సికింద్రాబాద్: అంతర్‌రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్.. 9 బైక్‌లు స్వాధీనం సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు అంతర్‌రాష్ట్ర స్థాయిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి కీలక విజయం సాధించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన మొత్తం 9 దొంగిలించిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. జూలై 22న సికింద్రాబాద్ పంచవటి లాడ్జ్ ఎదుట పార్క్ చేసిన బజాజ్ ప్లాటినా బైక్ చోరీ కేసు దర్యాప్తులో పోలీసులు 150కు పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ప్రధాన నిందితుడు బొంత యాదగిరి అలియాస్ గిరిని ఆల్ఫా హోటల్ సమీపంలో అరెస్ట్ చేశారు. విచారణలో అతడి సహచరుడు హుసేన్ బాష్యాను దమ్మాయిగూడలో అదుపులోకి తీసుకుని, అక్కడ దాచిన మరో 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాలకు తరలించి విక్రయించేందుకు ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాహనాలను సురక్షితంగా పార్క్ చేసి యాంటీ-థెఫ్ట్ లాకులు వినియోగించాలని ప్రజలకు పోలీసులు సూచించారు.

- బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- ఒకే ఊరికి 100 ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మేస్త్రీలు ఇసుక డైమండ్ పెరుగుతుంది: మంత్రి పోగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకేసారి ఒకే గ్రామంలో 100 ఇందిర ఇండ్లు ఇస్తే, మేస్త్రీలు, ఇసుక డిమాండ్ పెరుగుతుంది అందుకే దశలవారీగా ఇండ్లు మంజూరు చేస్తున్నాం -కలూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్‌పై విప్ బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు | ప్రతిపక్షాలకు సవాల్ | ఆలేరు అభివృద్ధే లక్ష్యం 👉 ఆలేరు రెవెన్యూ డివిజన్ ఖాయం... ప్రభుత్వం కట్టుబడి ఉంది!" – బీర్ల అయిలయ్య 👉 ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. 📡 T20HD Telugu news channel subscribe like share1
- ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ టీపీటీఎఫ్ 'చలో హైదరాబాద్' ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి చేగుంట, నర్సింగ్ మండలాల ఉపాధ్యాయులు శనివారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొని ప్రభుత్వం తమ సమస్యలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.1