Shuru
Apke Nagar Ki App…
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పవిత్ర శేషవస్త్రాలు అందజేశారు. స్వామివారి అనుగ్రహాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
Ramprasad islavath
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పవిత్ర శేషవస్త్రాలు అందజేశారు. స్వామివారి అనుగ్రహాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వతగిరి మండలం రావూరుకు చెందిన దామెర శ్రీనివాస్(34) అక్కడికక్కడే మృతి చెందాడు. కొత్తూరులోని మీసేవా కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉండగా, ఆయన అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.1
- ఈయన మా మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఇక్కడ ఉన్న ప్రజలు బాగోగులు చూసుకుంటారు1
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- వరంగల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా సత్తుపల్లి గ్రామానికి చెందిన మల్లిబల్లి రాముడు (55) రైలులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో ఎడమ కాలి పాదం క్రష్ కాగా, కుడి భుజం విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నాగరాజు, పైలెట్ సాంబయ్య ప్రాథమిక చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1
- ఈయన మా ఊరి మంత్రి చాలామందికి ఈయన ఒక ఆదర్శం గ్రేట్ సార్ మీరు1
- Post by నీరటి మహేందర్1