ములుగు జిల్లాను అభివృద్ధి వెలుగులతో విరాజిల్లేలా కృషి చేయాలి. MLG:ఆరు నెలల్లో రహదారుల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ***** వెనుకబడిన ములుగు జిల్లాను అభివృద్ధి వెలుగులతో విరాజిల్లేలా అధికారులు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం ములుగులోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల, రహదారులు–భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటిసరఫరా, జాతీయ రహదారులు, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, మిషన్ భగీరథ, తెలంగాణ వైద్య సేవలు–మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, విద్యా–సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖల పరిధిలో కొనసాగుతున్న పనులను శాఖలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టాల్సిన నూతన అభివృద్ధి పనులను గుర్తించి, సంబంధిత ప్రాజెక్టులకు సమగ్ర అంచనాలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన వివరాలను శాఖలవారీగా నమోదు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలులో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్ష సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రామప్ప–లక్నవరం గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిరంతరం రామప్ప సరస్సుకు తరలించే సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలించాలని సూచించారు. రామప్ప సరస్సు నుంచి ములుగు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలను రూపొందించాలన్నారు. రామప్ప ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతోపాటు నూతన పర్యాటక అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మేడారం జాతర ప్రాంతంలో జంపన్నవాగు సుందరీకరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. మేడారంలో నూతనంగా నిర్మించనున్న అతిథిగృహాన్ని రెడ్డిగూడెం ప్రాంతంలోని గుట్టపై నిర్మించే అవకాశాలను పరిశీలించాలన్నారు. మేడారం రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర ఘాట్ వరకు రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో కొనసాగుతున్న రహదారుల అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేడియం నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మల్లూరు ప్రాంతంలో నూతన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల, నర్సింగ్ కళాశాలతోపాటు జిల్లాలో కొనసాగుతున్న ఇతర భవన నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు విధి నిర్వహణను బాధ్యతగా భావిస్తూ ఉత్తమ పనితీరుతో ప్రజల ప్రశంసలు పొందాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి సీతక్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలోని పాఠశాల భవనాల నిర్మాణ పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. గోదావరి జలాలు ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు తరలిపోతున్నప్పటికీ, స్థానికంగా సాగునీటి సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం సుమారు రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రామప్ప–లక్నవరం అనుసంధాన పనులు, పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, రామచంద్రాపురం–మల్లంపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న, చేపట్టబోయే పనుల పురోగతితోపాటు వాటికి అవసరమైన భూసేకరణ ప్రక్రియపై సమీక్షించినట్లు తెలిపారు. రామప్ప సరస్సును నింపడం వల్ల పరిసర ప్రాంతాల్లోని భూములు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో అవసరమైన భూసేకరణ చేపట్టి, బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో అవసరమైన ఘాట్ల నిర్మాణంతోపాటు పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించినట్లు వెల్లడించారు. కొన్ని కార్యాలయాల్లో అధికారులు సక్రమంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- ఆరు నెలల్లో రహదారుల పనులు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క MLG: ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. గురువారం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రహదారుల పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- ములుగు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల మహాధర్నా: 6 పెండింగ్ DAలు, OPS అమలుకు డిమాండ్ ములుగు:దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో గురువారం ములుగు నూతన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున ‘మహాధర్నా’ నిర్వహించారు. ఈ ధర్నాలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా రెండు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు: 6 పెండింగ్ DAల విడుదల: ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన 6 బకాయి డియర్నెస్ అలవెన్సులను (DA) ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలి. OPS పునరుద్ధరణ: ఉద్యోగుల భవిష్యత్తుకు నష్టం కలిగిస్తున్న సీపీఎస్ (CPS) విధానాన్ని స్వస్తి పలికి, పాత పింఛన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నిరసన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.2
- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- మాకు ఆకలి అవుతుంది మమల్ని వదిలేయండి ప్లీజ్... పాలిటెక్నీక్ విద్యార్థుల ఆవేదన వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను పోలీసులు గేటు లోపలే నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచ్ కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. “మాకు ఆకలైతుంది.. వదిలేయండి ప్లీజ్” అంటూ విద్యార్థులు వేడుకున్నట్లు తెలుస్తోంది.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి.. మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించిన* --- *ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు* పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావు గారిని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ, 97వ జీవో, PPP విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే, ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి, విద్యార్థులు మరియు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం PPP పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, ఆస్తులు ప్రజల ఆస్తులని, కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం, ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. హరీష్ రావు గారి ని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డి గారిని దాస్యం వినయ్ భాస్కర్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.1