Shuru
Apke Nagar Ki App…
బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం... వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు... రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు... ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు... నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....
RP
బాసర లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా వర్షం... జలమయమైన రోడ్లు, వాగులు, వంకలు.. నిర్మల్ జిల్లా // బాసర BREAKING NEWS బాసర లో గత రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం... వర్షానికి పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, డ్రైనేజీ లు... రోడ్లపై వర్షపు నీళ్లు నిలిచి చిత్తడిగా మారిన రోడ్లు... ఇబ్బందులు పడుతున్న వాహన దారులు... ఎగువన మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు తోడు నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాసర గోదావరి నదిలోకి భారీగా చేరిన వరద నీళ్లు... నిండు కుండలా ప్రవహిస్తున్న బాసర గోదావరి నది... హర్షం వ్యక్త పరుస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంత రైతులు, గ్రామస్తులు....
More news from Telangana and nearby areas
- నిర్మల్ జిల్లాలో SIR 100% పూర్తి: కాంగ్రెస్ సీనియర్ ఆరేపల్లి మోహన్ నిర్మల్ జిల్లాలో SIR ప్రక్రియ 100% పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ BLA లకు అదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి ఇన్ హోటల్లో SIR ప్రక్రియపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంటరీ SIR ఇన్చార్జి ఆరేపల్లి మోహన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు తోబాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ... నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 100% SIR ప్రక్రియ పూర్తయిందని, దీనికి గాను అహర్నిశలు శ్రమించిన కాంగ్రెస్ పార్టీ BLA లను అభినందించారు. ఈ ప్రక్రియలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మరో రెండు రోజుల సమయం ఉందని, జరిగిన తప్పులను సవరించుకుందామని అన్నారు. ఆగస్టు 12 13 తేదీలలో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని, దానిలో సరి చేసుకోవాలని, తొలగిపోయిన ఓట్లను తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.1
- పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.. రెండు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ సదర్ మాట్ బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా తలపిస్తుంది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు(9, 10) ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పశువు కాపరులు, చేపల వేటకు వెళ్లే జార్లర్లు సైతం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రావద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 13714 క్యూసెక్కులు... ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగ 80.5 టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం 1065.90 అడుగులు కాగ 17.243 టీఎంసీలు గత ఏడాది 1077 అడుగులు కాగ 37.636 టీఎంసీలు1
- కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.1
- భారీ వర్షాలతో కోరుట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, కమిషనర్ రాఘవేంద్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు."1
- కడం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలిన అధికారులు నిర్మల్ జిల్లా లో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటివరకు 94137 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. 11 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు మొదలుతున్నారు. ఇంట్లో ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఉందని అధికారులు తెలుపుతున్నారు.1
- నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 4,051 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టులో 1,065 అడుగుల నీటిమట్టంతో 16 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1,075 అడుగుల నీటిమట్టంతో 32 టీఎంసీల నీటి నిల్వ ఉంది1
- రెయిన్బో బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించిన డిఎస్పి మధుసూదన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్ లో గల రెయిన్బో బ్లడ్ బ్యాంకును కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు వస్తేనే సకాలంలో రక్తాన్ని అందజేయగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని తల సేమియా బాధిత చిన్నారులకు వారి జీవితాంతం 15 రోజులకు ఒక ఎన్ని రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రక్తదాతలు ముందుకు రావాలని అన్నారు.నూతనంగా రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.ఈ రక్తదాన శిబిరంలో కామారెడ్డి జిల్లా సెంట్రల్ ఆర్మ్డ్ పరామిలిటరీ ఫోర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎమ్.డి. గౌస్ఉద్దీన్ అధ్వర్యంలో సైనికులు హెడ్ కానిస్టేబుల్ బండి ప్రభాకర్(బి యస్ఎఫ్),మోతాజి బాల కృష్ణ రావు,మాజీ సైనికుడు రంజిత్ రెడ్డి,కానిస్టేబుల్ బద్రి లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు.వీరికి డీఎస్పీ మధుసూదన్,సీఐ నరహరి ప్రశంస పత్రాలను,ఉత్తమ రక్తదాత పురస్కారాలను అందజేసి సన్మానించడం జరిగింది.దేశ రక్షణ కోసం సేవ చేయడమే కాకుండా ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్,డాక్టర్ సంతోష్ కుమార్,ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్,డాక్టర్ అజయ్ పేరాల,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరీ మారుతి, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జైపాల్ రెడ్డి,24 వ వార్డు కౌన్సిలర్ డాకి అరవింద్ రాజ్ మరియు బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ససాల రాజు,భట్టు భరద్వాజ్,సైఫ్ నజీర్,మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- ఖానాపూర్ తర్లపాడు రోడ్డుపై వరద నీరు వాహనదారులకు ఇబ్బందులు ఖానాపూర్ తర్లపాడ్ వెళ్లే దగ్గర రోడ్డుపై వరద నీరు చేరడంతో ప్రయాణికులు స్థానికులు చాలా ఇబ్బంది పడ్డారు అటు ఇటు వెళ్లే వాహనదారులు చూసి జాగ్రత్తగా వెళ్లాలని అక్కడి స్థానికులు సూచించారు1