Shuru
Apke Nagar Ki App…
చైనా మాంజా అమ్మ వద్దు దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో ఉన్న పతంగుల దుకాణాలను స్థానిక ఎస్సై తహిసుద్దీన్ తనిఖీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పలు దుకాణాలను పరిశీలించి యజమానులకు సూచనలు చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు హాని చేసే చైనా మాంజాను ఎవరూ అమ్మ వద్దని ఆయన హెచ్చరించారు. చైనా మాంజను అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Gourinatha p.g
చైనా మాంజా అమ్మ వద్దు దండేపల్లి మండలంలోని మ్యాదరిపేటలో ఉన్న పతంగుల దుకాణాలను స్థానిక ఎస్సై తహిసుద్దీన్ తనిఖీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన పలు దుకాణాలను పరిశీలించి యజమానులకు సూచనలు చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు హాని చేసే చైనా మాంజాను ఎవరూ అమ్మ వద్దని ఆయన హెచ్చరించారు. చైనా మాంజను అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నేత్రపర్వంగా స్వామివారి కల్యాణం జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. సోమవారం ఆలయ చైర్మన్ రాచ కిషన్ దంపతులు దేవాలయం ఆవరణలో గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జన్నారంతో పాటు వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు భారీగా తరలి వచ్చి స్వామివారినీ కళ్యాణాన్ని తిలకిస్తున్నారు.1
- Post by Ravi Poreddy1
- సీఐ చేతుల మీదుగా1
- పెద్దపల్లి జిల్లా మంథనిలో పలు అభివృద్ధి పనులకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు, ఐఏఎస్ అధికారుల పై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఇలాంటి అసత్య ఆరోపణలు సరికాదు అని అన్నారు1
- సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 11 ఐ 3 న్యూస్ /* సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను వెంటనే విరమించుకోవాలి: దేవి రవీందర్ సిద్దిపేట జిల్లా పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమతో, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ దేవి రవీందర్ ఆరోపించారు. జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాకు అన్యాయం చేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన మాట్లాడుతూ, జిల్లాల కుదింపు పేరుతో సిద్దిపేట జిల్లాను దెబ్బతీయాలని చూడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఆధారంగా 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పరిపాలనా సౌలభ్యం కోసం అప్పట్లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు పరిపాలనను మరింత సులభతరం చేశారని తెలిపారు. ఇలాంటి చారిత్రక నిర్ణయాన్ని విస్మరించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నిండు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల కుదింపు ఆలోచనలో ఉందని చెప్పడం ఆందోళన కలిగించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకుని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఆలోచించాలని సూచించారు. లేనియెడల, గతంలో తెలంగాణ సాధన కోసం సిద్దిపేట జిల్లా ఎలా ఉద్యమాలకు నాంది పలికిందో, అదే విధంగా ఈరోజు కూడా జిల్లాల గుర్తింపును కాపాడుకునే వరకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ కౌన్సిలర్లు శివకుమార్, చందు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- ఆకాశమే విరివినట్లుగా అద్భుత దృశ్యం జన్నారం మండల కేంద్రంలో ఆకాశం విరిగినట్లుగా మబ్బులతో అద్భుత అదృశ్యం ఆవిష్కృతమైంది. జన్నారంలో నిర్వహించిన శ్రీ కేతేశ్వర కాంకాలమ్మ జాతర సందర్భంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. అదే సమయంలో ఆకాశంలో మబ్బులు విరిగినట్లుగా కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. జాతర వేల మబ్బులు కమ్ముకోవడంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. ఆకాశంలో మబ్బులు ఏర్పడటం సాధారణమే అయిన విరిగినట్లుగా ఉండటం మొదటిసారి చూస్తున్నామన్నారు.1