈ సందర్భంగా సూచించారు. కాగా చైర్మన్ తో పాటు ఆలయ డైరెక్టర్లుగా ఉప్పుల నందు, నర్సయ్య లు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ దగ్గర రోడ్డుపై భారీగా వరద నీరు ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఖానాపూర్ తర్లపాడు మార్గమధ్యంలో ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు ఖానాపూర్ తర్లపాడు వెళ్లే వాహనదారులు చూసుకొని నెమ్మదిగా వెళ్లాలని స్థానికులు పేర్కొన్నారు1
- నిజామాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తంగా మున్సిపల్ యంత్రాంగం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం కొంత అస్తవ్యస్తంగా మారినప్పటికీ, ప్రజలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై నిలిచే వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది వెంటవెంటనే క్లియర్ చేస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిరంతర వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ మరో రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది.1
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు1
- బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం... వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు... రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు... ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు... నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....1
- నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.1