మెట్‌పల్లిలో రాజకీయ కలయికలపై ఎమ్మెల్యే సంజయ్ ఆక్షేపణ మెట్‌పల్లిలో రాజకీయ కలయికలపై ఎమ్మెల్యే సంజయ్ ఆక్షేపణ మెట్‌పల్లి మున్సిపల్‌లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోమవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. సమావేశ మందిరంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అనంతర రాజకీయ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఆరుగురు సభ్యులు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి చేపట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల తీర్పును వక్రీకరించే విధంగా రాజకీయ కలయికలు జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చైర్మన్ పీఠం కోసం ఒక్కటవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. మైనార్టీలపై విమర్శలు చేసే బీజేపీ నాయకులు అవసరమైనప్పుడు మద్దతు కోసం వైస్ చైర్మన్ పదవి ఆఫర్ చేయడం ప్రజలను గందరగోళానికి గురిచేసే చర్య అని అన్నారు.బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మైనార్టీలకు టికెట్లు ఇవ్వడం కూడా రాజకీయ అవసరాల కోసమేనని ఆరోపించారు.కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేసే పార్టీల అసలు స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కోరుతూ, భారత రాష్ట్ర సమితి మాత్రం సిద్ధాంతాలు, విలువలతో ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు.

- మహా శివరాత్రి సందర్భంగా రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారంగపూర్ మండలం పెంబట్ల కొనపూర్ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం పది గంటలకు ఆలయంలో మహా శివుని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించి ఆశీర్వచనాలు అర్చకులు అందజేశారు మాజీ మంత్రి వెంట మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- నిర్మల్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదేవ్ కేక్ కట్టు చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.1
- కామన్పల్లిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జన్నారం మండలంలోని కామాన్పల్లి గ్రామంలో మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్, స్థానిక ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేజావత్ భరత్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల్ సోషల్ మీడియా అధ్యక్షుడు జునుగురు గణేశ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైకం లక్ష్మణ్, పసుల రాజన్న, రాగంశెట్టి ప్రవీణ్, చందనగిరి వెంకటేష్, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజీవాడి గ్రామ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి కంటైనర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైందన్నారు. కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- Post by Ravi Poreddy1
- కన్నుల పండుగగా రథోత్సవం వైభవంగా నిర్వహణ ఏడుపాయల వన దుర్గ మాత జాతర మహోత్సవ చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతులు, వేదమంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి, ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.1
- శ్రీదుబ్బరాజేశ్వర స్వామివారి రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా హర హర మహాదేవ అంటూ వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీదుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గత మూడు రోజుల నుండి అంగరంగ వైభవంగా పూజలందుకుంటున్నడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం పదకోండు గంటలకు శ్రీదుబ్బరాజేశ్వరస్వామి వారి రథోత్సవాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆసీనులు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ రథోత్సవాన్ని పురవీధుల గుండా స్వామివారి రథాన్ని పెద్ద ఎత్తున భక్తులు తడుతో లాగుతూ హర హర మహాదేవ ఓం నమశ్శివాయ అంటూ స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ శోభాయాత్రకు చుట్టుపక్కల గ్రామాలు వివిధ జిల్లాల నుండి కుటుంబ సమేతంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేశారు.1