Shuru
Apke Nagar Ki App…
అంగన్వాడీ టీచర్లకు నవాబ్ పేట్ మండల కేంద్రంలో స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
Thanmai Sri
అంగన్వాడీ టీచర్లకు నవాబ్ పేట్ మండల కేంద్రంలో స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- మీ సమస్యలపై కమిటీ వేసాము సమ్మె ఆలోచన విరమించుకోండి ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం మీ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉంది, 4 వారాల కాల పరిమితితో ఒక కమిటీ వేసాము మీ సమస్యలు ఆ కమిటీకి చెప్తే ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని కార్మికులను కోరుతున్నాను – మంత్రి పొన్నం ప్రభాకర్1
- వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.1
- Post by Vishwamber Rao1
- పెద్దపెల్లి జిల్లా వీధి కుక్కల స్వైరవిహారం మరో పసి ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తోటి పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు వెంటాడటంతో, భయంతో పొలం వైపు పరుగులు తీసిన చిన్నారిని కుక్కలు చుట్టుముట్టి చంపేశాయి. కాట్నపల్లిలోని BBI ఇటుక బట్టీ వద్ద ఒరిస్సాకు చెందిన వలస కార్మికులు సరస్వతి, భూబన్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె దివ్య బెహరా ఉంది. ఈరోజు ఉదయం దివ్య మరో చిన్నారితో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల మంద దాడి చేశాయి. భయపడిన మరో చిన్నారి ఇంటి వైపు పరిగెత్తి ప్రాణాలు దక్కించుకోగా, చిన్నారి దివ్య భయంతో పంట పొలాల వైపు పరుగులు తీసింది. దీంతో కుక్కలన్నీ బాలికను వెంబడించి చుట్టుముట్టాయి. ఒళ్లంతా పీక్కీతినడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డ, కళ్లముందే కుక్కల బారిన పడి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు1
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్‌లో ఎస్‌బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్! ఎస్‌పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్‌ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...1
- సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో అధ్య శిల మహోత్సవ కార్యక్రమం సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శిలలపై బీజాక్షరాలు చెక్కే కార్యక్రమాన్ని చేపట్టారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత ప్రత్యేక పూజలు చేశారు.1
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రాదు ఎక్కడ ఖాళీ భూములు కనిపిస్తే అక్కడ కబ్జాలు పెట్టి గుంజుకుంటున్నారు ఫ్రీ బస్సు అని పెడితే మహిళలు కొట్టుకొని సస్తున్నారు.. ఫ్రీ బస్సు లేకముందే బాగుండేది - జగిత్యాల మహిళలు1
- కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు ప్రభుత్వానికి మానవత్వం లేదు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.1