Shuru
Apke Nagar Ki App…
పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం చేర్చాలి జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు
మెదక్ న్యూస్
పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం చేర్చాలి జై భీమ్ మహాసేన ఆధ్వర్యంలో విశ్వజ్జనకళా మండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆరో తరగతి నుంచి చేర్చాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా నుండి రథయాత్ర ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా మీదుగా మెదక్ జిల్లాకు చేరుకుంది మెదక్ జిల్లాలో జై భీమ్ మహా సేన విశ్వజనకరమండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రథయాత్ర నిర్వహించి ఏడు డిమాండ్లను ప్రజలకు వివరించారు ఐదు ఏప్రిల్ లైవ్ నుంచి 11 నుంచి 13 వరకు ఏప్రిల్ నెల దీక్ష అప్పటికి రాజ్యాంగాన్ని చేర్పించకపోతే నాలుగు 14న అమ్మాయిల నిరాహార దీక్ష కోరుకుంటామని విశ్వ జన కళా మండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి అంజన్న అశోక్ నాగేశ్వరరావు సురేష్ బాబు బాలస్వామి రాణి యాదమ్మ రమేష్ ఎల్లయ్య యాదన్న మొగులయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ శివారులో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. 44వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సదరు వ్యక్తిని లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని, అతడి వివరాలు తెలియరాలేదని SI ఆంజనేయులు తెలిపారు.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- నందిపేట్ మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ గౌడ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ రావుపై నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటూ గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై దొంగనోట్లు, ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కానిస్టేబుల్‌పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు.1
- I want advertisement urgent hiring job urban company Housekeeping staff jobs1
- తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు,వెలమలు కలిసి కొట్టేసిన లక్ష పద్నాలుగు వేల ఎకరాల భూదాన్ భూముల లెక్క తేల్చాలని బీసీ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదోడు కేవలం 30 ఎకరాల్లో గుడిసెలు వేసుకుంటే కూలగొట్టారు...మరి ఈ లక్ష ఎకరాల సంగతి ఏందీ.? గత ప్రభుత్వ పెద్దలు,ఈ ప్రభుత్వ పెద్దలు కలిసి లక్ష ఎకరాల భూదాన్ భూములు కొట్టేశారు. నాటి కెసిఆర్.. నేటి రేవంత్ రెడ్డి పాలనలో భూదాన్ భూముల సంగతి తేల్చాలని తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.3
- తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఆలయ పూజారి పార్థివ శర్మ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి అభిషేకం పట్టు వస్త్రలంకరణ పుష్పలంకరణ గావించారు.అలంకరణ అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి మహా నైవేద్యం ఇచ్చారు అనంతరం కేతు చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు తర్వాత భక్తులకు దివ్యదర్శన భాగ్యం కలిగిస్తామనిఆలయ ఈవో వీరేశంతెలిపారు.1
- కామారెడ్డిలో హోలీ సంబరాలు మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ ఏడాది రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రజలు ప్రకృతి సిద్ధమైన రంగులతో పండుగను జరుపుకోవడం విశేషం. పర్యావరణానికి హాని కలగకుండా సహజ రంగులను వాడటంపై యువత, చిన్నారులు అవగాహన ప్రదర్శించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పట్టణమంతా సందడి నెలకొంది.1
- తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మంగళవారం పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం దీనిని ఆచారంగా భావించి ఎంతో ఇష్టంతో ఆడుతారు అంటూ అక్కడ ప్రజలు పేర్కొన్నారు.1