logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాలికల విద్యే దేశ సాధికారతకు పునాది. “బాలికను చదివిద్దాం–దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దాం" సందేశంతో రాఖీలు కట్టిన బాలసదనం బాలికలు. బాలికలను ఆశీర్వదించి మిఠాయిలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనం బాలికలు శుక్రవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును కలిసి రాఖీలు కట్టారు. “బాలికను చదివిద్దాం–దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దాం” అనే సందేశంతో ప్రత్యేకంగా రూపొందించిన రాఖీలను కలెక్టర్‌కు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికలను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించడంతోపాటు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికలతో మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, భద్రత, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి మెరుగైన సేవలు అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలికల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందిస్తుందని భరోసా కల్పించారు. జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత మాట్లాడుతూ రక్షాబంధన్ ప్రేమానుబంధంతోపాటు పరస్పర బాధ్యత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఒక బాలికను చదివించడం ద్వారా ఆమె భవిష్యత్తుతోపాటు కుటుంబం, సమాజం, దేశ పురోగతికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. బాలికలకు సురక్షితమైన వాతావరణం, సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సహాయవాణి జిల్లా సమన్వయకర్త నరేష్, బాలసదనం సిబ్బంది అరుణ, రాణి, సఖి కేంద్రం సిబ్బంది లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
4 hrs ago
48215c12-bc74-4856-8d1e-e0e24b503ade

బాలికల విద్యే దేశ సాధికారతకు పునాది. “బాలికను చదివిద్దాం–దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దాం" సందేశంతో రాఖీలు కట్టిన బాలసదనం బాలికలు. బాలికలను ఆశీర్వదించి మిఠాయిలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనం బాలికలు శుక్రవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావును కలిసి రాఖీలు కట్టారు. “బాలికను చదివిద్దాం–దేశాన్ని సాధికారత వైపు నడిపిద్దాం” అనే సందేశంతో ప్రత్యేకంగా రూపొందించిన రాఖీలను కలెక్టర్‌కు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలికలను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించడంతోపాటు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలికలతో మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాలికల

c4032fab-9646-4b8c-97a0-c1e4e0458931

సంరక్షణ, విద్య, ఆరోగ్యం, భద్రత, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి మెరుగైన సేవలు అందించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. బాలికల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందిస్తుందని భరోసా కల్పించారు. జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత మాట్లాడుతూ రక్షాబంధన్ ప్రేమానుబంధంతోపాటు పరస్పర బాధ్యత, రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఒక బాలికను చదివించడం ద్వారా ఆమె భవిష్యత్తుతోపాటు కుటుంబం, సమాజం, దేశ పురోగతికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. బాలికలకు సురక్షితమైన వాతావరణం, సమాన అవకాశాలు కల్పించి వారి ప్రతిభను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలల సహాయవాణి జిల్లా సమన్వయకర్త నరేష్, బాలసదనం సిబ్బంది అరుణ, రాణి, సఖి కేంద్రం సిబ్బంది లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    1
    ములుగు జిల్లా కేంద్రంలో సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాఖీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
    user_Swathi
    Swathi
    గ్రాఫిక్ డిజైనర్ ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    1
    ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు లో ఘనంగా రాఖీ వేడుకలు.
మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు.
