హామీలు వద్దు రోడ్ల పనులు చేపట్టండి ఆగస్టు 15 లోగా రోడ్లు వేయకపోతే టెంటు వేసి నిరసన తెలియజేస్తాం సుందరయ్య కాలనీ వాసులు సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తుల ఆవేదన బూర్గంపాడు మండలం సారపాకలోని సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కాలనీలో సుమారు 27 రోడ్ల ముక్కలు ఉండగా, మూడు రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మూడు రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలని కాంట్రాక్టర్ సూచించడంతో స్థానికులే మట్టిని తొలగించుకున్నారని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ బ్లేడ్‌తో రెండుసార్లు రోడ్లను లెవలింగ్ చేసినప్పటికీ ఇప్పటివరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టలేదని అన్నారు. కాలనీలోని ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నప్పటికీ, ముందుగా మిగిలిపోయిన మూడు రోడ్లను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యను సర్పంచ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా హామీలు మాత్రమే ఇస్తున్నారని, పనులు మాత్రం ప్రారంభం కావడం లేదని బత్తుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే టెంట్ వేసుకుని నిరసన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అలాగే కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన, ఎస్.కె. అబీద, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ షాహదా, ప్రియాంక, జైరీనా, షకీరా తదితరులు పాల్గొన్నారు.
హామీలు వద్దు రోడ్ల పనులు చేపట్టండి ఆగస్టు 15 లోగా రోడ్లు వేయకపోతే టెంటు వేసి నిరసన తెలియజేస్తాం సుందరయ్య కాలనీ వాసులు సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తుల ఆవేదన బూర్గంపాడు మండలం సారపాకలోని సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కాలనీలో సుమారు 27 రోడ్ల ముక్కలు ఉండగా, మూడు రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మూడు రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలని కాంట్రాక్టర్ సూచించడంతో స్థానికులే మట్టిని తొలగించుకున్నారని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ బ్లేడ్‌తో రెండుసార్లు రోడ్లను లెవలింగ్ చేసినప్పటికీ ఇప్పటివరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టలేదని అన్నారు. కాలనీలోని ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నప్పటికీ, ముందుగా మిగిలిపోయిన మూడు రోడ్లను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యను సర్పంచ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా హామీలు మాత్రమే ఇస్తున్నారని, పనులు మాత్రం ప్రారంభం కావడం లేదని బత్తుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే టెంట్ వేసుకుని నిరసన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అలాగే కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన, ఎస్.కె. అబీద, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ షాహదా, ప్రియాంక, జైరీనా, షకీరా తదితరులు పాల్గొన్నారు.
- భూకబ్జా యత్నాలను అడ్డుకుని బాధిత రైతుకు రక్షణ కల్పించాలి: భూక్యా సీతారాం నాయక్ కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేయడం, బలవంతంగా పామాయిల్ మొక్కలు నాటడం, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత రైతు భట్టు హరి తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు కాపీని ఏవో రామకృష్ణ కి అందజేశారు. గట్టు మల్ల గ్రామ పరిధిలోని సర్వే నం. 120లో 9.01 ఎకరాలు, సర్వే నం. 119/ ఏ/1లో 1.01 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి భట్టు శ్రీనివాస్ పేరుపై పట్టా పాస్‌బుక్‌లు, భూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. భట్టు శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నందున, తన మేనల్లుడు భట్టు హరికి 25-06-2025న (ఎస్పిఏ) ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో భూమిలో బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం, బోరులో రాళ్లు వేయడం, కేసింగ్ పైపులను ధ్వంసం చేయడం, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో పాటు, గతంలో ఎస్ సి /ఎస్టి (Prevention of Atrocities) Act కింద కేసు కూడా నమోదు అయినట్లు వెల్లడించారు. అలాగే 24-03-2026న అదే వ్యవసాయ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవల సుమారు 40–50 మంది వ్యక్తులను భూమి వద్దకు తీసుకువచ్చి, పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్ని నాశనం చేయడంతో పాటు, భూ యజమాని అనుమతి లేకుండా పామాయిల్ మొక్కలను నాటినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు దాడికి ప్రయత్నిస్తూ, ప్రాణహాని కలిగించే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ మాట్లాడుతూ, భట్టు శ్రీనివాస్ భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ హక్కుదారులను నిర్ధారించాలని, పంట నష్టం, అక్రమ ప్రవేశం తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను కోరారు. బాధిత రైతు కుటుంబానికి తక్షణ పోలీసు రక్షణ కల్పించి, భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడం, బలవంతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పోలీస్, రెవెన్యూ శాఖలకు అందించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. “భట్టు శ్రీనివాస్ భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలి. భూమి హక్కులు, శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ అధికారుల బాధ్యత. అధికారులు స్పందించి న్యాయం చేయని పక్షంలో బంజారా బిడ్డలను ఏకం చేసి, మా బంజారా బిడ్డ భట్టు శ్రీనివాస్ భూమిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం” అని భూక్యా సీతారాం నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, భట్టు నరేష్ నాయక్, భట్టు వీరన్న నాయక్, భట్టు హరి నాయక్, బానోత్ సందీప్ నాయక్, బానోత్ సతీష్ నాయక్, భట్టు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- సారపాక శివాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నవగ్రహ హోమం*l విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ విభాగం ఆధ్వర్యంలో సారపాక శివాలయంలో నవగ్రహ హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయోధ్య రామజన్మభూమిలో జరిగిన సొమ్ము చోరీ ఘటనను నిరసిస్తూ, ఆలయ విశిష్టతను, స్వామీజీలు, అర్చకులు, హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా జరుగుతున్న పరిణామాలను ఖండిస్తూ ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్య రామజన్మభూమి వంటి పవిత్రమైన క్షేత్రానికి సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. పార్లమెంట్ వెలుపల ఇండియా కూటమి నాయకులు చేస్తున్న నిరసనలు, వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారికి భగవంతుడు సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేకంగా నవగ్రహ హోమం నిర్వహించినట్లు తెలిపారు. హోమ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హిందూ సమాజంలో ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. హిందూ ధర్మం, ఆలయాలు, అర్చకులు, స్వామీజీల పట్ల గౌరవభావం పెంపొందాలని, హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి దుర్బుద్ధి తొలగి సద్బుద్ధి కలగాలని భగవంతుడిని ప్రార్థించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ విభాగం తెలంగాణ రాష్ట్ర సహ ప్రముఖ్ ముఖ్య అతిథిగా హాజరై నవగ్రహ హోమాన్ని నిర్వహించారు. ఖమ్మం విభాగ్ సంఘటనా కార్యదర్శి శ్రీ గడిదేశీ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి నాగేశ్వరరావు, ప్రఖండ కార్యకర్తలు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.2
- హామీలు వద్దు రోడ్ల పనులు చేపట్టండి ఆగస్టు 15 లోగా రోడ్లు వేయకపోతే టెంటు వేసి నిరసన తెలియజేస్తాం సుందరయ్య కాలనీ వాసులు సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తుల ఆవేదన బూర్గంపాడు మండలం సారపాకలోని సుందరయ్య నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కాలనీలో సుమారు 27 రోడ్ల ముక్కలు ఉండగా, మూడు రోడ్ల పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన మూడు రోడ్లపై ఉన్న మట్టిని తొలగించాలని కాంట్రాక్టర్ సూచించడంతో స్థానికులే మట్టిని తొలగించుకున్నారని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ బ్లేడ్‌తో రెండుసార్లు రోడ్లను లెవలింగ్ చేసినప్పటికీ ఇప్పటివరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టలేదని అన్నారు. కాలనీలోని ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నప్పటికీ, ముందుగా మిగిలిపోయిన మూడు రోడ్లను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యను సర్పంచ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా హామీలు మాత్రమే ఇస్తున్నారని, పనులు మాత్రం ప్రారంభం కావడం లేదని బత్తుల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆగస్టు 15లోగా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే టెంట్ వేసుకుని నిరసన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అలాగే కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన, ఎస్.కె. అబీద, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ షాహదా, ప్రియాంక, జైరీనా, షకీరా తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రైతుల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది, జలసౌధలో జరిగే మీటింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే.. తెలంగాణలోని ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించకపోతే.. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ముట్టడిస్తాం, మరో జల ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం ✊🏻 తెలంగాణ రైతుల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది, జలసౌధలో జరిగే మీటింగ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేయకపోతే.. తెలంగాణలోని ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని తొలగించకపోతే.. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ముట్టడిస్తాం, మరో జల ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం ✊🏻1
- ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధులకు,బుక్స్ యూనిఫాం పంపిణీ..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని జేవీఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పదవ తరగతి నుండి డిగ్రీ చదివే విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగ్స్, పుస్తకాలు, ఫ్యాడ్స్ యూనిఫామ్స్ పంపిణీ చేసిన కలెక్టర్ దివాకర్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్1
- సండ్రా ఫైబర్ కేటుగాడు పిడమర్తి రవి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ అందరికీ ముందు నుంచే నేను హెచ్చరిస్తున్న సండ్ర వెంకట వీరయ్య సైబర్ నేరగాడు సైబర్ కేటు గాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులను జమ చేసుకొని వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ పెట్టి ఆ సైబర్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి చేసిన గొప్ప పని ఇది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా దొంగ నోట్ల ముద్రణ జూదం బెట్టింగ్ అన్ని మాఫియాల వెనుక సండ్ర వెంకట వీర ఉన్నాడు ఆయన పని డబ్బు సంపాదనని ఆయన సత్తుపల్లికి అభివృద్ధి ఆయననే అభివృద్ధి చెందింది ఇటువంటి లోఫర్ పనులు చేసుకుంటా ఈ ప్రాంత యువకులైనటువంటి పట్టాభి ప్రవీణ్ లు కాదు ముందుగా సండ్రా వెంకట వీరిని అరెస్ట్ చేయాలి ఆస్ట్రేలియా ఉంటున్న తన కొడుకుని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావాలి పోలీసులు ప్రభుత్వము సండ్ర వెంకటవీరని అరెస్టు చేస్తే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ముఖం చాట్ చేసిన వీరయ్య నిజంగా సత్తుపల్లి మీద నిజంగా అతని మీద వస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి కి రాకుండా కీరవాణి సంభాషణలు జరుపుతున్నాడు1
- సుందరయ్య నగర్ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్‌లో మిగిలిపోయిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు స్పందిస్తూ, సుమారు 27 రోడ్లలో మూడు రోడ్లు మాత్రమే వేయకుండా నిలిపివేయడం దారుణమని అన్నారు. సీసీ రోడ్లు వేస్తామని చెప్పడంతో స్థానికులు రోడ్డుపై ఉన్న మట్టిని ఇళ్లలోకి తరలించుకున్నారని, అనంతరం ట్రాక్టర్ బ్లేడుతో రెండుసార్లు లెవెలింగ్ చేసినప్పటికీ ఇప్పటివరకు రోడ్లు వేయలేదని ఆయన తెలిపారు. నాలుగు నెలలు గడిచినా అధికారులు “వేస్తాం” అని చెబుతున్నారే తప్ప పనులు ప్రారంభించలేదని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయడాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే ముందుగా నిలిచిపోయిన మూడు రోడ్ల పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారని చెప్పారు. సర్పంచ్ దృష్టికి, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య నగర్‌లో డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే డ్రైనేజీలు నిర్మించాలని కూడా డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 15న టెంట్లు వేసుకుని ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యురాలు పాపినేని సరోజన, ఎస్.కె. అబీద, కనకం వెంకటేశ్వర్లు, జయమ్మ, అలివేలు, నిర్మల, సయ్యద్ సాహెదా, ప్రియాంక, జరీనా, షకీరా తదితరులు పాల్గొన్నారు.1
- సాంబాయిగూడెం ఇసుక ర్యాంప్‌లో స్థానిక ఆదివాసులకు న్యాయం చేయాలి: తుడుందెబ్బ మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలోని ఇసుక ర్యాంప్ నిర్వహణలో స్థానిక ఆదివాసులకు న్యాయం చేయాలని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఆదివాసుల హక్కులు, ఉపాధి అవకాశాలను పక్కనపెట్టి గిరిజనేతరుల ఆధిపత్యంలో ర్యాంప్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. స్థానిక సమస్యపై మాట్లాడేందుకు వెళ్లిన తుడుందెబ్బ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వట్టం సుభద్రపై కొందరు దురుసుగా ప్రవర్తించడం, గొడవకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నామని కమిటీ పేర్కొంది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇసుక ర్యాంప్ నిర్వహణలో స్థానిక ఆదివాసుల భాగస్వామ్యం, హక్కులు, ఉపాధి అవకాశాలను అధికారులు పరిరక్షించాలని, సొసైటీ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, PESA చట్టంలోని గ్రామసభ హక్కులను పరిగణనలోకి తీసుకుని పారదర్శక నిర్ణయం తీసుకోవాలని కోరింది. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రాజెక్ట్ అధికారి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తుడుందెబ్బ నాయకులు హెచ్చరించారు.1