logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పైప్లాన్ పగిలింది.. ఇల్లంతా ధ్వంసమైంది 25 నిమిషాల్లో అతలాకుతలం చేసిన 'మిషన్ భగీరథ' పైప్ లైన్ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి.. ఓ ఇం ట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో శనివారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ పాల్వంచ బసవతారక కాలనీ మీదుగా వెళుతోంది. శుక్రవారం పాక్షికంగా ఈ పైపులైన్ పగలగా సమీపంలోని రైతు హున్నాలాల్ టమాటా తోట నీట మునిగింది. శనివారం ఈ పైపులైన్ ను పరిశీలించిన అధికారులు ఆదివారం మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి 1.20 గం టలకు మరోచోట పైప్ పగిలింది. దీంతో 450 హెచ్పీ మోటార్ల ద్వారా వచ్చే ఫోర్స్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో వరద నీరంతా సమీపంలోని తేజావత్ మోహన్ బాబు ఇంటిపై వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఇంటి అద్దాలు, గేట్ రాడ్లు, ఫ్యాన్లు ధ్వంసం అయ్యాయి. కిటికీ అద్దాలు పగిలి ఇంట్లోకి వరద చిమ్మడంతో ఫ్రిడ్జ్, సెల్ఫోన్లు, కంప్యూటర్, టీవీ తడిసి ముద్దయ్యాయి. మొత్తంగా రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించగా రాత్రి 1.45 ని.లకు పైపులైన్ నీరు సరఫరా అయ్యే గేట్ వాల్ను మూసేశారు. డీఈ సాయి ఆదివారం తెల్లవారుజా మున మోహన్ బాబు ఇంటిని పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని మరమ్మతు చేయిస్తా మని డీఈ హామీ ఇచ్చారు...

1 day ago
user_VANAMA SRINIVAS RAO
VANAMA SRINIVAS RAO
జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 day ago

పైప్లాన్ పగిలింది.. ఇల్లంతా ధ్వంసమైంది 25 నిమిషాల్లో అతలాకుతలం చేసిన 'మిషన్ భగీరథ' పైప్ లైన్ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి.. ఓ ఇం ట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో శనివారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ పాల్వంచ బసవతారక కాలనీ మీదుగా వెళుతోంది. శుక్రవారం పాక్షికంగా ఈ పైపులైన్ పగలగా సమీపంలోని రైతు హున్నాలాల్ టమాటా తోట నీట మునిగింది. శనివారం ఈ పైపులైన్ ను పరిశీలించిన అధికారులు ఆదివారం మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి 1.20 గం టలకు మరోచోట పైప్ పగిలింది. దీంతో 450 హెచ్పీ మోటార్ల ద్వారా వచ్చే ఫోర్స్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో వరద నీరంతా సమీపంలోని తేజావత్ మోహన్ బాబు ఇంటిపై వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఇంటి అద్దాలు, గేట్ రాడ్లు, ఫ్యాన్లు ధ్వంసం అయ్యాయి. కిటికీ అద్దాలు పగిలి ఇంట్లోకి వరద చిమ్మడంతో ఫ్రిడ్జ్, సెల్ఫోన్లు, కంప్యూటర్, టీవీ తడిసి ముద్దయ్యాయి. మొత్తంగా రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించగా రాత్రి 1.45 ని.లకు పైపులైన్ నీరు సరఫరా అయ్యే గేట్ వాల్ను మూసేశారు. డీఈ సాయి ఆదివారం తెల్లవారుజా మున మోహన్ బాబు ఇంటిని పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని మరమ్మతు చేయిస్తా మని డీఈ హామీ ఇచ్చారు...

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
  • *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    1
    *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త*
ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది 
ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    2
    ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • హన్మకొండ:కాజీపేట పట్టణంలోని మడికొండ చౌరస్తాలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో టెన్షన్ నెలకొంది. మంగళవారం చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని పండుగ రాజ్ కుమార్ ఒంటిపై డీజిల్ పోసి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకున్నారు.ఆయనను శిబిరం నుంచి తీసుకువెళ్ళారు.గత 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వలన పడుతున్న బాధను ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    హన్మకొండ:కాజీపేట పట్టణంలోని మడికొండ చౌరస్తాలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో టెన్షన్ నెలకొంది. మంగళవారం చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలని పండుగ రాజ్ కుమార్ ఒంటిపై డీజిల్ పోసి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకున్నారు.ఆయనను శిబిరం నుంచి తీసుకువెళ్ళారు.గత 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వలన పడుతున్న బాధను ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 min ago
  • గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.
    1
    గుంటూరు..
*కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..*
గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు.
సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు.
తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి.
మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు.
కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం.
షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం.శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం Rs.1కోటి ,05లక్షల ,94వేల ,090 రూపాయలు, బంగారం-80 గ్రాములు, వెండి-650 గ్రాములు, 40 రోజుల హుండీ ఆదాయం
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం.శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం Rs.1కోటి ,05లక్షల ,94వేల ,090 రూపాయలు,
బంగారం-80 గ్రాములు,
వెండి-650 గ్రాములు,
40 రోజుల హుండీ ఆదాయం
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.