సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండి కొప్పుల రవి మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో *తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి* ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయుల అపరిష్క్రత న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజున చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు కైరి పద్మ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన్నీరు పద్మజ ఆధ్వర్యంలో నల్ల రిబ్బను దరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని తక్షణమే డీఏ బకాయిలు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండి కొప్పుల రవి మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ కార్డులు , పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వడ్యారపు మధుసుధన్, పీ.అనిల్ , వేముల అంజలి, ముంజ రమ, వెంగల పల్లవి తదితరులు పాల్గొన్నారు.

- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2
- కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని DSP విఠల్ రెడ్డి అన్నారు. పిట్లంలో నిర్వహించిన “అలైవ్ అరైవ్" కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.1
- మెట్‌పల్లి, ఏప్రిల్ 17: మహిళా రాజకీయ ప్రాతినిధ్యం కోసం స్వర్గీయ కొమిరెడ్డి జ్యోతక్క చేసిన సుదీర్ఘ పోరాటాన్ని స్మరించుకుంటూ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె నివాసంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులు, నాయకులు పాల్గొన్నారు. 1998లోనే మహిళల రిజర్వేషన్ కోసం జ్యోతక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 27 ఏళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ముందడుగు పడడం ఆమె దూరదృష్టికి నిదర్శనమన్నారు.అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.2
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు1
- Post by Boke saikumar Boke saikumar1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- హుజురాబాద్ సమీపంలో సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్ రద్దుకై జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన ఆందోళనకు సంఘీభావంగా ఈనెల 22 నుంచి పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మౌనం వీడి ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కోరారు. ప్రజల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.2
- కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆగిన సందర్భాల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి అనే విషయాలను సిబ్బందికి వివరించారు.1
- మెట్ పల్లి, ఏప్రిల్ 17 (నినాదం) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెండింగ్ డి.ఏలు, పీఆర్‌సీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.3