logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తన బికినీ ఫొటోలను కొందరు విమర్శించడంపై హీరోయిన్ మాళవికా మోహనన్ తీవ్రంగా మండిపడ్డారు. బికినీ ధరించడంలో అసలు తప్పేముందని ఆమె ప్రశ్నించారు. విదేశాల్లో స్విమ్ సూట్ ధరించడం అనేది చాలా సాధారణ విషయమని స్పష్టం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా గౌరవించాలో, హద్దులు దాటకుండా ఎలా ఉండాలో తమకు బాగా తెలుసని, ఎవరినీ అంత తేలికగా విమర్శించవద్దని మాళవికా మోహనన్ పేర్కొన్నారు. తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె, షూటింగ్ గ్యాప్‌లో మాల్దీవ్స్ వెళ్లిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

4 hrs ago
user_Reporter Gaddam Kiran
Reporter Gaddam Kiran
ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
4 hrs ago
a73b2095-b538-45c0-9389-79ea313b9a41
34434cf1-ec16-42a7-9898-5b326860a5bc

తన బికినీ ఫొటోలను కొందరు విమర్శించడంపై హీరోయిన్ మాళవికా మోహనన్ తీవ్రంగా మండిపడ్డారు. బికినీ ధరించడంలో అసలు తప్పేముందని ఆమె ప్రశ్నించారు. విదేశాల్లో స్విమ్ సూట్ ధరించడం అనేది చాలా సాధారణ విషయమని స్పష్టం చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా గౌరవించాలో, హద్దులు దాటకుండా ఎలా ఉండాలో తమకు బాగా తెలుసని, ఎవరినీ అంత తేలికగా విమర్శించవద్దని మాళవికా మోహనన్ పేర్కొన్నారు. తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె, షూటింగ్ గ్యాప్‌లో మాల్దీవ్స్ వెళ్లిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ కోసం కేటాయించిన సమయం ముగిసినప్పటికీ, ఆశించిన మేర జనం రాకపోవడంతో పలుచోట్ల బస్సులు ఖాళీగానే వెనుదిరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ సభకు సంబంధించి మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలను, స్వయం సహాయక సంఘాల సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బలవంతంగా సభకు తరలిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు మరియు సభలో కనిపించిన వెలవెలబాటుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
    1
    ఖమ్మంలో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ కోసం కేటాయించిన సమయం ముగిసినప్పటికీ, ఆశించిన మేర జనం రాకపోవడంతో పలుచోట్ల బస్సులు ఖాళీగానే వెనుదిరిగినట్లు సమాచారం అందుతోంది.

ఈ సభకు సంబంధించి మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలను, స్వయం సహాయక సంఘాల సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులు బలవంతంగా సభకు తరలిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కిస్తోంది. ఈ పరిణామాలు మరియు సభలో కనిపించిన వెలవెలబాటుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ నూతన ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, మరియు పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    2
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయ నూతన ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదగిరిగుట్టను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, మరియు పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
    user_Mahesh Chary
    Mahesh Chary
    Photographer Husnabad, Siddipet•
    1 hr ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంజన్న ఆశీస్సులు పొందారు. తాము గత 116 వారాలుగా నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని, అది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే కొండగట్టు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు భక్తులు వెల్లడించారు. అంజన్న అనుగ్రహంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొండగట్టు క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా వేధిస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు తదితర వస్తువులను ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
    3
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంజన్న ఆశీస్సులు పొందారు. తాము గత 116 వారాలుగా నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని, అది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే కొండగట్టు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు భక్తులు వెల్లడించారు. అంజన్న అనుగ్రహంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు.

అయితే, కొండగట్టు క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా వేధిస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు తదితర వస్తువులను ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    28 min ago
  • తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు. ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    2
    తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఎండీ యాకూబ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇండ్ల పంపిణీ కోసం తాము పదేపదే నిరసనలు, ఉద్యమాలు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు వచ్చిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు, గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమాలు మరియు తమ జైలు జీవితాల గురించి వివరిస్తూ ఇండ్ల పంపిణీ కోసం చర్యలు చేపట్టాలని కోరారు.

ఇండ్ల పంపిణీ చేపట్టకుండా సీపీఎం నాయకులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేయడంపై ఎండీ యాకూబ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులు వసూలు చేశారో నిరూపించేందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. తాము గనుక నోరు విప్పితే కొందరు మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, పార్టీ నాయకులను ప్రజలు తొర్రూరు నుండి తరిమి కొడతారని హెచ్చరించారు. అబండాలు వేయడం మానుకొని తక్షణమే ఇండ్లను పంపిణీ చేయాలని, లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీనివాస్, మండల కమిటీ సభ్యులు మర్క సాంబయ్య, డోనుక దర్గయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Yakaiah-Pushpa
    Yakaiah-Pushpa
    కొమ్మన పో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్. తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    2 hrs ago
  • తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్త పాలకమండలి ఇవాళ కొలువు తీరింది. పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. కాగా, ఈ పాలకమండలి నియామకానికి సంబంధించి ఏపీకి చెందిన చిరంజీవి సతీమణిని ఎలా నిర్ణయిస్తారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుమనే యాదగిరిగుట్టలో కొత్త పాలక మండలి ప్రమాణస్వీకార ఉత్సవం జరగగా, చిరంజీవి సతీమణి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
    1
    తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొత్త పాలకమండలి ఇవాళ కొలువు తీరింది. పాలకమండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.

కాగా, ఈ పాలకమండలి నియామకానికి సంబంధించి ఏపీకి చెందిన చిరంజీవి సతీమణిని ఎలా నిర్ణయిస్తారని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుమనే యాదగిరిగుట్టలో కొత్త పాలక మండలి ప్రమాణస్వీకార ఉత్సవం జరగగా, చిరంజీవి సతీమణి కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • పోక్సో కేసులో నమోదైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో పోక్సో కేసు బాధితురాలు, ఆమె తల్లి తనకు ఫోన్ చేసి తీవ్ర భయాందోళనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని బాధిత కుటుంబం తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎదుర్కొంటున్న భయాందోళనలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా దారుణ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయ మరియు పోలీసు వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
    1
    పోక్సో కేసులో నమోదైన నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో పోక్సో కేసు బాధితురాలు, ఆమె తల్లి తనకు ఫోన్ చేసి తీవ్ర భయాందోళనతో మాట్లాడారని ఆయన వెల్లడించారు. తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందని బాధిత కుటుంబం తనతో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

పోక్సో కేసుల్లో నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత బాధితులు ఎదుర్కొంటున్న భయాందోళనలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహా దారుణ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు న్యాయ మరియు పోలీసు వ్యవస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.