logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లంపల్లి ప్రాజెక్టు‌ భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

ఎల్లంపల్లి ప్రాజెక్టు‌ భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.

More news from తెలంగాణ and nearby areas
  • గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.
    2
    గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది.
గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది.
8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    7 hrs ago
  • ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్టీసీ.. కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 
పేద ప్రజల గుండె చప్పుడు.. 
లైఫ్‌లైన్ ఆర్టీసీ..
కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు 
త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ
పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం..
సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి..
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు.
మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న,
కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి 
బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. 
పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 
ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , 
ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్ వ్యవసాయ చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రగుడు జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు ఐడీఓసీలో వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఆర్డీ పాస్ బుక్ ల పంపిణీ సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద రూ.3 కోట్ల 22 లక్షలతో జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ , మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్‌బుక్‌లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకార శాఖ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ. సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక అని, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించడంతో పాటు భద్రత, భీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నేతన్నల సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. *నాణ్యమైన చీరల ఉత్పత్తి..* సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు పని కల్పిస్తూ నాణ్యమైన చీరలు మహిళలకు అందిస్తుందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేతన్న.. గీతన్న వేరు కాదని, జిల్లా నేతగా నేతన్న ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల మోడల్ చీర మహిళలకు అందుబాటు ధరలో ఒకటి తయారు చేసి.. జీ ఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వేలాది మంది నేతన్నలకు ఎనిమిది నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు అందించామని, ఇప్పటికే దాదాపు కోటి మీటర్ల చీరల ఉత్పత్తి పూర్తైందని తెలిపారు. మరో మూడు కోట్లకు పైగా మీటర్ల చీరల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 62 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని వెల్లడించారు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్న ఆది శ్రీనివాస్, 25 హెచ్‌పీ పవర్‌లూమ్‌లకు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలులోకి తీసుకురావడం ద్వారా పరిశ్రమకు ఊతమిచ్చిందన్నారు. రూ.50 కోట్లతో వేములవాడ లో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని తెలిపారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేతన్నల వృత్తి గౌరవాన్ని చాటిచెప్పేలా సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద రూ.3 కోట్లతో వస్త్రం తయారీ దశల విధానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రగుడు బై పాస్ జంక్షన్ సుందరీకరణ పనులు నేతన్న వృత్తి గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దామని తెలిపారు. వారిపై గౌరవం, ప్రేమతో వీటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. *మహిళలు పండగలు, కార్యక్రమాలకు కట్టుకుంటున్నారు.. : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వేములవాడ కు వచ్చే భక్తులు, పర్యాటకులు సేదతీరేలా.. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా గుడి చెరువు బండ్ పార్క్ పనులను పూర్తి చేసి.. ప్రారంభించామని తెలిపారు. రగుడు బై పాస్ జంక్షన్ సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ, రోడ్డు భద్రత చర్యలు తీసుకున్నామని, వస్త్రం తయారీలో వివిధ దశలను తెలుసుకునేలా విగ్రహాలను ఏర్పాటు అయ్యాయని తెలిపారు. గత ఏడాది జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు చాలా నాణ్యతతో తయారు చేశారని గుర్తు చేశారు. వాటిని మహిళలు పండగలు, ఇతర కార్యక్రమాలకు కట్టుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కూడా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బి గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
    4
    నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం
జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్ వ్యవసాయ చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రగుడు జంక్షన్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు
ఐడీఓసీలో వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఆర్డీ పాస్ బుక్ ల పంపిణీ
సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద రూ.3 కోట్ల 22 లక్షలతో జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ , మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి  మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్‌బుక్‌లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 
జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకార శాఖ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.  సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక అని, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించడంతో పాటు భద్రత, భీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. 
చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నేతన్నల సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు.
