logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.* *గంజాయి సాగు చేస్తున్న ఒకరిపై కేసు, అరెస్టు,* *పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, మే 10 :- *5 గంజాయి మొక్కలు, 700 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం.* *ఇంటి పెరట్లో గంజాయి సాగు చేస్తున్న మల్లంగి ఎస్సి గూడ గ్రామానికి చెందిన నిందితుడు.* *ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు.* *నార్నూర్ ఎస్సై శ్రీ సాయి.* ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా నిర్మించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నట్లు అందులో భాగంగానే ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు నార్నూర్ మండలం మల్లంగి ఎస్సీ గూడ గ్రామానికి చెందిన నిందితుడు *చలక్కర్ జయరాం (69) s/o లింబరావు.* తన ఇంటి పెరట్లో గంజాయి సాగు చేస్తున్నడని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా అతని ఇంట్లో మూడు ఫీట్ల కన్నా తక్కువగా ఉన్న 5 మొక్కలు, 700 గ్రాముల ఎండిన గంజాయి లభ్యమైనట్టు నార్నూర్ ఎస్సై ఎస్ శ్రీ సాయి తెలిపారు. గంజాయి సాగు చేసిన వారిపై ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు యువత గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గంజాయి వ్యసనం బారిన పడిన వారికి భవిష్యత్తు లేకుండా పోతుందని తెలిపారు. జిల్లాలో డి అడిక్షన్ సెంటర్స్ ద్వారా గంజాయి బారిన పడిన వారికి చికిత్స అందజేయడం జరుగుతుందని తల్లిదండ్రులు బంధువులు గంజాయి బారిన పడిన వారి వివరాలు పోలీసులకు తెలియజేసి వారిని డి అడిక్షన్ సెంటర్లకు వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి సారథంలో ఈ సంవత్సరం 50 గంజాయి కేసులు నమోదు కాగా, 15 కిలోల ఎండు గంజాయి, అదేవిధంగా ఇప్పటివరకు 638 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 103 వ్యక్తులపై గంజాయి కేసులు నమోదు చేయడం జరిగింది అని, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 67 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి పండించిన రవాణా చేసిన వ్యాపారం చేసిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు లేని సమాజ సృష్టికి కృషి చేయాలని తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎస్ఐ తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
1 hr ago
9ff8937f-1893-43a8-9be0-f1c5c1bb8916

*గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.* *గంజాయి సాగు చేస్తున్న ఒకరిపై కేసు, అరెస్టు,* *పత్రికా ప్రకటన* అదిలాబాద్ జిల్లా, మే 10 :- *5 గంజాయి మొక్కలు, 700 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం.* *ఇంటి పెరట్లో గంజాయి సాగు చేస్తున్న మల్లంగి ఎస్సి గూడ గ్రామానికి చెందిన నిందితుడు.* *ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు.* *నార్నూర్ ఎస్సై శ్రీ సాయి.* ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి రహిత జిల్లాగా నిర్మించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నట్లు అందులో భాగంగానే ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు నార్నూర్ మండలం మల్లంగి ఎస్సీ గూడ గ్రామానికి చెందిన నిందితుడు *చలక్కర్ జయరాం (69) s/o లింబరావు.* తన ఇంటి పెరట్లో గంజాయి సాగు చేస్తున్నడని విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా అతని ఇంట్లో మూడు ఫీట్ల కన్నా తక్కువగా ఉన్న 5 మొక్కలు, 700 గ్రాముల ఎండిన గంజాయి లభ్యమైనట్టు నార్నూర్ ఎస్సై ఎస్ శ్రీ సాయి తెలిపారు. గంజాయి సాగు చేసిన వారిపై ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు యువత గంజాయి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని గంజాయి వ్యసనం బారిన పడిన వారికి భవిష్యత్తు లేకుండా పోతుందని తెలిపారు. జిల్లాలో డి అడిక్షన్ సెంటర్స్ ద్వారా గంజాయి బారిన పడిన వారికి చికిత్స అందజేయడం జరుగుతుందని తల్లిదండ్రులు బంధువులు గంజాయి బారిన పడిన వారి వివరాలు పోలీసులకు తెలియజేసి వారిని డి అడిక్షన్ సెంటర్లకు వచ్చేలా ప్రోత్సహించాలని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి సారథంలో ఈ సంవత్సరం 50 గంజాయి కేసులు నమోదు కాగా, 15 కిలోల ఎండు గంజాయి, అదేవిధంగా ఇప్పటివరకు 638 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, 103 వ్యక్తులపై గంజాయి కేసులు నమోదు చేయడం జరిగింది అని, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 67 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయి పండించిన రవాణా చేసిన వ్యాపారం చేసిన సేవించిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాలు లేని సమాజ సృష్టికి కృషి చేయాలని తెలిపారు. గంజాయి పండించిన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ ఎస్ఐ తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
