logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి సిరికొండ : పిల్లల చేతికి చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని టీజీపీఏ జిల్లా తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నక్క రాజేందర్ అన్నారు. హింసాత్మక, నేరపూరిత వీడియోలకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మందలించినప్పుడు వారిని తప్పుపట్టకుండా, పిల్లల మంచి కోసమే చెబుతున్నారని తల్లిదండ్రులు వివరించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తేనే పిల్లలను సరైన మార్గంలో నడిపించగలమని తెలిపారు.

1 day ago
user_RC REDDY
RC REDDY
Local News Reporter Nizamabad Rural, Telangana•
1 day ago
30e766cd-d0d6-434f-be72-3b7849d47784

పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్‌పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి సిరికొండ : పిల్లల చేతికి చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్లు ఇవ్వడం వారి మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని టీజీపీఏ జిల్లా తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు నక్క రాజేందర్ అన్నారు. హింసాత్మక, నేరపూరిత వీడియోలకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు మందలించినప్పుడు వారిని తప్పుపట్టకుండా, పిల్లల మంచి కోసమే చెబుతున్నారని తల్లిదండ్రులు వివరించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తేనే పిల్లలను సరైన మార్గంలో నడిపించగలమని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు. అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    వీధి కుక్కల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు మరోసారి ఫిర్యాదు – తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్
బోధన్: బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు జునైద్ అహ్మద్ ఖలీల్ ఆధ్వర్యంలో రాకాసిపేట్‌లోని వివిధ వార్డులకు చెందిన బాధ్యత వహిస్తున్న కుటుంబ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి మరోసారి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు మున్సిపల్ అధికారులను కోరారు.
ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియాతో మాట్లాడుతూ.. బోధన్‌లోని 38 మంది కౌన్సిలర్లను ప్రజలు ఓటు వేసి గెలిపించారని, అయితే వార్డుల్లోని ప్రజలు వీధి కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు వీధి కుక్కల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారని, ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వీధి కుక్కలపై చర్యలు తీసుకోకపోతే బోధన్‌లోని వీధి కుక్కలను పట్టుకుని బోధన్ మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చి వదిలిపెట్టాల్సి వస్తుందని జునైద్ అహ్మద్ ఖలీల్ హెచ్చరించారు.
అలాగే బోధన్ ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా స్పందించాలని జునైద్ అహ్మద్ ఖలీల్ మీడియా ద్వారా కోరారు. ప్రజలు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్యపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.
    1
    నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.
    user_Shaikg journalist
    Shaikg journalist
    Graphic designer నందిపేట్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
    1
    చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం...
బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    10 hrs ago
  • బాన్సువాడలో రాఖీ పండుగ సందడి రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు. రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    1
    బాన్సువాడలో రాఖీ పండుగ సందడి
రాఖీల కొనుగోలుతో కిటకిటలాడిన మార్కెట్‌
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రాఖీ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మార్కెట్‌లో సందడి నెలకొంది. అక్కాచెల్లెళ్ల ఆప్యాయతకు, అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలు, చిన్నారులు రాఖీలు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు తరలివచ్చారు.
రాఖీ దుకాణాలు వివిధ రంగులు, ఆకర్షణీయమైన నమూనాలతో కళకళలాడగా, ఉదయం నుంచే మార్కెట్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడింది. తమ అన్నదమ్ముల కోసం ప్రత్యేకమైన రాఖీలను ఎంచుకుంటూ అక్కాచెల్లెళ్లు ఉత్సాహంగా కనిపించారు. పండుగ నేపథ్యంలో వ్యాపారులు సైతం ప్రత్యేకంగా రాఖీలను అందుబాటులో ఉంచడంతో మార్కెట్‌లో సందడి మరింత పెరిగింది.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    35 min ago
  • నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు
    1
    నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ...
నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్  
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్  ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి.  ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు  రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    1
    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో  రాఖీ పౌర్ణమి వేడుకలు....
కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    5 hrs ago
  • అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    1
    అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు...........
బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.
    user_Mahesh Nakka
    Mahesh Nakka
    Kamareddy, Hyderabad•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.