*నాణ్యమైన చీరల ఉత్పత్తి..*
సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ తెలిపారు.  ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు పని కల్పిస్తూ నాణ్యమైన చీరలు మహిళలకు అందిస్తుందని తెలిపారు.  సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేతన్న.. గీతన్న వేరు కాదని, జిల్లా నేతగా నేతన్న ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల మోడల్ చీర మహిళలకు అందుబాటు ధరలో ఒకటి తయారు చేసి.. జీ ఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. 
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వేలాది మంది నేతన్నలకు ఎనిమిది నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు అందించామని, ఇప్పటికే దాదాపు కోటి మీటర్ల చీరల ఉత్పత్తి పూర్తైందని తెలిపారు. మరో మూడు కోట్లకు పైగా మీటర్ల చీరల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 62 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని వెల్లడించారు. 
నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్న ఆది శ్రీనివాస్, 25 హెచ్‌పీ పవర్‌లూమ్‌లకు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలులోకి తీసుకురావడం ద్వారా పరిశ్రమకు ఊతమిచ్చిందన్నారు. రూ.50 కోట్లతో వేములవాడ లో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని తెలిపారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నేతన్నల వృత్తి గౌరవాన్ని చాటిచెప్పేలా సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద రూ.3 కోట్లతో వస్త్రం తయారీ దశల విధానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రగుడు బై పాస్ జంక్షన్ సుందరీకరణ పనులు నేతన్న వృత్తి గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దామని తెలిపారు. వారిపై గౌరవం, ప్రేమతో వీటిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
*మహిళలు పండగలు, కార్యక్రమాలకు కట్టుకుంటున్నారు.. : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వేములవాడ కు వచ్చే భక్తులు, పర్యాటకులు సేదతీరేలా.. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా గుడి చెరువు బండ్ పార్క్ పనులను పూర్తి చేసి.. ప్రారంభించామని తెలిపారు. రగుడు బై పాస్ జంక్షన్ సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ, రోడ్డు భద్రత చర్యలు తీసుకున్నామని, వస్త్రం తయారీలో వివిధ దశలను తెలుసుకునేలా విగ్రహాలను ఏర్పాటు అయ్యాయని తెలిపారు. గత ఏడాది జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరలు చాలా నాణ్యతతో తయారు చేశారని గుర్తు చేశారు. వాటిని మహిళలు పండగలు, ఇతర కార్యక్రమాలకు కట్టుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కూడా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బి గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 min ago
  • వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి
    2
    మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి 
మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా?
అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు
నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా?
టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?
- సీఎం రేవంత్ రెడ్డి
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు‌ భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్టు‌ భారీగా వరద...15 గేట్లు ఎత్తిన అధికారులు
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తారు. 1 లక్షా 55 వేల 625 
క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలో విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 356254 క్యూసెక్కులు కాగ ఔట్ ప్లో 171650 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిలువ 19.341 టిఎంసిలు ఉంది. 
ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్ ద్వారా ఐదు మోటర్లు ఆన్ చేసి 15750 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు.
ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న సుందిళ్ళ పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. సుందిళ్ళ బ్యారేజ్ 74 గేట్లు ఎత్తి వచ్చిన నీళ్ళను వచ్చినట్లు వదిలేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ప్లో 1 లక్షా 85 వేల క్యూసెక్కులు ఉంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సుందిళ్ళ బ్యారేజ్ లో నీటిని నిల్వ చేయడం లేదు. పార్వతి బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 11.87 టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిలువ నిల్ గా ఉంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కల్లూరు వద్ద వాగులో తృటలో తప్పిన ప్రమాదం... వరదలో బైకులతో సహా పడిపోయిన ఇద్దరిని కాపాడిన స్థానికులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులోని వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
    1
    కల్లూరు వద్ద వాగులో తృటలో తప్పిన ప్రమాదం... వరదలో బైకులతో సహా పడిపోయిన ఇద్దరిని కాపాడిన స్థానికులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులోని వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో
పెను ప్రమాదం తృటిలో తప్పింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.