Shuru
Apke Nagar Ki App…
పాలెం గ్రామంలో జనవాసాల్లోకి నాగుపాములు.. సురక్షితంగా పట్టివేత బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు
MALLIKARJUN T
పాలెం గ్రామంలో జనవాసాల్లోకి నాగుపాములు.. సురక్షితంగా పట్టివేత బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు
More news from తెలంగాణ and nearby areas
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం పరిగి మండల పరిధిలోని కాలాపూర్ రాపోలు గ్రామ రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట ప్రభుత్వం లాక్కుంటుందని ధర్నాకు దిగడంతో దీనికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొనగా భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు చేసేదిలేక కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి దారుర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతులకు మద్దతు తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే భూసేకరణ ఆపాలని హెచ్చరించారు1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1