ములుగు జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరితో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా పలువురు సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజంలో సోదరభావం, ప్రేమ, ఆప్యాయతలు మరింత పెంపొందాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి కలగాలని కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి సీతక్కకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజలతో కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    13 hrs ago
  • రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    1
    రాఖీ పండుగ వేళ ఆయుర్వేద విద్యార్థుల నిరసన.. స్టైఫండ్ పెంపు జీవో కోసం ఆందోళన
వరంగల్: రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పండుగను ఆనందంగా జరుపుకుంటుండగా, అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జన్లు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం నిరసన కొనసాగించారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ హక్కులు, భవిష్యత్తు కోసం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపు కోసం ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఆయుష్ వైద్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
స్టైఫండ్ పెంపు జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో విడుదల చేసే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు, హౌస్ సర్జన్లు స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు పందిళ్ల విధానంలో సాగు చేస్తున్న దొండ, సొర, పొట్లకాయ పంటలను పరిశీలించారు. తోట నిర్వహణ తీరు, పంట ఎదుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తోటను చక్కగా నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించారు. పంటలు మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి యాజమాన్యం, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు. రైతు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పొందిన లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో సాగు చేస్తున్న పంటలను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు. పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పథకాలను రైతులు వినియోగించుకుని ఆధునిక సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులు ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన రైతు పిట్టల రాజు వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రైతు పందిళ్ల విధానంలో సాగు చేస్తున్న దొండ, సొర, పొట్లకాయ పంటలను పరిశీలించారు. తోట నిర్వహణ తీరు, పంట ఎదుగుదల, నీటి వినియోగం, దిగుబడి అవకాశాలపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తోటను చక్కగా నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించారు. పంటలు మరింత ఆరోగ్యంగా ఎదగాలంటే పిచ్చి మొక్కలను తొలగించి కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి యాజమాన్యం, పందిళ్ల నిర్వహణ, పంట సంరక్షణ చర్యలను క్రమం తప్పకుండా చేపట్టాలని తెలిపారు.
రైతు సాగు చేస్తున్న పంటల విస్తీర్ణం, పెట్టుబడి వ్యయం, నీటి వనరు, ప్రభుత్వ సబ్సిడీ ద్వారా పొందిన లబ్ధి, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో సాగు చేస్తున్న పంటలను కూడా పరిశీలించి పంట ఆరోగ్యం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నివారణపై పలు సూచనలు చేశారు.
పంటల వైవిధ్యీకరణతో పాటు ఉద్యానవన పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ, ఉద్యానవన పథకాలను రైతులు వినియోగించుకుని ఆధునిక సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచించారు.
కలెక్టర్ పర్యటనలో ఉద్యానవన శాఖ అధికారి సందీప్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    55 min ago
  • బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు. అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    బొమ్మకల్ శివారులో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు స్వాధీనం...9 మంది యువకుల అరెస్ట్
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ శివారులో అక్రమంగా విక్రయించే 9 మందిని అరెస్ట్ చేసి ఆరు లక్షల 50 వేల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలం ఆదేశానుసారం, కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుని, తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు. బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో సుమారు తొమ్మిది మంది వ్యక్తులు గుమిగూడి ఉండి, సంచుల్లోని కొన్ని పరికరాలను సరిచేసుకుంటూ పరస్పరం చర్చించుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరగా 9 మంది పట్టుబడ్డారని తెలిపారు.
అరెస్టైన తొమ్మిది మంది నిందితుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం. వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి విద్యను అభ్యసించిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం పోలీసుల విచారణలో నిందితులు గత కొంతకాలంగా కలిసి హాష్ ఆయిల్, గంజాయిని సేకరించి కరీంనగర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. ఏపిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్, గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గం ద్వారా కరీంనగర్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల విక్రయం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో 7 లక్షలు సమకూర్చుకుని, నిందితుల్లో కొందరిని అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపించి హాష్ ఆయిల్, గంజాయి కొనుగోలు చేయించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అక్రమంగా వినియోగం నిందితులు కరీంనగర్‌లోని డీమార్ట్ సమీపంలోని ఒక మెడికల్ షాప్ నుంచి టపాల్-50గా పేర్కొన్న డ్రగ్ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసి, జ్యోతినగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని వాటిని నీటిలో నానబెట్టి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • సీఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష * డిఫాల్ట్ మిల్లర్‌తో పాటు ట్రక్ చిట్టీల్లో సంతకాలు చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు పవన సుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం డిఫాల్ట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలోని పవన సుత రైస్ మిల్‌కు ఖరీఫ్, రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా, దానికి సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని తెలిపారు. అయితే మిల్లర్ ఇప్పటివరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ/టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇది 4,211.813 మెట్రిక్ టన్నుల సమాన ధాన్యానికి సమానమని, దీని విలువ రూ.9,82,51,492గా ఉందని పేర్కొన్నారు. 25 శాతం పెనాల్టీ రూ.2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.12,28,14,365గా నిర్ధారించినట్లు తెలిపారు. రబీ 2021-22కు సంబంధించి పవన సుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంథనిలోని శ్రీలక్ష్మి ఎంఆర్ఎం సూరయ్య పల్లి మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పీపీసీల ద్వారా సమర్పించిన ట్రక్ చిట్టీలు, జాయింట్ సంతకాలను అధికారులు పరిశీలించగా, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లికి చెందిన భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్ సంతకాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం స్వీకరణ, అంగీకారానికి సంబంధించిన ట్రక్ చిట్టీల్లో నవీన్ కుమార్ సంతకాలు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పవన సుత రైస్ మిల్ యాజమాని రావికంటి పవన్ కుమార్, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం విషయంలో డిఫాల్ట్‌కు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు, రికవరీ తదితర చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    సీఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* డిఫాల్ట్ మిల్లర్‌తో పాటు ట్రక్ చిట్టీల్లో సంతకాలు చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు
పవన సుత రైస్ మిల్ సీఎంఆర్ బియ్యం డిఫాల్ట్‌కు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. రావికంటి పవన్ కుమార్ యాజమాన్యంలోని పవన సుత రైస్ మిల్‌కు ఖరీఫ్, రబీ 2021-22 సీజన్లలో మొత్తం 5,798.080 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించగా, దానికి సమానంగా 3,891.295 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉందని  తెలిపారు. అయితే మిల్లర్ ఇప్పటివరకు 1,069.380 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐ/టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు అందించారని పేర్కొన్నారు. దీంతో 2,821.915 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం బకాయి ఉన్నట్లు తెలిపారు. ఇది 4,211.813 మెట్రిక్ టన్నుల సమాన ధాన్యానికి సమానమని, దీని విలువ రూ.9,82,51,492గా ఉందని పేర్కొన్నారు. 25 శాతం పెనాల్టీ రూ.2,45,62,873 కలిపి మొత్తం డిఫాల్ట్ మొత్తం రూ.12,28,14,365గా నిర్ధారించినట్లు  తెలిపారు. రబీ 2021-22కు సంబంధించి పవన సుత రైస్ మిల్లుకు అప్పగించిన ధాన్యాన్ని మంథనిలోని శ్రీలక్ష్మి ఎంఆర్ఎం సూరయ్య పల్లి మిల్లుకు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి పీపీసీల ద్వారా సమర్పించిన ట్రక్ చిట్టీలు, జాయింట్ సంతకాలను అధికారులు పరిశీలించగా, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం, సూరయ్యపల్లికి చెందిన భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్ సంతకాలు ఉన్నట్లు గుర్తించినట్లు  పేర్కొన్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం స్వీకరణ, అంగీకారానికి సంబంధించిన ట్రక్ చిట్టీల్లో నవీన్ కుమార్ సంతకాలు ఉన్న నేపథ్యంలో ఆయన పాత్రపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పవన సుత రైస్ మిల్ యాజమాని రావికంటి పవన్ కుమార్, శ్రీలక్ష్మి ఎంఆర్ఎం భాగస్వామి వొల్లాల నవీన్ కుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు  వెల్లడించారు. ప్రభుత్వ ధాన్యం, సీఎంఆర్ బియ్యం విషయంలో డిఫాల్ట్‌కు పాల్పడిన మిల్లర్లపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు, రికవరీ తదితర చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    1
    అడ్డంగా వచ్చిన బైక్ ను తప్పించబోయి పల్టీ కొట్టిన వోల్వో బస్సు
కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డుగావచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ పంపు ప్రాంగణంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 35 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం.. జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    1
    జనగామలో ఇంటి దొంగ అరెస్ట్.. 45 గ్రాముల బంగారం స్వాధీనం..
జనగామ: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా రాయవరం గ్రామానికి చెందిన దబ్బేట బాలలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్ రాజు (29)ను జనగామ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో జనగామలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. వరంగల్‌లో బంగారం విక్రయించేందుకు వెళ్తుండగా అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద నుంచి రెండు జతల కమ్మలు, రెండు వరుసల చైన్, మరో చైన్ కలిపి 44.990 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో సుమారు 90 కేసులు ఉండగా, పీడీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.