నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం ఎంఈఓ కార్యాలయం వద్ద జూన్ 25న తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ టీవీపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ మాట్లాడుతూ, ప్రైవేటు స్కూళ్లు వారం రోజులుగా పుస్తకాలు అమ్ముతున్నాయనే సమాచారంతో ప్రశ్నించగా, విద్యాశాఖ అధికారులే అమ్మమన్నారని యాజమాన్యాలు బదులిచ్చాయన్నారు. అయితే, ఎంఈఓకి ఫోన్ చేస్తే ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు అమ్మకూడదనే విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని చెప్పారని నాగేష్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్పందించిన టీవీపీ, బయట మార్కెట్లో ₹2,000 నుండి ₹2,500 వరకు దొరికే పుస్తకాలను ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ₹6,000 నుండి ₹10,000 వరకు అమ్ముతున్నాయని ఆరోపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పాఠశాలలు సూచించిన పుస్తకాలు బయట మార్కెట్లో కనీసం మూడు వేర్వేరు బుక్ స్టాల్స్‌లో అందుబాటులో ఉండేలా తల్లిదండ్రులకు తెలియజేయాలి, కానీ దీనికి విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీవీపీ డిమాండ్ చేసింది. అవగాహన లేని ఎంఈఓను వెంటనే బదిలీ చేసి కొత్త ఎంఈఓను నియమించాలని, అలాగే కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో టీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్ రతన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం ఎంఈఓ కార్యాలయం వద్ద జూన్ 25న తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ టీవీపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలె నాగేష్ మాట్లాడుతూ, ప్రైవేటు స్కూళ్లు వారం రోజులుగా పుస్తకాలు అమ్ముతున్నాయనే సమాచారంతో ప్రశ్నించగా, విద్యాశాఖ అధికారులే అమ్మమన్నారని యాజమాన్యాలు బదులిచ్చాయన్నారు. అయితే, ఎంఈఓకి ఫోన్ చేస్తే ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు అమ్మకూడదనే విషయంపై తనకు ఎలాంటి అవగాహన లేదని చెప్పారని నాగేష్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్పందించిన టీవీపీ, బయట మార్కెట్లో ₹2,000 నుండి ₹2,500 వరకు దొరికే పుస్తకాలను ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ₹6,000 నుండి ₹10,000 వరకు అమ్ముతున్నాయని
ఆరోపించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పాఠశాలలు సూచించిన పుస్తకాలు బయట మార్కెట్లో కనీసం మూడు వేర్వేరు బుక్ స్టాల్స్‌లో అందుబాటులో ఉండేలా తల్లిదండ్రులకు తెలియజేయాలి, కానీ దీనికి విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని టీవీపీ డిమాండ్ చేసింది. అవగాహన లేని ఎంఈఓను వెంటనే బదిలీ చేసి కొత్త ఎంఈఓను నియమించాలని, అలాగే కలెక్టర్ ఈ వ్యవహారంపై స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాలను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీవీపీ హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో టీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్, రాజ్ రతన్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
- యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో శాంతినగర్ నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.4
- ఢిల్లీ నివాసితులకు చెత్త కుప్పల నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, బయో-మైనింగ్ మరియు శాస్త్రీయ పారవేయడం వంటి పద్ధతుల ద్వారా సంవత్సరాల నాటి సమస్యకు పరిష్కారం కనుగొనబడుతోంది. దీని ద్వారా స్వచ్ఛమైన, అందమైన మరియు అభివృద్ధి చెందిన ఢిల్లీని నిర్మించే పనికి వేగవంతం చేయబడుతోంది.1
- మర్కుక్ మండలం పాతూరు గ్రామంలోని సర్వే నంబర్ 228 భూమిలో సుమారు 15 మంది గ్రామస్తులు ఇంటి నిర్మాణం కోసం ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల కింద ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు తమ స్థలాలను చదును చేస్తుండగా, ప్లాట్లు విక్రయించిన పట్టాదారుడు తమ ఇళ్లకు వెళ్లే దారిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, తాము ప్లాట్లు కొనుగోలు చేసిన సమయంలో విక్రేత ఇంటి స్థలాలకు వెళ్లే దారిని చూపించి లేఅవుట్ చేసి విక్రయించారు. అలాగే, తమ రిజిస్ట్రేషన్ పత్రాల్లో కూడా ప్లాట్లకు వెళ్లే దారికి సంబంధించిన నక్షా (మ్యాప్) స్పష్టంగా చూపించబడింది. అయినప్పటికీ, ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం చేపట్టే సమయంలో విక్రేత దారి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాడని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బాధితులు ఇప్పటికే సంబంధిత రెవెన్యూ, పంచాయతీ మరియు పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు చట్టబద్ధంగా ఉన్న దారిని కల్పించి న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.4
