కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి హిందూపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ర్యాలీ హిందూపురం: కర్నూలులో తక్షణమే హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోర్టు ఆవరణ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు న్యాయవాదులు ప్రదర్శనగా వెళ్లారు. రాయలసీమ ప్రాంత ప్రజల సౌకర్యార్థం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమని పేర్కొంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ... గతంలో చేసుకున్న ఒప్పందాలు, సీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కర్నూలులో న్యాయస్థాన బెంచ్‌ను పునరుద్ధరించాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి అమరావతికి వెళ్లలేక రాయలసీమ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1
- రాయదుర్గంలో ఘనంగా శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలో బుధవారం భగవాన్ శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హాటకేశ్వరస్వామి దేవాలయం నుంచి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వహించారు.అనంతరం శ్రీ జిహ్వేశ్వరస్వామి వారి భావచిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ ఊరేగింపు బళ్లారి రోడ్, వినాయక సర్కిల్ మీదుగా ఓబులాచారి రోడ్డు వరకు కొనసాగింది.ఊరేగింపులో స్వకుళ సాళి సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్వకుళ సాళి సమాజ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ, సభ్య సమాజంలో యుగపురుషుడిగా అవతరించిన శ్రీ జిహ్వేశ్వరస్వామి జయంతిని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం నామకరణ మహోత్సవం,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెంకటేశులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సమాజ బాంధవులు, భక్తులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.1
- కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు2
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3