వేములవాడలో భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించిన మంత్రులు..బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడలో విస్తృతంగా పర్యటించారు. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వేములవాడ గుడి చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. వేములవాడకు దిక్సూచిగా నిలిచే శివుడి భారీ ప్రతిమను ఆవిష్కరించారు. కోటి 50 లక్షల రూపాయలతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త రూట్ లను కూడా ఏర్పాటు చేసి మరింత రవాణాకు సౌకర్యాలను పెంపొందించామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్ ను గతంలో ఎత్తివేస్తామని ప్రకటన చేస్తే ఆది శ్రీనివాస్ తో కలిసి పోరాటం చేశామని చెప్పారు. 1984 లో ప్రారంభమైన బస్టాండ్ ను ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేయలేదని, రాజన్న క్షేత్రం కావడంతో ప్రతిరోజు 250 బస్సులు 500 ట్రిప్పులతో ప్రతినిత్యం వేలాదిమంది ఇక్కడికి వస్తున్నారని అందులో భాగంగానే బస్టాండ్ కోటి పది లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నామని పొన్నం తెలిపారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్షాలు ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నాయని రైతులు ఆగస్టు చివరి మాసం వరకు త్వరగా పండే పంటలు మాత్రమే వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వర్షాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రైతులు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆలయాలు ఉండే ప్రాంతాల్లోని బస్ స్టేషన్లను ఆధునికరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
వేములవాడలో భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించిన మంత్రులు..బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శ్రీకారం కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. భారీ శివుడి ప్రతిమను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడలో విస్తృతంగా పర్యటించారు. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వేములవాడ గుడి
చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. వేములవాడకు దిక్సూచిగా నిలిచే శివుడి భారీ ప్రతిమను ఆవిష్కరించారు. కోటి 50 లక్షల రూపాయలతో వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించారని మంత్రి పొన్నం ప్రభాకర్
తెలిపారు. అధికారంలోకి వచ్చాక సిబ్బందిని పెంచడమే కాకుండా కొత్త రూట్ లను కూడా ఏర్పాటు చేసి మరింత రవాణాకు సౌకర్యాలను పెంపొందించామన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ బస్టాండ్ ను గతంలో ఎత్తివేస్తామని ప్రకటన చేస్తే ఆది శ్రీనివాస్ తో కలిసి పోరాటం చేశామని చెప్పారు. 1984 లో ప్రారంభమైన బస్టాండ్ ను ఇప్పటివరకు ఎవరు అభివృద్ధి చేయలేదని, రాజన్న క్షేత్రం కావడంతో ప్రతిరోజు 250 బస్సులు 500 ట్రిప్పులతో ప్రతినిత్యం వేలాదిమంది ఇక్కడికి వస్తున్నారని అందులో భాగంగానే బస్టాండ్
కోటి పది లక్షల రూపాయలతో ఆధునికరిస్తున్నామని పొన్నం తెలిపారు. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వర్షాలు ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నాయని రైతులు ఆగస్టు చివరి మాసం వరకు త్వరగా పండే పంటలు మాత్రమే వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వర్షాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా రైతులు ముందుకు సాగాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రముఖ ఆలయాలు ఉండే ప్రాంతాల్లోని బస్ స్టేషన్లను ఆధునికరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.
- ఎల్లంపల్లి ప్రాజెక్టు భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.1
- గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.2
- ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్టీసీ.. కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.2
- వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన వరుణ యాగం.స్వామి వారిని దర్శించుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డా. సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్న మంత్రులు వరుణ యాగంలో పాల్గొన్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురువాలని కోరుతూ మూడు రోజులపాటు కొనసాగనున్న వరుణ యాగం.2
- మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి2
- కరీంనగర్ లో సిటీ బస్సులు ప్రారంభం...రాబోయే రోజుల్లో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి కరీంనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆర్టీసీ సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి మూడు రూట్లలో వెళ్ళే మూడు సిటీ బస్సులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించారు. సిటీ బస్సుల ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మేయర్ శ్రీనివాస్ కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి చింతకుంట, కరీంనగర్ టు కొత్తపల్లి, కరీంనగర్ టు వాగేశ్వరి నగర్ వరకు మూడు సిటీ బస్సులను ప్రారంభించామని రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్ చల్మెడ మెడికల్ కాలేజీ, కరీంనగర్ టు మానకొండూరు కు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు ఉపాధి కోసం కరీంనగర్కు వచ్చే వారి కోసం సిటీ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పేద ప్రజల గుండెచప్పుడుగా లైఫ్ లైన్ గా ఆర్టీసీ పనిచేస్తుందన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యంతో ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని తెలంగాణలో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి ఆర్టిసీ బస్సు నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు నడిచి 65 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరవేస్తుందని ప్రకటించారు. ఆర్టీసీ ప్రజలదని ఆ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని స్పష్టం చేశారు.2