    1
    ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (సీసీఐ)ని తక్షణమే తెరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ముందే నిరసన జరిగింది. మోడీ పర్యాటకునిగా కాకుండా నిధులు, ప్రాజెక్టులతో రావాలని, లేదంటే పరిశ్రమ కోసం తీసుకున్న భూములు రైతులకు తిరిగి ఇవ్వాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    7 hrs ago
  • జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు! ​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది! ​నెల గడిచినా కదలని కొనుగోళ్లు ​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు ​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు. ​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు. ​మిత్తి భారంతో కుదేలు ​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి. ​ ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    2
    జన్నారం మండలంలో కల్లాల్లోనే కన్నీరు: కవ్వాల్ రైతుకు తప్పని తిప్పలు!
​ అది జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోని ఒక ధాన్యం కల్లం. అక్కడ పసుపు వర్ణంలో మెరుస్తున్న ధాన్యం కుప్పలు రైతు కష్టానికి నిదర్శనం. కానీ, దురదృష్టవశాత్తూ ఆ కష్టం ఇప్పుడు రైతు నోటి దాకా రావడం లేదు.. పశువుల నోటి పాలవుతోంది!
​నెల గడిచినా కదలని కొనుగోళ్లు
​పంట కోసి నెల రోజులు గడుస్తున్నా, కొనుగోలు కేంద్రాల గడప దాటి ఒక్క గింజ కూడా బయటకు వెళ్లడం లేదు. "అధికారులు వస్తారు.. కొంటారు.." అనే ఆశతో రైతులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ, ఇటు అధికారుల పట్టింపులేమి, అటు పెరుగుతున్న వడ్డీల భారం రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
​రైతు కష్టాన్ని 'మేస్తున్న' పశువులు
​ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. రైతులు ఆరబోసిన వడ్లను, మొక్కజొన్నను పశువులు యధేచ్ఛగా తినేస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
​రక్షణ లేని పంట: బర్లు, ఎడ్ల మందలు కల్లాలపై పడి ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయి. వాటిని అదిలించే ఓపిక లేక, తోలే దిక్కు లేక రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు.
​ప్రకృతి కన్నుగీటితే అంతే: ఒకవైపు పశువుల బెడద, మరోవైపు అకాల వర్షాల భయం. ఒక్క వాన పడితే నెలల కష్టం బురదపాలవుతుందని రైతులు వణికిపోతున్నారు.
​మిత్తి భారంతో కుదేలు
​"అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వడ్లు అమ్మకపోతే అసలు సంగతి పక్కన పెడితే, మిత్తి (వడ్డీ) కట్టడానికే మా ఆస్తులు అమ్ముకోవాలి" అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా కాసుల గలగలలు లేక కవ్వాల్ గ్రామంలో రైతు ఇళ్లు వెలవెలబోతున్నాయి.
​
ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే కవ్వాల్ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 min ago
  • కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు..... జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    1
    కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరిన హనుమాన్ దీక్షపరులు.....
జన్నారం మండలంలోని బాదంపల్లి నుండి 25 మంది హనుమాన్ దీక్షపరులు కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. పెద్ద హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన యువకులు హనుమాన్ దీక్షను స్వీకరించారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వారు బాదంపల్లి నుండి కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. కొండగట్టులో స్వామివారిని దర్శించుకుని దీక్ష విరమిస్తారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం... బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు.... ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు. రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ... నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు... జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి? వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు. మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి. గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి. తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి. దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
    1
    మోర్తాడ్‌లో రైతులతో,బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం...
