Shuru
Apke Nagar Ki App…
ఉప్పల్ జోనల్ కార్యాలయంలో ఘనంగా గణేశుడికి ప్రత్యేక పూజలు RR: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక ఉప్పల్ జోనల్ కార్యాలయంలో గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ ప్రజలు, అధికారులు, సిబ్బందికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి, బలం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Ram Thotapally
ఉప్పల్ జోనల్ కార్యాలయంలో ఘనంగా గణేశుడికి ప్రత్యేక పూజలు RR: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక ఉప్పల్ జోనల్ కార్యాలయంలో గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ ప్రజలు, అధికారులు, సిబ్బందికి ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి, బలం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోనల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుల్లలచెరువులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఆకట్టుకున్న మహిళల కోలాట ప్రదర్శన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారి దేవాలయం వద్ద యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన అలరించింది.మహిళలు, చిన్నారులు సంయుక్తంగా చేసిన ఈ కోలాటాన్ని తిలకించేందుకు ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. మాస్టర్ కోటయ్య ఆధ్వర్యంలో కోలాటం చేశారు.ఈ సందర్బంగా కోలాటమాడిన మహిళలకు కమిటీ సభ్యులు చీరలను బహుమతిగా అందజేశారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.1
- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- కుల దూషణ ఘటనకు టిడిపికి ఎలాంటి సంబంధం లేదు : మండల టిడిపి నాయకులు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్నగుడిపాడులో జరిగిన కుల దూషణ ఘటనకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని దోర్నాల టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఈ ఘటనను టీడీపీకి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో పేర్కొన్నారు.1
- ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రం -21, నందు 9వ జాతీయ పోషణ మాసం 2026. 9వ జాతీయ పోషణ మాసం 2026 ఆత్మకూరు:నంద్యాల జిల్లా. ఆత్మకూరు ప్రాజెక్టు, ఎస్పీజీ పాలెం అంగన్వాడి కేంద్రం-21 నందు 9 వ జాతీయ పోషణ మాసం 2026 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ICDS సూపర్ వైజర్a V. కోమలి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా male participation( పురుషుల భాగస్వామ్యం) గర్భవతులు, బాలింతలు, చిన్న పిల్లల తండ్రులు, భర్తలు హాజరైనారు ICDS సూపర్వైజర్ V. కోమలి మాట్లాడుతూ మనకు ఇంట్లోనే ఖర్చు లేకుండా ఈజీగా దొరికే మునగాకులో కాల్షియం విటమిన్స్ B మరియు C లభిస్తుంది మరియు ఇది హైపర్ రిచ్, మలబద్ధకం నివారించి జీర్ణశక్తి మెరుగుపరుచును కీళ్ల నొప్పులు షుగర్ నియంత్రించును వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, మునగాకు పొడి, మునగాకు వడలు, మునగాకు రొట్టెలు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వివిధ రకాల వంటలు వాటి ప్రయోజనాలు, కూరగాయల నుండి ఆకుకూర నుండి లభించు పోషకాల గురించి, అంగన్వాడి కేంద్రంలో అందించు పోషక ఆహారం గురించి క్లుప్తంగా వివరించారు.పురుషులకు వంటల పోటీలు నిర్వహించారు.ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాల ఎగ్జిబిషన్ పెట్టడంజరిగినది.ఈసమావేశానికి ANM నాగమణి, అంగన్వాడి టీచర్ M. వాణి, P. మూర్తు జాబి, ఆశ వర్కర్ జయమ్మ, అంగన్వాడి ఆయా అనురాధమ్మ పాల్గొన్నారు.1
- రేవంత్ రెడ్డి కుటుంబానికి 38 భూమి ఉంది: హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ రెడ్డి కుటుంబానికి 308 ఎకరాల భూమి ఉందని గంటన్నరలో మాకు సమాచారం వచ్చింది రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్‌మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని తెలిసింది ఫ్యూచర్ సిటీ చుట్టూ, మిగతా చోట్ల ఉన్న భూముల వివరాలు అన్నీ సేకరిస్తున్నాం - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు లో తెలంగాణా విమోచన వారోత్సవాలలో భాగంగా తెలంగాణా సాయుధ పోరాట యోధుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జలాభిషేకం చేశారు.ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత తెలంగాణా ప్రాంతం నిజాం నవాబు కబంధ హస్తాలలో మగ్గిందన్నారు.తెలంగాణా ప్రాంతానికి కూడా విముక్తి కావాలని పోరాడిన అమర వీరులకు గౌరవం రావాలని బీజేపీ ఉద్యమం చేస్తుంది.ఖమ్మం జిల్లా లో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ నిజాం నవాబు కు వ్యతిరేకంగా సంపాదకీయం రాసినందుకు ఆయన్ను హతం చేశారని తెలిపారు. షోయబుల్లాఖాన్ జన్మించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు.1
- రాజంపల్లి లో వెలిసిన ఆంజనేయస్వామికి భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకు పూజ చేశారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.1