- ధర్మపురి పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన బీజేపీ కార్యకర్త ఆసం సురేష్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు దామేర రామ సుధాకర్ రావు పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వారి నివాసానికి చేరుకున్న ఆయన, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించడంతో పాటు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా, కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండటమే బీజేపీ లక్ష్యమని దామేర రామ సుధాకర్ రావు పునరుద్ఘాటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, భవిష్యత్తులో అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.1
- జన్నారం పోలీసులు కేవలం కేసులు నమోదు చేసి, ఖైదీలను కోర్టులో హాజరుపరచడానికే పరిమితం కాకుండా, ఒక తరాన్ని నాశనం కాకుండా కాపాడే ‘లైఫ్ గార్డ్స్’గా తమను తాము నిరూపించుకుంటున్నారు. రొటీన్ క్రైమ్ స్టోరీలకు భిన్నంగా, జన్నారం పోలీస్ స్టేషన్ ఇప్పుడు సామాజిక సంస్కరణల కేంద్రంగా మారుతోంది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ క్రైమ్ ఫ్రీ సొసైటీ విజన్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ వ్యూహాత్మక చర్యలు, ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో, జన్నారం పోలీస్ యంత్రాంగం యువత భవిష్యత్తే లక్ష్యంగా కార్యాచరణలోకి దిగింది. నూతన ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జన్నారం పోలీస్ శాఖ తన పంథాను మార్చుకుంది. కేవలం పెట్రోలింగ్‌కే పరిమితం కాకుండా, ఎక్కడ గ్రామసభ జరిగినా, ఎక్కడ నలుగురు యువకులు కనిపించినా ఎస్ఐ అక్కడికి వెళ్లి తక్షణమే స్పందిస్తున్నారు. రాజకీయ నాయకులకు, యువతకు, గ్రామస్థులకు ‘మత్తు’ మహమ్మారి వెనుక ఉన్న సామాజిక వినాశనాన్ని కళ్లకు కడుతున్నారు. జన్నారం పోలీస్ యంత్రాంగం "చట్టం తన పని తాను చేస్తుంది. కానీ యువత ప్రాణాలు పోయాక శిక్షలు వేస్తే లాభం లేదు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ (ముందు జాగ్రత్తే ముఖ్యం). గంజాయి ముఠాల ఆట కట్టిస్తాం.. యువతను రక్షిస్తాం" అని స్పష్టం చేసింది. పోలీసులు ఇచ్చిన పిలుపుతో విద్యార్థి లోకం కదిలింది. పోనకల్ రామాలయం నుండి బస్ స్టాండ్ వరకు జరిగిన భారీ అవగాహన ర్యాలీ జన్నారం చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. "డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు!" అంటూ విద్యార్థులు చేసిన నినాదాలు మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చేతుల్లో ప్లకార్డులతో విద్యార్థులు నిలబడితే, వారికి అండగా ఖాకీ సైన్యం నడిచింది. ఈ విధంగా పోలీస్ శాఖ స్టేషన్ దాటి జనంలోకి వచ్చి, లాఠీ పక్కనపెట్టి ‘బోధన’ వైపు అడుగులేస్తూ జన్నారంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.4
- కామారెడ్డి జిల్లాలోని గౌతమ్ మోడల్ స్కూల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తోందని ఆరోపిస్తూ, ఆ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని భారతీయ విద్యార్థి సంఘం జిల్లా ఇంచార్జి జి.వి.ఎమ్. విఠల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా, సంఘం సభ్యులు పాఠశాలకు సంబంధించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను చింపివేసి నిరసనగా దహనం చేశారు. ఈ సందర్భంగా విఠల్ మరియు ఆర్బాస్ ఖాన్ మాట్లాడుతూ, గౌతమ్ మోడల్ స్కూల్‌కు స్కూల్ షిఫ్టింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాథమిక విద్యార్థులకు రెండో అంతస్తులో తరగతులు నిర్వహిస్తున్నారని, అంతేకాకుండా ప్రమాదకరంగా లిఫ్టును వినియోగిస్తున్నారని వారు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రైవేట్ సంస్థలు "మోడల్" అనే పదాన్ని వాడకూడదన్న నిబంధనను కూడా పాఠశాల యాజమాన్యం బేఖాతరు చేస్తోందని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ, పాఠశాల ప్రాంగణంలోనే పుస్తకాలను విక్రయిస్తూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఈ విషయాలపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోకుండా కార్పొరేట్ పాఠశాలకు వత్తాసు పలుకుతున్న మండల విద్యాశాఖ అధికారి (MEO) పై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సంఘం కోరింది. పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరణ్ సింగ్, రాజకుమార్, అబ్దుల్ సలాం తదితరులు పాల్గొన్నారు.1
- యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా, జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల పట్టణంలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నార్కోటిక్ జాగిలాన్ని ఉపయోగించి కిరాణా దుకాణాలు, పాన్ షాప్‌లు, బస్టాండ్ మరియు విద్యాసంస్థల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో గంజాయి సరఫరా మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా, పాన్ షాప్‌లు, కిరాణా దుకాణాలు, బస్టాండ్‌ల వంటి రద్దీ ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ నంబర్ 8712671111 కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.3
- తెలంగాణవ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో గురువారం నుండి 'ఎస్.ఐ.ఆర్' (SIR) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సవరించి, పారదర్శకమైన జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఓట్ల తొలగింపుపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, అర్హులైన నిజమైన ఓటర్ల ఓట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించబడవని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బి.ఎల్.ఓ) నేరుగా ఓటర్ల ఇళ్లకు వస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా తన ఓటు వివరాలను సరిచూసుకున్నారు. బి.ఎల్.ఓ కలెక్టర్ నివాసానికి వచ్చి, రీప్రింటెడ్ ఎనిమరేషన్ ఫామ్ ద్వారా ఆయన ఓటు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో 2002 ఓటర్ల జాబితా ప్రకారం ఉన్న తన వివరాలను నమోదు చేసి, ఒక స్పష్టమైన ఫోటోను జతపరిచి బి.ఎల్.ఓకు అందజేశారు. కలెక్టర్ తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ, ప్రస్తుతం తన ఓటు ఆదిలాబాద్‌లోనే ఉన్నప్పటికీ, 2002 నాటికి అది ఇక్కడ లేదని, అప్పట్లో తన తండ్రి గారి ఓటు బీహార్‌లోని అరరియా జిల్లా, ఫార్బిస్‌గంజ్ నియోజకవర్గంలో ఉండేదని తెలిపారు. గతంలోనే దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినందున, ఇప్పుడు అదే వివరాలను ఫామ్‌లో నింపి బి.ఎల్.ఓకు అందజేశారని, బి.ఎల్.ఓ వెంటనే ఆ వివరాలను 'బి.ఎల్.ఓ యాప్' (BLO App) లో వెరిఫై చేసి సబ్మిట్ చేశారని వివరించారు. ప్రస్తుతం సాగుతున్న ఈ ఎనిమరేషన్ ప్రక్రియ ఈ రోజు నుండి జూలై 24వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. తమ తల్లిదండ్రుల ఓట్లు వేరే రాష్ట్రాల్లోనో లేదా ఇతర జిల్లాల్లోనో ఉన్నాయని చెబితే, ఇక్కడున్న తమ ఓటు కట్ అయిపోతుందేమోనని కొందరు భయపడుతున్నారని, అలాంటి అపోహలను అస్సలు నమ్మవద్దని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎనిమరేషన్ ఫామ్స్ సమర్పించిన తర్వాత జూలై 31న 'డ్రాఫ్ట్ రోల్' (ముసాయిదా ఓటర్ల జాబితా) ప్రచురించబడుతుందని, అందులో 2002 డేటాబేస్ ప్రకారం వివరాలు నింపి ఇచ్చిన వారందరి ఓట్ల వివరాలు ఉంటాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఓట్ల తొలగింపుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. నిజమైన ఓటర్లందరూ తప్పకుండా ఈ ఎనిమరేషన్ ఫామ్‌ను నింపి, అందులో తమ వివరాలతో పాటు తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ లేదా గార్డియన్ల ఓట్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. నింపిన ఫామ్‌లలో ఒక కాపీ ఓటర్ వద్ద భద్రంగా ఉంటుందని, మరొకటి బి.ఎల్.ఓకు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేటలోని బస్టాండ్‌లో బస్సును వెనక్కి తీస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన వెలగం దేవక్క గురువారం బ్యాంకు పని నిమిత్తం పట్టణానికి వచ్చారు. బస్సును రివర్స్ చేసే క్రమంలో ఆమె కాళ్ళపై నుండి బస్సు టైర్లు వెళ్లడంతో దేవక్క తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.1