బాల్కొండ ఎమ్మెల్యేవేముల పిలుపు....

ప్రభుత్వ వైఫల్యంతో ప్రవేట్ వ్యాపారులకు ఎక్కువగా వడ్లు అమ్ముకుంటున్న రైతన్నలు – క్వింటాల్‌కు రూ. 500 నష్ట పోతున్నారు.
రైస్ మిల్లర్ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ప్రభుత్వం.. 45 కిలోల తరుగు పేరుతో క్వింటాల్‌కు 12.5 కిలోల దోపిడీ...
నెల రోజులుగా కళ్ళాల దగ్గరే రైతులు.. కాంగ్రెస్ హయాంలో అన్నదాతలకు తప్పని తిప్పలు...
జిల్లా కలెక్టర్ ఫోన్ ఎత్తడం లేదు.. శాసనసభ్యుడికే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల మాటేంటి?
వడ్ల కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతను ఎండగట్టిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు అత్యంత నత్తనడకన సాగుతున్నాయని, రైతులు పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా  ఇబ్బందులు పడుతున్నారని 
దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో రైతుల కోరిక మేరకు పర్యటించి పలు కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి, రైతులతో కలిసి నేడు సోమవారం రోజున నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైనమోర్తాడ్ లో రైతు లతో కలిసి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు, బి.ఆర్.ఎస్ .నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రసంగిస్తూ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేస్తామని ప్రకటించి, సెంటర్లు తెరిచేసరికి 15 రోజులు, గన్నీ బ్యాగులు వచ్చేసరికి వారం, కాంటా పెట్టేసరికి మరో వారం అన్నట్లుగా 20 రోజుల పాటు కావాలనే జాప్యం చేసిందని విమర్శించారు.
మద్దతు ధర రూ. 2390 ఉండగా, ప్రభుత్వ జాప్యం భరించలేక రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యక్తులకు రూ. 1750 నుండి 1900 లకే అమ్ముకుంటున్నారని, దీనివల్ల ఎకరాకు సుమారు రూ. 15,000 నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, తరుగు పేరుతో 40 కిలోలకు 5 కిలోల అదనపు వడ్లు (క్వింటాల్‌కు 12.5 కిలోలు) దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇది కేవలం 1.5 కిలోలు మాత్రమే ఉండేదని గుర్తు చేశారు.
రైతుల సమస్యలపై మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేస్తే, ఫోన్ ఎత్తడం లేదని, కనీసం స్పందించే తీరిక కూడా లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలిసీ లో భాగమేన అని ఆయన దుయ్యబట్టారు.
వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి, వడ్ల రవాణాకు లారీలను పెంచాలి.
గన్నీ బ్యాగుల కొరత తీర్చాలి.
తరుగును తగ్గించి, పాత పద్ధతిలోనే వడ్లు సేకరించాలి.
దొడ్డు రకానికి గ్రేడ్-1 రేటుతో పాటు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలిఅని ప్రభుత్వానికి పలు డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు మోర్తాడ్‌లో ప్రభుత్వ వైఖరికి నిరసనగ  కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని రైతులందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నిరసనను విజయవంతం చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    33 min ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ముస్లిం సోదరులు ప్రయాణికుల దాహం తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా వారు మానవత్వాన్ని చాటుకున్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర గోదావరి తీరంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్తు వృధా అవుతోంది. విద్యుత్తు పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర గోదావరి తీరంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్తు వృధా అవుతోంది. విద్యుత్తు పొదుపు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_Rameshwar Pimple
    Rameshwar Pimple
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    1
    చీర్లవంచ గ్రామ బీజేపీ నాయకులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు తరలివెళ్లారు. జాతీయ నాయకుడి ప్రసంగాన్ని వినేందుకు వారు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పలు శుభకార్యాలకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అడె గజేందర్, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరయ్యారు. వీరు పలు వివాహాలు, నిశ్చితార్థ కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పలు శుభకార్యాలకు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ అడె గజేందర్, మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరయ్యారు. వీరు పలు వివాహాలు, నిశ్చితార్థ కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.