ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక సంవత్సరం ప్రారంభ దినోత్సవం ఘనంగా నిర్వహణ గజ్వెల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 1 ప్రజా తెలంగాణ న్యూస్/ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాణిజ్య విభాగం అధిపతి జె. లక్ష్మీనర్సయ్య అధ్యక్షత వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యస్. గణపతి రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టాలని, ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.వాణిజ్య విభాగం అధిపతి జె. లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, 2025 నూతన ఆదాయ పన్ను చట్టంలోని ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. సీనియర్ అధ్యాపకులు వి. మార్కండేయ వాణిజ్య విద్యార్థులు మరియు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారు తెలుసుకోవాల్సిన ఆర్థిక పద్ధతులపై అవగాహన కల్పించారు.అధ్యాపకులు ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ, భారతదేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన దినోత్సవం సందర్భంగా ఆర్బీఐ ముఖ్య కార్యకలాపాలు, విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక సంవత్సరం ప్రారంభ దినోత్సవం ఘనంగా నిర్వహణ గజ్వెల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 1 ప్రజా తెలంగాణ న్యూస్/ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాణిజ్య విభాగం అధిపతి జె. లక్ష్మీనర్సయ్య అధ్యక్షత వహించారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యస్. గణపతి రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో విద్యార్థులు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టాలని, ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.వాణిజ్య విభాగం అధిపతి జె. లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ, 2025 నూతన ఆదాయ పన్ను చట్టంలోని ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. సీనియర్ అధ్యాపకులు వి. మార్కండేయ వాణిజ్య విద్యార్థులు మరియు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారు తెలుసుకోవాల్సిన ఆర్థిక పద్ధతులపై అవగాహన కల్పించారు.అధ్యాపకులు ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ, భారతదేశ కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన దినోత్సవం సందర్భంగా ఆర్బీఐ ముఖ్య కార్యకలాపాలు, విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- ఓయూలో ఘనంగా ప్రారంభమైన డుసిమస్ 2025 - 2026' ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల ఆతిథ్యమిస్తున్న యూత్ కల్చరల్ ఫెస్ట్ 'డుసిమస్ 2025 - 2026' బుధవారం ఘనంగా ప్రారంభమైంది. డుసిమస్ కు రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఫెస్ట్ లో భాగంగా మొదటిరోజు వక్తృత్వం, ఉపన్యాసం, పెయింటింగ్, ఫొటోగ్రఫీలలో పోటీలు జరిగాయి. రెండవ రోజు గురువారం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, ర్యాంప్ వాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్ కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాలలు,నేషనల్ లా కళాశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. గత పదమూడు ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. విద్యార్థులే ముందుండి దీనిని నిర్వహించడం విశేషం. ఈ వేడుకల నిర్వహణ పట్ల విద్యార్థులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వేడుకలు క్రమం తప్పకుండా నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఉద్యమాలకు కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా ఇటువంటి ఫెస్ట్ కు ఆతిథ్యమిచ్చి, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తోందని కొనియాడారు. ఇటువంటి పోటీలతో విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, ఇతర కళాశాలల విద్యార్థులతో స్నేహం అభివృద్ధి అవుతుందని వివరించారు. వేడుకల నిర్వహణను విద్యార్థులు ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. ఎన్ రాంప్రసాద్, డీన్, హెచ్ఓడి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, స్టూడెంట్ ఆర్గనైజర్లు బండి భరత్, సిద్దార్థ్, శ్రీజ బాల్ రెడ్డి, టి. క్రాంతి, జస్వంత్, తదితరులు పాల్గొన్నారు.2
- హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ ఈ మధ్యకాలంలో పదవీ విమరణ పొందారు. పెన్షన్ డబ్బుల కోసం పరిపాలన భవనం చుట్టూ తిరుగుతుండగా బిల్ సెక్షన్ లోని సీనియర్ అసిస్టెంట్ అయిన రమేష్ 15000 లంచం అడిగాడు. దానితో బాధితులు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. దీంతో రంగంలో ఏసిబి అధికారులు. ఇద్దరు పైన నిగ వేశారు. బాధితులు తాను 15000 ఇవ్వలేను అని చెప్పగా మరొక సీనియర్ అసిస్టెంట్ అరవింద్ మధ్యవర్తిగా వచ్చి 13,000 కు లంచం కుదుర్చుకొని బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఓయూ బస్టాప్ వద్ద బాధితుల దగ్గర నుండి 13,000 తీసుకొని ఓయూ పరిపాలన భవనం వచ్చాడు. పరిపాలన భవనం సెక్షన్ లోకి రాగానే ఏసీబీ అధికారి అరవింద్ మరియు రమేష్ లోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైల్ కోసం సోదాలు నిర్వహించారు అనంతరం రమేష్ అరవింద్ లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు రేపు ఉదయం కోర్ట్ లో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించే సమయంలో ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ పరిపాల భవనంలోనే ఉన్నారు.2
- Post by Tagore3
- వికారాబాద్, పరిగి : వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమేరా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పరిగి మండల కేంద్రంలో మెరుపు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా అక్రమంగా నిలువ ఉంచిన 12 సిలిండర్లను స్వాధీనం చేసుకొని, మమ్మల్ని కలగానే వ్యక్తి కూలిన మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి దానిని సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి అనుమతులు లేకుండా గరువు గరువు ముగిసిన ముడుసరుకులు పారిశ్రామిక రంగులు ఉపయోగించి తయారు చేస్తున్న నిత్య ఐస్క్రీమ్ యూనిట్ పై దాడి చేసి కల్తీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ గ్యాస్ సిలిండర్లు నిలువ ఉంచడం చట్టరీత్యా నీరమని వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు నాణ్యత పై అధికారులు మరింత కఠినంగా ఉంచుతున్నారని ఇలాంటి చట్ట వివిధ కార్యక్రమాలపై టాస్క్ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని హెచ్చరించారు1
- పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, గ్రోస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ఎనలేనివని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ పాల్గొని, పేదలకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ పేదలకు సహాయ పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంపత్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాయ్ ముర్రే పాల్గొన్నారు1
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- Post by Tagore1
- నల్లగొండ బ్రేకింగ్: జి.ఓ నెం.60ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వాహన యజమానులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు.... ప్లకార్డులు పట్టుకుని, నిరసన వ్యక్తపరిచారు... ఈ కార్యక్రమం *నల్లగొండ మాక్సి క్లబ్ సీసీ బస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితరాజు రమేష్* ఆధ్వర్యంలో కొనసాగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: ఇప్పటికే ట్యాక్సులు, టోల్ ఫీజులు, డీజిల్ ధరలతో నలిగిపోతున్నాం.. జి.ఓ. 60 మాకు మరింత భారంగా మారింది... లారీకి వేల రూపాయల అదనపు భారం పడుతోంది... మా ఆదాయం మాత్రం రోజురోజుకీ పడిపోతోంది... కిరాయిలు లేక అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రభుత్వం మా పరిస్థితి అర్థం చేసుకోవాలి... "ఎక్సైజ్ శాఖ తరువాత కోట్లాది రూపాయలలో ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న కూడా వాహన యజమానుల యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు... కానీ మాకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదు... రిపేర్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి.. నల్లగొండలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలి... వాహన యజమానులు జి.ఓ. నెం.60ను తక్షణమే రద్దు చేయాలి అని డిమాండ్లు చేశారు.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించాలి... వాహన యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి హెచ్చరిక చేశారు... మా డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చే ఆందోళనలు చేపడతాం...1
- నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.3